OTT Movie : హాలీవుడ్ నుంచి వచ్చే కొన్ని రొమాంటిక్ సినిమాలను చాలా దేశాలలో బ్యాన్ చేశారు. విచ్చలవిడి శృంగారం ఉండటం వలన ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. అయితే కొన్ని దేశాలలో ఈ నిబంధనలు లేకపోవడం వలన, ఈ సినిమాలు మంచి కలెక్షన్స్ కూడా సాధించాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే రొమాంటిక్ మూవీని ఇండియాలో కూడా బ్యాన్ చేశారు. ఈ మూవీలో శృంగార సన్నివేశాలు అంతలా ఉంటాయి మరి. ఈ మూవీ పేరు ఏమిటి ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
నెట్ ఫ్లిక్స్ (Netflix) లో
ఈ రొమాంటిక్ మూవీ పేరు ‘ఫిఫ్టీ షేడ్స్ ఆఫ్ గ్రే’ (Fifty shades of grey). 2015 లో వచ్చిన ఈ ఎరోటిక్ రొమాంటిక్ మూవీకి టేలర్-జాన్సన్ దర్శకత్వం వహించారు. మైఖేల్ డి లూకా ప్రొడక్షన్స్, ట్రిగ్గర్ స్ట్రీట్ ప్రొడక్షన్స్ ద్వారా ఈ మూవీ నిర్మించబడింది. యూనివర్సల్ పిక్చర్స్ దీనిని పంపిణీ చేయబడింది. ఇది E.L. జేమ్స్ రాసిన 2011 నవల ఆధారంగా రూపొందించబడింది. డకోటా జాన్సన్, జామీ డోర్నాన్, జెన్నిఫర్ ఎహ్లే మార్సియా గే హార్డెన్ ఇందులో నటించారు, ఒక యువ వ్యాపారవేత్త క్రిస్టియన్ తో ఒక చదువుకొనే అమ్మాయి డేటింగ్ అగ్రిమెంట్ చేసుకుంటుంది. ఇందులో మసాలా కాస్త ఘాటుగానే ఉంటుంది. ఈ మూవీని చూస్తే మీ గంటలు కొట్టుకుంటాయి. ఒంటరిగా ఉన్నప్పుడు దీనిని ఓ పట్టు పట్టండి. ఈ రొమాంటిక్ మూవీ నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతుంది.
స్టోరీ లోకి వెళితే
క్రిస్టియన్ అనే వ్యక్తిని హనా ఇంటర్వ్యూ చేయడానికి వెళుతుంది. అతడు బాగా డబ్బున్న వ్యక్తి. అతన్ని ఇంటర్వ్యూ చేసే క్రమంలో ఇద్దరూ ఒకరికి ఒకరు కళ్ళతో మాట్లాడుకుంటారు. ఆ తర్వాత తన అందానికి ఫిదా అయిపోయిన క్రిస్టియన్ ఆమె వెంటపడతాడు. అయితే క్రిస్టియన్ ఆమెతో ఒక ఒప్పందం చేసుకోవాలనుకుంటాడు. కేవలం ఇంటిమేట్ అవ్వడం కోసమే ఈ అగ్రిమెంట్ ఉంటుంది. ఆ తర్వాత ఏ రిలేషన్ గాని ఎటువంటి సంబంధం కానీ ఉండదు. క్రిస్టియన్ అగ్రిమెంట్ ని అలా తయారు చేసుకుంటాడు. ఆమెకు అగ్రిమెంట్ ని పంపి ఓకే అయితే ప్రొసీడ్ అవుదాం అని చెప్తాడు. అగ్రిమెంట్ పూర్తికాకుండానే వీళ్ళు ఇంటిమేట్ కూడా అయిపోతారు. ఆ తరువాత క్రిస్టియన్, హనాకు తన గదిలో శృంగారంలో పాల్గొనే అన్ని రకాల వస్తువులను చూపిస్తాడు. అప్పుడు అర్థమవుతుంది హనాకి క్రిస్టియన్ ఒక మంచి రొమాంటిక్ వ్యక్తి అని. ఆ తర్వాత క్రిస్టియన్ ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడో తెలుసుకుంటుంది. ఇద్దరు కలిసి శృంగారాన్ని బాగా ఎంజాయ్ చేస్తారు. చివరికి క్రిస్టియన్ హానాను అగ్రిమెంట్ కే పరిమితం చేస్తాడా? ఈ రిలేషన్ ను మరో లెవల్ కి తీసుకెళ్తారా? ఇంతకీ ఇటువంటి అగ్రిమెంట్ క్రిస్టియన్ ఎందుకు ప్రిపేర్ చేసుకుంటాడు? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే, నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘ఫిఫ్టీ షేడ్స్ ఆఫ్ గ్రే’ (Fifty shades of grey) అనే ఈ మూవీని చూడండి.