Gundeninda GudiGantalu Today episode june 6th: నిన్నటి ఎపిసోడ్ లో.. సత్యం పూలను చూసి సంతోషంగా ఫీల్ అవుతుంటాడు. ఇన్ని పువ్వులు ఇలా ఒక్కచోటే చూస్తుంటే ఈ వాసనకి నాకు మనసు ప్రశాంతంగా ఉంది అని అంటాడు. మీరు ఇవే చూస్తున్నారు పూల మార్కెట్ కు రండి.. ఇంకెన్ని పూలు అక్కడ ఉంటాయో అని అక్కడున్న ఒక ఆవిడ అనగానే సత్యం అవునా అమ్మ మనసు ప్రశాంతంగా ఉండాలంటే పూల మార్కెట్ కి రావాలని అంటాడు.. ప్రభావతి లోపలికి వెళ్లి కామాక్షికి ఫోన్ చేసి అర్జెంటుగా నువ్వు మా ఇంటికి రావాలని అడుగుతుంది. ప్రభావతి ఇల్లు మొత్తం పూలు ఉండడం చూసి కామాక్షి మా వదిన పూల కొట్టేమన్న పెట్టేసిందా అంటూ సెటైర్లు వేస్తుంది.. వంటబ్బాయిగా రవి మారిపోతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. అందరూ పూలమాలలు కడుతుంటే ప్రభావతి టీలు సర్వ్ చేస్తుంది. ఇక మరోసారి పూలొచ్చాయి మాలలు కట్టడానికి మనోజ్ రారా తీసుకొద్దామని అంటాడు బాలు. కానీ మనోజ్ మాత్రం నేను కెనడాకు వెళ్లాల్సినవాన్ని ఇలా పూలు మోయాలా అనేసి అంటాడు. దానికి బాలు నువ్వు కూడా సత్యం కొడుకువే అన్న సంగతి మర్చిపోవద్దు రా రా అని తీసుకెళ్లిపోతాడు. ఇక రవి తన కిచిడీతో అందరికీ కడుపునిండా భోజనం పెడతాడు. మనోజ్, రవిలు మాత్రం మేము ఆర్డర్ పెట్టుకుంటాం మాకొద్దు అనేసి అంటారు. ఈ విన్న బాలు మనోజ్ పై సెంటర్లు వేస్తాడు.
మీరందరూ ఇంత సంతోషంగా నా ఇల్లంతా పూలతో నింపేసి మాలలు కడుతున్నారు. ఇలాంటి సమయంలో నా కూతురు నాతో ఉంటే బాగుండు అని సత్యం ఫీల్ అవుతూ ఉంటాడు. మీరు అనండి నాన్న నేను వెళ్లి మౌనికని తీసుకొస్తానని బాలు అంటాడు. నువ్వు వెళ్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు జీవితంలో మౌనికను ఈ ఇంటికి పంపించారని ప్రభావతి అంటుంది. ఇక బాలు ఫోన్ చేస్తే మౌనిక లిఫ్ట్ చేసి అందరితో మాట్లాడుతుంది. అందరూ సంతోషంగా మౌనికతో మాట్లాడతారు.
మౌనిక తో అందరు ఫోన్ మాట్లాడుతుండటం చూసి రోహిణి మెల్లగా జారుకుని వంట గదిలో రవి చేసిన కిచిడి తినడానికి వెళ్తుంది.. మనోజ్ కూడా కిచిడీ తినడానికి దొంగగా వెళ్తాడు. ఇద్దరు కలిసి వంట గదిలో కూర్చొని కడుపునిండా తినేసి వస్తారు. నీళ్ల కోసం వచ్చిన బాలు వాళ్ళిద్దర్నీ చూసి కూడా మౌనంగా వెళ్ళిపోతాడు. తర్వాత అందరూ రవి కిచిడి బాగుందంటూ పొగడ్తల వర్షం కురిపిస్తారు. ఇంత బాగా వంట చేస్తున్నావు కదా నువ్వు మంచి హోటల్ పెట్టుకో అనేసి సలహా ఇస్తారు. కామాక్షి శృతిని నువ్వు చాలా అదృష్టవంతురాలివి అమ్మ ఇంత మంచి వంట చేసి పెట్టి భర్త దొరకడం మీ అదృష్టం అని అంటుంది. అతని వంట నచ్చింది కాబట్టి నేను వెంటపడి మరి ప్రేమించి పెళ్లి చేసుకున్నానని శృతి అంటుంది.
ఇక ఆ తర్వాత సుమతి రవి వంట బాగా ఉందని మెచ్చుకుంటుంది.. ప్రభావతి శృతిని గదిలోకి తీసుకెళ్లి సుమతి అంత క్లోజ్ గా ఉంటే నువ్వు ఏం ఫీల్ అవ్వట్లేదా అమ్మ అని అడుగుతుంది. రోజుల్లో ఇలాంటివన్నీ కామన్ ఆంటీ మీరు ఏమీ పట్టించుకోవద్దు అని ప్రభావతి రివర్స్ పంచువేస్తుంది. కానీ మీకు ఒక క్లారిటీ ఇస్తాను పదండి ఆంటీ అని ప్రభావతిని అక్కడికి తీసుకెళ్తుంది. అందరి దగ్గరికి వెళ్లి సుమతి రవి తో క్లోజ్ గా ఉండడం మీకు ఎవరికైనా అభ్యంతరంగా ఉందా అనేసి అడుగుతుంది. మా సుమతి చాలా మంచిది మాకెందుకు అభ్యంతరమవుతుందని బస్తీ జనాలు అంటారు. ఇక రవి శృతి ఏమైంది ఏం చేస్తున్నావ్.? నాకేమీ అనుమానం లేదు మీ అమ్మకే అనుమానంగా ఉంది అందుకే క్లారిటీ ఇద్దామని ఇలా తీసుకొచ్చాను అని శృతి ప్రభావతికి దిమ్మతిరిగే షాక్ ఇస్తుంది.
ఆంటీ మీ రోజుల్లో అలా ఉండే వారేమో.. మీరు అంకుల్ కోసం వచ్చిన వాళ్ళతో మాట్లాడితే తప్పుగా అంకుల్ అనుకున్నారా..? కాలంలో పద్ధతులు ఈ కాలంలో ఎవరు పాటించరు ఆంటీ. మీరు ఇది గమనించండి నాకు నా భర్త మీద నమ్మకం ఉంది అని గుబ గుయ్యినెల సమాధానం చెబుతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..