BigTV English
Advertisement

OTT Movie : బ్రతికుండగానే నాటుకోడిని నమిలి మింగేసే పిల్ల పిశాచి… హార్ట్ వీక్ గా ఉన్నవాళ్ళు చూడకూడని హర్రర్ స్టోరీ

OTT Movie : బ్రతికుండగానే నాటుకోడిని నమిలి మింగేసే పిల్ల పిశాచి… హార్ట్ వీక్ గా ఉన్నవాళ్ళు చూడకూడని హర్రర్ స్టోరీ

OTT Movie : ఓటీటీలో హారర్ జానర్ లో వచ్చిన ఒక మూవీ మంచి వ్యూస్ తో దూసుకుపోతోంది. అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీని ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ఈ స్టోరీ దుష్ట శక్తులు, దైవ శక్తుల చుట్టూ తిరుగుతుంది. విజువల్ ఎఫ్ఫెక్ట్స్ ఈ సినిమాని మరో లెవెల్ కి తెసుకెళ్తాయి. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..


ఆహా (Aha) ఓటీటీలో

ఈ హారర్-థ్రిల్లర్ మూవీ పేరు ‘తంత్ర’ (Tantra). 2024 లో వచ్చిన ఈ సినిమాకి శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వం వహించారు. ఇందులో అనన్య నాగళ్ల, ధనుష్ రఘుముద్రి, సలోని అస్వాని, టెంపర్ వంశీ, మీసాల లక్ష్మణ్, కుశలిని పులప ప్రధాన పాత్రలలో నటించారు. ఈ మూవీ 2024 మార్చి 15న థియేటర్లలో విడుదలైంది. 2024 ఏప్రిల్ 5 నుంచి Aha ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది ఒక గ్రామీణ నేపథ్యంలో జరిగే హారర్ థ్రిల్లర్.  2 గంటల 16 నిమిషాల రన్‌ టైమ్ ఉన్న ఈ సినిమాకి IMDB లో 4.9/10 రేటింగ్ ఉంది.


స్టోరీలోకి వెళితే

రేఖ (అనన్య నాగళ్ల) అనే గ్రామీణ అమ్మాయికి, ఆత్మలు, దుష్ట శక్తులను చూసే అసాధారణ శక్తి ఉంటుంది. రేఖ తన తల్లి రాజ్యలక్ష్మి మరణం తర్వాత తన తండ్రితో కలసి జీవిస్తుంటుంది. ఆమె కళాశాలలో తన స్నేహితులు తేజు, షైలు, షరత్ తో సరదాగా గడుపుతుంది. కానీ ఆమె జీవితంలో రాత్రిపూట భయంకరమైన సంఘటనలు జరుగుతాయి. రేఖ నిద్రలో నడుస్తూ ఊరి పొలిమేరకి వెళుతుంటుంది. ఆమెను ఎవరో తంత్ర విద్యలతో హింసిస్తున్నారని భయపడుతుంది. ఈ దుష్ట శక్తులు ఆమెను ఎందుకు లక్ష్యంగా చేసుకున్నాయి? రేఖ యొక్క ఈ అసాధారణ శక్తుల వెనుక రహస్యం ఏమిటి? ఆమె తల్లి మరణం ఎలా జరిగింది? ఈ ప్రశ్నల చుట్టూ కథ అల్లుకుంది. రేఖ కాలేజ్ లో తేజు అనే అతని ప్రేమలో ఉంటుంది. తేజు మాత్రం ఒక వేశ్య కొడుకుగా, సమాజంలో అవమానాలను ఎదుర్కొంటాడు. కానీ రేఖతో అతని బంధం బలపడుతుంది.

రేఖ ఆత్మలను చూడటం, రాత్రిపూట నిద్రలో నడవడం, ఆమె శరీరం నుండి రక్తం కారడం వంటి విచిత్ర సంఘటనలు ఆమెను భయపెడతాయి. రేఖను రక్షించడానికి తేజు ఒక ముస్లిం బాబా సహాయం తీసుకుంటాడు. అతను రేఖను ఒక దుష్ట తాంత్రికుడు తన ఆధీనంలో ఉంచుకున్నాడని తెలుసుకుంటాడు. ఈ క్రమంలో రేఖ గతం ఆమె తల్లి మరణం వెనుక రహస్యాలు బయటపడతాయి. ఒక శక్తివంతమైన తాంత్రికుడు, రేఖకు ఉండే అసాధారణ శక్తులను స్వాధీనం చేసుకోవడానికి, ఆమెను లక్ష్యంగా చేసుకున్నాడని తెలుస్తుంది. ఇక ఈ కథ రామాయణంలో ఇంద్రజిత్ నికుంబల అనే దుష్టశక్తిని పూజించడం, లక్ష్మణుడు ఆ ఆచారాన్ని అడ్డుకోవడంతో జరిగే ఒక స్టోరీని పొలుస్తూ చూపించడం జరుగుతుంది. చివరికి రేఖ మహాకాళి అవతారమా? ఆమె శక్తుల వెనుక ఉన్న రహస్యం ఏమిటి ? తేజు ఆమెను ఎలా కాపాడుకుంటాడు ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : అడిగితే డబ్బులు ఇచ్చే దెయ్యం… ఇలాంటి హర్రర్ మూవీని ఎక్కడా చూసి ఉండరు భయ్యా

Related News

OTT Movie : టీనేజర్ల పాడు పనులు… బాయ్ ఫ్రెండ్ ను ఊహించుకుని… చిన్న పిల్లలు చూడకూడని మూవీ

OTT Movie : ఈ సినిమాను చూస్తే పోతారు మొత్తం పోతారు… డెడ్లీయెస్ట్ మూవీ ఎవర్… ఒంటరిగా చూసే దమ్ముందా ?

OTT Movie : మంత్రగాడి అరాచకం… అమ్మాయి దొరగ్గానే వదలకుండా అదే పని… చిన్న పిల్లలు చూడకూడని చిత్రం భయ్యా

OTT Movie : ఊహించిన దానికంటే ముందుగానే ఓటీటీలోకి ‘మాస్ జాతర’… ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే ?

OTT Movie : సోదరిని వెతుక్కుంటూ దెయ్యాల కొంపకు… నెక్స్ట్ ట్విస్ట్ కు గూస్ బంప్స్… ఏ ఓటీటీలో ఉందంటే?

OTT Movie : దొంగను దేవుడిగా మార్చే కోహినూర్ డైమండ్… బిచ్చగాళ్లతో కలిసి అరాచకం… కడుపుబ్బా నవ్వించే తమిళ కామెడీ మూవీ

OTT Movie : దెయ్యాలను తరిమికొట్టే సిస్టర్స్… కుర్రాడి ఎంట్రీతో కథలో ట్విస్ట్… తెలుగులోనూ హర్రర్ మూవీ స్ట్రీమింగ్

OTT Movie : నలుగురు కుర్రాళ్ళు ఒకే అమ్మాయితో… నెలలోపే ఓటీటీలోకి క్రేజీ క్రైమ్ కామెడీ చిత్రం

Big Stories

×