Vishwambhara Item Song: ‘భోళా శంకర్’ వంటి డిజాస్టర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా ‘విశ్వంభర’ అనే భారీ బడ్జెట్ అండ్ సోసియో ఫాంటసీ మూవీ రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ‘చిరు 156’ గా మొదలైంది. ‘యూవీ క్రియేషన్స్’ బ్యానర్ పై వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. ‘బింబిసార’ దర్శకుడు మల్లిడి వశిష్ట్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. చిత్రీకరణ చాలా వరకు పూర్తయ్యింది. ఇప్పటికే గ్లిమ్ప్స్ అలాగే ఒక పాట రిలీజ్ అయ్యాయి. ఇందులో పాటకి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. గ్లిమ్ప్స్ అయితే భీభత్సమైన ట్రోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. అందుకే జనవరిలోనే రిలీజ్ చేయాల్సిన ఈ సినిమాని పలు కారణాలు చెప్పి వాయిదా వేశారు.
ఆ తర్వాత పలు కారణాలతో వాయిదా వేశారు. కొత్త డేట్ ని ఇప్పటికీ ప్రకటించింది లేదు. మే 9న ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమా రిలీజ్ రోజున సెంటిమెంట్ గా రిలీజ్ చేస్తారేమో అని అంతా అనుకున్నారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. తర్వాత ‘ఇంద్ర’ రిలీజ్ డేట్ రోజున అంటే జూలై 24న రిలీజ్ అన్నారు. అది కూడా కష్టంగానే కనిపిస్తుంది. రిలీజ్ డేట్ విషయంలో విశ్వంభర టీం ఎందుకు ఇంత సైలెన్స్ మెయింటైన్ చేస్తుంది అనేది ప్రస్తుతానికి ప్రశ్నార్థకంగా మారింది.
ఈ విషయాలు పక్కన పెడితే.. మరోపక్క బ్యాలెన్స్ ప్యాచ్ వర్క్ ఫినిష్ చేసే పనిలో ఉంది ‘విశ్వంభర’ టీం. ఇందులో భాగంగా.. సినిమాలో అతి కీలకమైన ఐటం సాంగ్ చిత్రీకరణ కొరకు రంగం సిద్ధమైంది. ఈ సినిమాకి సంగీత దర్శకుడు కీరవాణి అయితే.. అతన్ని పక్కన పెట్టి, భీమ్స్ తో ట్యూన్ కంపోజ్ చేయించుకుంటున్నాడు చిరు. ఇది ఒక రకంగా కీరవాణిని తక్కువ చేసినట్టే. ఎందుకంటే ‘ఆర్.ఆర్.ఆర్’ తో ఆస్కార్ అవార్డు అందుకున్న రేంజ్ కీరవాణిది.అందుకే ఆయన వరల్డ్ వైడ్ ఫేమస్ అయ్యారు. అలాంటి ఫిలిం మేకర్ ను ఐటెం సాంగ్ విషయంలో తీసి పక్కన పెట్టడం అనేది చిన్న విషయం కాదు కదా..! ఆ విషయాలు పక్కన పెట్టేస్తే.. ఈ ఐటెం సాంగ్ కోసం ఏ హీరోయిన్ ను తీసుకుంటారు అనేది కూడా హాట్ టాపిక్ అయ్యింది. ఊర్వశి రౌతేలా, రెజీనా వంటి హీరోయిన్లతో ఆల్రెడీ చిరు చిందేశారు. ఇప్పుడు మళ్ళీ స్పెషల్ సాంగ్ కోసం ఆ హీరోయిన్ ను తీసుకురారు కదా. అందుతున్న సమాచారం ప్రకారం… దక్ష నగార్కర్ ను ‘విశ్వంభర’ లో స్పెషల్ సాంగ్ కి తీసుకున్నట్టు టాక్ నడుస్తుంది. దక్ష మంచి డాన్సర్.. చిరు డాన్సుల గురించి చెప్పనవసరం లేదు. సో ఈ కాంబోలో సాంగ్ కొట్టగానే ఉంటుంది.