BigTV English

OTT Movie : ఒకే ఒక్క ఫోన్ కాల్ తో కేసు సాల్వ్… గ్రిప్పింగ్ థ్రిల్లర్… ఈ లేడీ సింగమ్ అడ్వెంచర్ కు హ్యాట్సాఫ్

OTT Movie : ఒకే ఒక్క ఫోన్ కాల్ తో కేసు సాల్వ్… గ్రిప్పింగ్ థ్రిల్లర్… ఈ లేడీ సింగమ్ అడ్వెంచర్ కు హ్యాట్సాఫ్

OTT Movie : లాస్ ఏంజిల్స్‌లోని 911 కాల్ సెంటర్‌ అది. ఒక పోలీసు అధికారికి ఒక మహిళ నుండి భయాందోళనతో కూడిన కాల్‌ వస్తుంది. ఆమె తనను ఒక వ్యాన్‌లో కిడ్నాప్ చేశారని, అక్కడ తన భర్తతో ఉన్నట్లు చెప్పడానికి ప్రయత్నిస్తుంది. కానీ కాల్ అకస్మాత్తుగా కట్ అవుతుంది. ఈ మహిళ ఎవరు? ఆమెను కిడ్నాప్ చేసిన వ్యక్తి ఒక సైకో కిల్లరా? ఈ పోలీస్ కేవలం ఫోన్ కాల్స్ ద్వారా ఆమెను రక్షించగలడా? లేక ఈ కేసు అతని గతంలోని రహస్యాలను బయట పెడుతుందా? అనేది తెలియాలంటే మూవీకి సంబంధించిన వివరాలపై ఓ లుక్కేద్దాం పదండి.


కథలోకి వెళ్తే…

జో బేలర్ (జేక్ గిల్లెన్‌హాల్), ఒక సస్పెండెడ్ LAPD పోలీసు అధికారి. తనకు సంబంధించిన కోర్టు కేసు రిజల్ట్ కోసం వెయిట్ చేస్తాడు. అంతవరకు 911 కాల్ సెంటర్‌ లో డెస్క్ జాబ్‌ లో పని చేస్తాడు. లాస్ ఏంజిల్స్‌ లో వైల్డ్‌ ఫైర్స్ రాగింగ్ అవుతున్న టైమ్ లో జో ఎమిలీ లైటన్ (రిలే కీఫ్ గొంతు) అనే మహిళ నుండి ఒక కాల్ వస్తుంది. ఆమె టెన్షన్ లో ఉందన్న విషయం కాల్ ద్వారా తెలుస్తుంది. ఎమిలీ ఫోన్లో జవతో మాట్లాడుతూ… తనను కిడ్నాప్ చేశారని, తన భర్త హెన్రీ ఫిషర్ తో ఒక వ్యాన్‌లో ఉన్నట్లు చెబుతుంది. అంతలోనే కాల్ అకస్మాత్తుగా కట్ అవుతుంది.


జో, తన సహోద్యోగి రిక్ (ఇలై గోరీ), సీనియర్ సర్జెంట్ డెనిస్ (క్రిస్టినా విడాల్) సహాయంతో, ఎమిలీని రక్షించడానికి ప్రయత్నిస్తాడు, జో ఫోన్ కాల్స్, తన దగ్గరున్న ఆ పరిమిత సమాచారం ద్వారా ఎమిలీ ఆచూకీని గుర్తించడానికి తన పోలీసు స్కిల్స్‌ ను ఉపయోగిస్తాడు. అతను ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఎమిలీ ఆరేళ్ల కూతురు అబ్బీ (కాట్ కానర్ స్టెర్లింగ్ గొంతు)ని కాంటాక్ట్ చేస్తాడు. ఆమె తన తల్లి గురించి ఆందోళనలో ఉందని తెలుస్తుంది. జో దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ, ఎమిలీ – హెన్రీ గతంలోని ఒక ట్రామాటిక్ సంఘటన, ఒక సైకలాజికల్ రహస్యంతో ముడిపడి ఉందని తెలుస్తుంది.

జో తన గతంలోని ఒక ఘోరమైన సంఘటన, కోర్టులో నడుస్తున్న ఒక హత్య కేసుతో పోరాడుతూ, ఈ కేసును ఛేదించడానికి తన అనుభవాన్ని ఉపయోగిస్తాడు. హెన్రీ ప్రవర్తన, ఎమిలీ మానసిక స్థితి, వాళ్ళ ఇంట్లో జరిగిన సంఘటనలతో సినిమా గ్రిప్పింగ్ నరేషన్ తో సాగుతుంది. ఈ చిత్రం ఒక సింగిల్ లొకేషన్‌లో, 911 కాల్ సెంటర్ లో జరిగే సైకలాజికల్ డ్రామా. బ్రాడ్ ఆండర్సన్ టైట్ డైరెక్షన్‌తో ఒక గ్రిప్పింగ్ థ్రిల్లర్ ఎక్స్పీరియన్స్ ను ఇస్తుంది. ఇంతకీ ఒకే ఒక్క కాల్ ద్వారా ఆ కేసును ఎలా సాల్వ్ చేశారు? జో గతానికి ఈ కేసుకు ఏదైనా సంబంధం ఉందా? చివరికి ఏం జరిగింది? అనేది సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : చచ్చే ముందు గుండె పగిలే నిజం చెప్పే భార్య… ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదురా సామీ

ఈ మూవీ ఏ ఓటీటీలో ఉందంటే?

ఈ సస్పెన్స్ సైకో థ్రిల్లర్ మూవీ పేరు ‘The Guilty’. 2021లో రిలీజ్ అయిన ఈ మూవీ Netflixలో అందుబాటులో ఉంది. IMDbలో 6.3 రేటింగ్ ఉన్న ఈ మూవీలో జేక్ గిల్లెన్‌హాల్, రిలే కీఫ్, పీటర్ సార్స్‌గార్డ్, క్రిస్టినా విడాల్, ఇలై గోరీ, ఈథన్ హాక్ నటించారు. ఆంటోయిన్ ఫుక్వా దర్శకత్వం వహించారు.

Related News

OTT Movie : మంత్రగత్తె పెట్టే శాపం … ఊహించని ట్విస్టులు, తట్టుకోలేని భయాలు … క్లైమాక్స్ కూడా మరో లెవల్ సామీ

OTT Movie : స్టోరీ అంతా రాణీగారి డైమెండ్ చుట్టూనే … దిమ్మతిరిగే ట్విస్ట్లు, కన్నింగ్ ఐడియాలతో ఓటీటీ షేక్

OTT Movie : కొండక్కి కంగారు పెట్టే దెయ్యాలు … చలి, జ్వరం వచ్చే సీన్స్ … అమ్మాయిలను దారుణంగా …

OTT Movie : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్

OTT Movie : స్టూడెంట్ ప్రైవేట్ ఫోటో లీక్… టీచర్ చేసే సైకో పనికి మెంటలెక్కల్సిందే

OTT Movie : స్విమ్మింగ్ పూల్ లో శవం… బర్త్ డే రోజు దిమ్మతిరిగే గిఫ్ట్… ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే డైరెక్ట్ గా పరలోకానికే

Big Stories

×