BigTV English

Russia Ukraine War: 117 డ్రోన్లు 18 నెలల ప్లానింగ్.. అణుయుద్ధం దిశగా రష్యా-ఉక్రెయిన్ వార్

Russia Ukraine War: 117 డ్రోన్లు 18 నెలల ప్లానింగ్.. అణుయుద్ధం దిశగా రష్యా-ఉక్రెయిన్ వార్

Russia Ukraine War: యుద్ధం ఆపాలన్న ఆలోచన రష్యాకు లేదు. మేము ఎంతగా ప్రయత్నిస్తున్నా రష్యా నుంచి తగిన స్పందన లేదంటూ.. మొన్నటి వరకూ చెబుతూ వచ్చిన ఉక్రెయిన్ సడెన్‌గా రష్యాపై యుద్ధానికి తెగబడ్డంలో అర్ధమేంటి? జూన్ రెండున ఇస్తాంబుల్ లో శాంతి చర్చలకు ముందు ఈ దాడులేంటి? ఇంతకీ ఉక్రెయిన్ రష్యాపై చేసిన దాడులను పెర్ల్ హార్బర్ ఘటనగా రష్యన్ మీడియా అభివర్ణించడానికి గల కారణాలేంటి?


డిసెంబర్ 7, 1941లో- పెర్ల్ హార్బర్ ఘటన

హై రిజల్యూషన్ శాటిలైట్ పిక్చర్స్ రిలీజ్ చేసిన ఉక్రెయిన్డిసెంబర్ 7, 1941. పెర్ల్ హార్బర్ ఘటన. టార్గెట్ యూఎస్ నావికా దళం. దాడి చేసింది జపాన్. ఈ దాడిలో 19 US యుద్ధ నౌకలు దెబ్బ తినగా.. 188 విమానాలు నాశనమయ్యాయి. 2400 మంది మరణించారు. దీంతో అప్పటి వరకూ శాంతి జపం చేసిన అమెరికా ఒక్కసారిగా జపాన్ మీద యుద్ధం ప్రకటించింది.


41 రష్యన్ బాంబర్లు ధ్వంసం

సరిగ్గా అలాగే.. జూన్ 1, 2025న ఒకేసారి 100పైగా డ్రోన్లు.. రష్యాన్ వైమానిక స్థావరాలేకేంద్రంగా.. దాడులు చేయగా.. 41 రష్యన్ బాంబర్లను దెబ్బ తీశాయి. వీటిలో రష్యన్ ఫెడరేషన్ బాంబర్ ఫ్లీట్స్ 30 శాతంపైగా ధ్వంసమయ్యాయి. వీటిలో Tu-95, Tu-22లు, A-50 ఎయిర్‌బోర్న్ రాడార్‌లు – ఉక్రేనియన్ డ్రోన్‌ల ద్వారా నాశనమయ్యాయి.

పెర్ల్ హార్బన్ ఘటనగా అభివర్ణించిన రష్యన్ మీడియా

ఉక్రెయిన్ చేసిన ఈ అనూహ్య దాడిని రష్యన్ మీడియా మరో పెర్ల్ హార్బర్ ఘటనగా అభివర్ణిస్తోంది. కారణం ఆనాడు రెండో ప్రపంచ యుద్ధ సమయంలో శాంతియుతంగా ఉన్న అమెరికాను జపాన్ రెచ్చగొట్టడంతో ఆ దేశం.. యుద్ధంలోకి విధిలేని పరిస్తితుల్లోకి రావల్సి వచ్చిందని చెబుతుంది చరిత్ర. సరిగ్గా అలాగే.. ఈ యుద్ధంలో కూడా రష్యాను ఉక్రెయిన్ రెచ్చగొట్టిందని చెప్పడానికి సూచనగా.. రష్యన్ మీడియా ఈ పోలిక తెస్తోంది.

స్టాండ్ ఆఫ్ వెపన్స్ రష్యన్ బాంబర్లపై దాడి

వందకు పైగా డ్రోన్లు.. షిప్పింగ్ కంటైనర్ల నుంచి ఒక్కసారిగా వదిలింది ఉక్రెయిన్.. ఇవి రష్యన్ వైమానిక స్థావరాలను దాటుతుండగా.. లిఫ్ట్ డ్రోన్లను విడుదల చేశాయి. ఆల్రెడీ టార్గెట్లు ఫిక్స్ చేసిన ఈ డ్రోన్ల నుంచి స్టాండ్ ఆఫ్ వెపన్స్ ద్వారా.. రష్యన్ బాంబర్లపై కి విరుచుకుపడ్డాయి.

మే 16న రష్యా- ఉక్రెయిన్ శాంతి చర్చలు

రష్యా ఉక్రెయిన్ మధ్య మే 16న తొలి శాంతి చర్చలు జరిగాయి.. జూన్ 2న రెండో విడతగా ఇస్తాంబుల్లో జరగాల్సి ఉంది.. సరిగ్గా ఈ టైంలో.. ఇలాంటి దాడులేంటో అర్ధం కాని పరిస్థితి. మే 16న జరిగిన తొలి శాంతి చర్చల్లో.. ఇరు పక్షాల మధ్య అతి పెద్ద ఖైదీల మార్పిడి జరిగింది. రెండో విడత చర్చల సందర్బంగా.. మరెలాంటి శాంతియుత వాతావరణం వెల్లివిరుస్తుందో అని ఎదురు చూస్తున్నారంతా. ఈ లోగా ఉక్రెయిన్ ఇంత భారీ దాడి చేయడంతో.. ఈ యుద్ధం ఏ తరానికి? ఇప్పట్లో ఆగుతుందా? అన్న ఆందోళనకు ఆస్కారమేర్పడుతోంది.

ఏడాది కాలం నుంచి దాడులకు ప్రణాళిక

ఉక్రెయిన్ ఈ దాడులను ఏడాది కాలం నుంచి ప్రణాళిక రచించినట్టు తెలుస్తోంది. ఈ మొత్తం ఆపరేషన్ని అధ్యక్షుడు జెలెన్ స్కీ పర్యవేక్షించినట్టు సమాచారం. శాంతి చర్చలు జరపడానికి ముందు రోజు ఇలాంటి దాడులు నిర్వహించడమేంటన్నది ఇప్పుడు అర్ధంకాని ప్రశ్నగా మారింది. ఇప్పటి వరకూ ఉక్రెయిన్ రష్యాపై ఇంత పెద్ద దాడి ఎప్పుడూ చేయలేదు. దాడి చేసే ముందు వరకూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ అన్న మాటలు వేరు. ఇప్పుడు జరిగింది వేరు. రష్యా యుద్ధం ఆపేలా లేదంటూ ఆరోపించారు. అలాంటివాడు ఈ దాడులు చేసి రష్యాకు గానీ ఈ ప్రపంచానికి గానీ ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? అన్న ప్రశ్న తలెత్తుతోంది.

1976లో ఉగాండా ఎంటెబ్బేపై ఇజ్రాయెల్ దాడి

ఇలాంటి దాడులు ఇప్పటి వరకూ ఎక్కెడెక్కడ జరిగాయని చూస్తే.. 1976లో జూలై లో ఉగండా ఎంటెబ్బే విమానాశ్రయంపై ఇజ్రాయెల్ ఒక దాడి చేసింది. ఇక 2023లో లెబనాన్ లో వెయ్యి మందికి పైగా హిజ్బుల్లా కార్యకర్తల టార్గెట్ గా ఒకే సారి పేజర్లు పేలాయి. ఈ దాడికి ఇజ్రాయెల్ కారణమని అంటారు. కానీ ఆ దేశం ఈ విషయాన్ని ఖండించింది. ఇక 1971 ఆగస్ట్ 15 రాత్రి.. భారత నావికా దళం.. తూర్పు పాకిస్థాన్ ఓడరేవులపై సరగ్గా ఇలాగే దాడి చేసింది.

రష్యా వర్సెస్ నాటోగా ఉక్రెయిన్ యుద్ధం

రష్యా- ఉక్రెయిన్ యుద్ధన్ని మాస్కో వర్సెస్ నాటో పరోక్ష యుద్ధంగానూ చెప్పుకోవచ్చు. ఉక్రెయిన్ దళాలు పాశ్చాత్య దేశాలు సరఫరా చేసిన ఆయుధాలు ఇతర కమ్యూనికేషన్ వ్యవస్థను ఉపయోగించి సర్ ఫేస్ వార్ చేస్తున్నాయి. ఈ ధోరణి చాలా కాలంగా రష్యాను ఇరుకున పెడుతోంది. దీంతో రష్యా యూరప్ వ్యాప్తంగా ఉన్న నాటో ఆయుధ స్థావరాలను టార్గెట్ చేసుకుని దాడి నిర్వహిస్తామని హెచ్చరించింది.

పాశ్చాత్య దేశాల ప్రమేయం లేదు- జెలెన్ స్కీ

అయితే ఈ దాడిలో మాత్రం పాశ్చాత్య దేశాల ప్రమేయం లేకుండానే తాము స్వయంగా దాడులు చేశామని అంటోంది ఉక్రెయిన్. ఈ దిశగా జెలన్ స్కీ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు కూడా. రష్యా దీనంతటికీ నాటోయే కారణమని భావించకుండా ఉండేందుకు జెలెన్ స్కీ ఈ జాగ్రత్త పాటించినట్టు తెలుస్తోంది.

ఉక్రెయిన్ కి నాటో లాంగ్ రేంజ్ టారస్ మిస్సైళ్ల సరఫరా

ఈ దాడికి తాము ఉపయోగించిన వాటిలో నాటో ఆయుధాలు ఏవీ లేవంటోంది ఉక్రెయిన్. ఇప్పటికే కొన్ని నాటో దేశాలు.. ఉక్రెయిన్ కి లాంగ్ రేంజ్ టారస్ మిస్సైళ్లను సరఫరా చేశాయి. ఇవేవీ ఈ అటాక్ లో మేము యూజ్ చేయలేదంటోందీ దేశం. తాము చేసిన దాడులు ఎలాంటివో చెప్పేలా.. ఉక్రెయిన్ హై రిజల్యూషన్ శాటిలైట్ చిత్రాలను సైతం రిలీజ్ చేసింది.

ఇప్పుడు అందరి టెన్షన్ ఏంటంటే రష్యా రియాక్షన్ ఎలా ఉంటుంది?

ఇప్పుడు అందరి టెన్షన్ ఏంటంటే రష్యా రియాక్షన్ ఎలా ఉంటుంది? ఈ దాడులను తేలిగ్గా తీసుకుంటుందా? లేక సీరియస్ యాక్షన్ తీస్కుంటుందా? యుద్ధం జరగబట్టి.. మూడేళ్లవుతుంటే.. శాంతి చర్చలతో సమస్యను సానుకూల పరచాల్సిన ఉక్రెయిన్ ఆల్ ఆఫ్ సడెన్ గా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నట్టు? ఇందులో ఉక్రెయిన్ ఫాలో అయిన స్ట్రాటజీ ఏంటి? రష్యా రివర్స్ స్ట్రాటజీ ఎలా ఉండనుంది?

రష్యా అణ్వాయుధాలు ప్రయోగిస్తుందా?

ప్రస్తుతం అందరి ఆలోచనల్లా ఒకటే.. రష్యా ఇందుకు ప్రతిగా అణ్వాయుధాలను ప్రయోగిస్తుందా? ఏం చేయనుంది? ఇప్పటికే రష్యా ఈ తరహా హెచ్చరిక జారీ చేసింది. ఉక్రెయిన్ ఈ దాడితో.. రష్యాకు ఆ చాన్స్ ఇచ్చినట్టు భావించాలా? అన్న చర్చకు ఆస్కారమేర్పడుతోంది.

ఈ దాడితో రష్యాకు ఉక్రెయిన్ ఆ ఛాన్స్ ఇచ్చిందా?

జూన్ 1న ఉక్రెయిన్ చేసిన పని ఏమంత చిన్నది కాదు. రష్యాకు అత్యంత కీలకమైన వైమానిక దళాన్ని అటాక్ చేసింది. దీంతో రష్యా వాయు వేగానికి అమాంతం బ్రేకులు వేసినట్టయ్యింది. ఎందుకంటే రష్యా తమపై అణుబాంబులు వేకుండా కీలెరిగి వాతపెట్టడంలో భాగంగానే ఇదంతా చేసినట్టు అంచనా వేస్తున్నారు కొందరు యుద్ధ నిపుణులు. అందుకే ఈ దాడి చేసిందా? అన్న చర్చకు కూడా తెరలేచింది.

ప్రతీకారం తీర్చుకోవడం ఖాయమన్న రష్యన్ అధికారులు

అయితే రష్యా అధికారులు మాత్రం తాము ప్రతీకారం తీర్చుకోవడం ఖాయమని ప్రకటించారు. దీన్నిబట్టీ చూస్తుంటే రష్యా ముందు ఆప్షన్లేంటన్నదొక డిబేట్ గా మారింది. రష్యా ఈ దాడికి ప్రతీకారంగా హైపర్ సోనిక్ లేదా ఒరేష్నిక్ లను ప్రయోగించలగదు. ఒక వేళ అదే జరిగితే.. వాటిని అడ్డుకోవడం ఉక్రెయిన్ సాధ్యం కాదన్న అంచనాలున్నాయ్.

ఒరేష్నిక్ ఒక హైపర్ సోనిక్ బాలిస్టిక్ క్షిపణి

రష్యన్ ఒరేష్నిక్ ఒక హైపర్ సోనిక్ బాలిస్టిక్ క్షిపణి. అంటే ఇది శబ్ధం కన్నా వేగంగా ప్రయాణించగలదు. అంతే కాదు ఏకకాలంలో.. వివిధ లక్ష్యాలను చేరుకోగల వార్ హెడ్లను కలిగి ఉంటుంది. ఇది సరికొత్త ఇంటర్మీడియట్ రేంజ్ మిస్సైల్. ఒరేష్నిక్ అంటే హాజెల్ ట్రీ అని అర్ధం. దీన్ని వాయు రక్షణ విధానంలో అడ్డుకోవడం కూడా కష్టమే. తేడా కొడితే వీటి దెబ్బ రుచి చూడాల్సి ఉంటుందంటూ పుతిన్ ఇది వరకే హెచ్చరించి ఉన్నారు. మరి వీటి తడాఖా ఏంటో ఉక్రెయిన్ చూసే పరిస్థితి రాబోతోందా? అన్న అనుమానాలున్నాయి.

ప్రజెంట్ డ్రోన్ వార్ ఏజ్ లో ఉన్న ప్రపంచం

ప్రస్తుత పరిస్థితులను చూస్తే ప్రపంచం డ్రోన్ వార్ ఏజ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. మొన్న భారత్ మీదకు పాక్ టర్కిష్‌ డ్రోన్లను వదిలింది. ప్రస్తుతం ఉక్రెయిన్ కూడా ఈ డ్రోన్ వార్ స్ట్రాటజీని అప్లై చేసినట్టు తెలుస్తోంది. విచిత్రమైన విషయమేంటంటే మనం పాకిస్థాన్ ప్రయోగించిన టర్కిష్ డ్రోన్లను రష్యన్ మేడ్ S-400 లను వాడి కౌంటర్ అటాక్ చేశాం, అలాంటి వాయు రక్షణ వ్యవస్థను తయారు చేసిన రష్య.. తమ టెక్నాలజీ తామే వాడలేక పోవడం విడ్డూరంగా మారింది. అయితే ఇది ఊహించని దాడి కావడంతో.. రష్యా ఈ ఎదురు దెబ్బ చవిచూడాల్సి వచ్చిందని అంటున్నారు.

ప్రెజంట్ యాంటీ డ్రోన్ సిస్టమ్ కి డిమాండ్

ప్రస్తుతం డ్రోన్ల వ్యవస్థ ఎలా తయారైందంటే. చిన్న చిన్న ఆయుధాల నుంచి పెద్ద పెద్ద యుద్ధ విమాన వ్యవస్థలను సైతం రీప్లేస్ చేస్తున్నాయి. యాంటీ డ్రోన్ వ్యవస్థ- వార్ ఫీల్డ్ లో అత్యంత డిమాండ్ గల సిస్టమ్ గా తయారైంది.

ఇరు దేశాల దగ్గర 10 వేల ఫస్ట్ పర్సన్ వ్యూ డ్రోన్స్

ఇంతకీ రష్యా- ఉక్రెయిన్ దగ్గర ఎలాంటి డ్రోన్లు ఉన్నాయని చూస్తే రెండు దేశాల దగ్గర పదివేల ఫస్ట్ పర్సన్ వ్యూ డ్రోన్లు, వాటి అడ్వాన్స్డ్ వర్షెన్లయిన వైర్ గైడెడ్ FPE డ్రోన్లు.. ఉన్నాయి. వీటినైతే జామ్ చేయడం కూడా సాధ్యం కాదు. అబేధ్యమైన డ్రోన్ వాల్ ని సైతం ఇవి క్రియేట్ చేయగలవు.

1వరల్డ్ వార్ లో ఫిరంగులు, మిషిన్ గన్ల రాక

మొదటి ప్రపంచ యుద్ధంలో కూడా సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఉండేది. ఆ సమయంలో ఫిరంగులు, మిషిన్ గన్ల రాక యుద్ధరంగాన్ని అత్యంత ప్రమాదకరంగా మార్చింది. ఇవి ఆనాటి వార్ ఫీల్డ్ గేమ్ ఛేంజర్స్ గా మారాయి. యుద్ధ భూమిలో కందక వ్యవస్థ ద్వారా యుద్ధాలు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ప్రస్తుతం మారిన పరిస్థితులను బట్టీ చూస్తే.. డ్రోన్లు యుద్ధంలో విప్లవాత్మక మార్పును తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఎక్కడో కూర్చుని ఆపరేట్ చేసే డ్రోన్లను వాడి అటాక్స్ చేస్తున్నారు. వీటిని తిప్పి కొట్టడానికే ఇజ్రాయెల్ లేజర్ టెక్నాలజీ తీసుకొచ్చింది. దీంతో డ్రోన్స్ కి విరుగుడు లేజర్ గా మారింది వార్ ఫీల్డ్ డైనమిజం.

పెర్ల్ హార్బర్ తో పోల్చడం ఆందోళనకరం

దీన్నిపుడు పెర్ల్ హార్బర్ ఘటనతో రష్యన్ మీడియా పోల్చడం మరో వైపరీత్యానికి దారి తీసే ప్రమాదం కనిపిస్తోంది. అప్పటి వరకూ యుద్ధానికి దూరంగా ఉన్న యూఎస్ ఈ దాడి తర్వాత అణ్వాయుధాన్ని కనిబెట్టి మరీ.. జపాన్ పై దాడులు చేసింది. తన ప్రతీకారం తీర్చుకుంది. మరి రష్యా కూడా సరిగ్గా ఇలాగే రియాక్టయితే పరిస్థితి ఏంటి? అన్నదిప్పుడు సమస్యాత్మకంగా మారింది.

వీరి మధ్య శాంతి చర్చలు చేసేవారెవరు?

ఇటీవలి ఆపరేషన్ సిందూర్ లో భారత్- పాక్ మధ్య సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఏర్పడితే.. అమెరికా ఉలిక్కి పడి ఈ ఘర్షణాత్మక వాతావరణాన్ని ఆపింది. మరి రష్యా ఉక్రెయిన్ పై అణుదాడి చేస్తే ఆపే దేశాలేవి? అని చూస్తే.. అసలీ యుద్ధం జరుగుతోందే నాటో వర్సెస్ రష్యాగా చెప్పాల్సి ఉంటుంది. మరి వీరి మధ్య శాంతి చర్చలకు ప్రయత్నించేవారెవరు? అన్నది తేలాల్సి ఉంది.

యుద్ధం కొలిక్కి వస్తుందనుకుంటే ఈ దాడులేంటి?

అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కొందరు జెలెన్ స్కీని హీరోగా భావిస్తుంటే మరి కొందరు విలన్‌గా చూస్తున్నారు. మూడేళ్ల నుంచి జరుగుతోన్న ఈ యుద్ధం నేడో రేపో ఒక కొలిక్కి వస్తుందనుకుంటే.. ఇలాంటి పరిణామం సరి కాదన్న భావన వ్యక్తమవుతోంది.

ఉక్రెయిన్ ఈ దాడులకు పెట్టిన పేరు స్పైడర్ వెబ్

స్పైడర్ వెబ్ పేరిట ఉక్రెయిన్ రష్యన్ విమానాలను ఇలా ధ్వంసం చేయడమే కాకుండా వాటికి బాధ్యత వహిస్తూ జలెన్ స్కీ ఎప్పటికప్పుడు ఎక్స్ లో పోస్టులు పెడుతున్నారు. అంతే కాకుండా.. మా స్పెషల్ ఫోర్స్ అధిపతి వాసిల్ మలియుక్ అద్భుతమైన ఆపరేషన్ నిర్వహించారని మెచ్చుకోవడం రష్యన్ అధికారులను అట్టుడికిస్తోంది. తమ ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీసెస్ సిబ్బందికి థాంక్స్ అంటూ జెలెన్ స్కీ- సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేయడం కూడా రష్యాను మరింత కాక రేకెత్తిస్తోంది.

ఈ యుద్ధం ఏ మలుపు తీసుకుంటుందో అన్న ఉత్కంఠ

దాదాపు 4 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను తాము చేధించడం గర్వకారణంగా ఉందంటూ జెలెన్ స్కీ గొప్పలు చెప్పుకోవడం తిప్పలు కొని తెచ్చుకోవడమేనంటారు కొందరు. ఇర్క్యూట్ తదితర ప్రాంతాల్లో దాడులు జరిగింది నిజమేనని రష్యా కూడా ప్రకటించడంతో ఇప్పుడీ యుద్ధం ఏ మలుపు తీసుకుంటుందో అన్న ఉత్కంఠకు తెరలేచింది.

-Story By Adinarayana, BigTv Live

 

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×