Gundeninda GudiGantalu Today episode march 18th : నిన్నటి ఎపిసోడ్ లో.. మౌనిక ఫంక్షన్‌లో ఉండొద్దని బాలుకు ఎలా చెప్పాలో తెలియక ఆలోచనలో పడతాడు సత్యం. బాలు ఉండటం వల్ల తలెత్తే అనార్థాలేమిటో చెబితే సరిపోతుంది అంటూ తేలిగ్గా మాట్లాడుతుంది ప్రభావతి. బాలు విషయంలో నువ్వు ఉన్నంత కఠువుగా నేను ఉండలేనని సత్య బదులిస్తాడు. బాలుతో నేనే మాట్లాడుతానని ప్రభావతి అంటుంది. అక్కరలేదని సత్యం సమాధానమిస్తాడు.. మీకు మౌనిక ఫంక్షన్ జరగాలంటే మాత్రం బాలు ఇంట్లో ఉండకూడదు అని సమాధానం ఇస్తుంది. సత్యం మాత్రం ఏం చెయ్యాలి అని ఆలోచిస్తాడు. అటు మీనా భర్తను ప్రేమగా చూసుకుంటుంది. బాలు చెల్లెలి ఫంక్షన్ దగ్గరుండి అన్నీ చూసుకోవాలని హడావుడి చేస్తాడు. పెళ్లి కొడుకులాగా ముస్తాబు అయ్యి తొందరగా పనులు కావాలని హడావిడిగా ఉంటాడు. రవిని ఈ క్రమంలో ఒక ఆట ఆడుకుంటాడు. రవిని లేచిపోయినోడా నువ్వు వంటవాడివే కదా మీ వదినకి సాయం చేయొచ్చు కదా అని అనగానే. నువ్వు నల్ల బీమా అని నన్ను ప్రేమగా పిలిస్తే నేను వదినకు ఖచ్చితంగా సాయం చేస్తాను అంటాడు. కానీ బాలు మాత్రం మీనా ఈ వంట పని నువ్వే కష్టపడి ఎలాగోలాగా పూర్తి చేయు వీడిని మాత్రం నేను నల్ల బీమా అని పిలిచేది లేదు అంటూ సరదాగా మాట్లాడుతాడు. అందరితో సరదాగా ఉంటారు. ప్రభావతి చెప్పిన మాటతో బాలు గుండెలు పగిలేలా ఏడుస్తాడు మౌనిక ఫంక్షన్ బాగా జరగాలి నేను వెళ్ళిపోతాను అని అంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. నువ్వేం బాధపడకు మేనా నేను లేకున్నా కూడా ఈ ఫంక్షన్ బాగా జరుగుతుంది నువ్వున్నావు కదా అని బాలు మీ నాకు ధైర్యం చెప్పి బయలుదేరుతుంటాడు. కానీ మీనా మాత్రం మీరు టిఫిన్ చేసి బయలుదేరాలి మీకోసం టిఫిన్ చేశాను రాత్రి కూడా సరిగ్గా తినలేదు అని అంటుంది. ఇక అప్పుడే రాజేష్ వచ్చి ఇదిగో పుస్తెలతాడు అని ఇచ్చేసి వెళ్తాడు. బాలు టిఫిన్ చేయడానికి కూర్చుంటే ప్రభావతి వచ్చి వీడు ఇంకా వెళ్ళలేదు ఏంటి ఇంకా టిఫిన్ చేస్తూ కూర్చున్నాడా వాళ్ళు వస్తే ఎంత గొడవ జరుగుతుందో అనేసి టెన్షన్ పడుతూ ఉంటుంది..
అదేంటి అత్తయ్య అలా మాట్లాడుతారు టిఫిన్ చేయడం కూడా తప్పేనా టిఫిన్ చేసి వెళ్ళిపోతారు లే అని మీనా అంటుంది. ఒక్క పూట టిఫిన్ చేయకపోతే వాడేమీ ఇది అయిపోడు. బయట టిఫిన్ సెంటర్ లేవా అని అనగానే మీనా నాకు ఇప్పుడు ఇంకో నాలుగు ఇడ్లీలు తినాలనిపిస్తుంది ఇంకా వెయ్యి అనేసి అంటాడు ప్రభావతి బాలు మాటలు విని ఇంకా టెన్షన్ పడుతూ ఉంటుంది. సత్యం వచ్చి మీనా భార్య కాబట్టే భర్త ఆకలిని తెలుసుకొని టిఫిన్ పెడుతుంది ఇప్పుడు నీకు వచ్చిన నష్టమేంటి టిఫిన్ చేసి వెళ్తాడు లే అని ప్రభాతికి క్లాస్ పీకుతాడు..
నువ్వేమీ ఏడవనక్కర్లే నేను వెళ్తున్నాను అని ప్రభావతి తో బాలు అంటాడు. నా చెల్లెలు ఫంక్షన్ ఎటువంటి ఆటంకం కలగకుండా పూర్తవ్వాలి అదే నాకు కావాల్సింది అని బాలు అంటాడు. బాలు బయటికి వెళ్లడానికి కార్ తీయడానికి కారణం క్లీన్ చేస్తాడు అప్పుడే సంజయ్ వాళ్ళు ఎంట్రీ ఇస్తారు. సంజయ్ వాళ్ళ అత్త చంద్రకాంతం కూడా ఏంట్రా ఇవ్వగానే అందరికీ వరుసగా షాక్ లు ఇస్తుంది.
బాలు వెళ్లిపోతుంటే సంజయ్ కావాలని వాడిని ఎలాగైనా అవమానించాలని కంకణ కట్టుకుంటాడు. మీ చెల్లెలు ఫంక్షన్ జరుగుతుంటే నువ్వు ఎలా వెళ్తావు బావ అని సంజయ్ అడుగుతాడు. మధ్యలో చంద్రకాంతం కూడా అవమానించేలా మాట్లాడడంతో బాలు నేను ఎందుకు రాను బావ దగ్గరుండి ఫంక్షన్ చేస్తానని లోపలికి వస్తాడు. లోపలికి వచ్చి రాగానే ఇంటిని చూసి చంద్రకాంతం సెటైర్లు వేస్తుంది. ఆమె సెటైర్లకి శృతి కౌంటర్ ఇస్తుంది. అలా అందరినీ నోరు మూయించేలా చంద్రకాంతం చేస్తే అటు బాలు ఇటు శృతి ఇద్దరు కలిసి వాళ్ళ నోర్లు మూసుకునేలా చేస్తారు.
బావ కాళ్లు కడగాలి కదా మరి బాలు బావ కాళ్ళు ఎందుకు అడగలేదు అని అనగానే మీరా అండి అది కాదు అత్తయ్య గారు పెద్దవాడు ఉండగా రెండో వాడి చేత కాళ్లు కడిగించడమేంటి ఇది తప్పు కదా అని అనగానే మనోజ్ నీ కాళ్లు కడగమని ప్రభావతి చెప్తుంది. మనోజ్ కాలు కడగానే సంజయ్ డబ్బులు ఇస్తాడు. దానిపై బాలు కౌంటర్ వేస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో మౌనిక బాలుని అవమానిస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..