OTT Movie : హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాలు ప్రేక్షకులకు చాలా కొత్తగా అనిపిస్తాయి. ఊహకు అందని సన్నివేశాలతో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయి. వీటిని చూస్తున్నంత సేపు మరో ఆలోచన రమ్మన్నా రాదు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో ఒక లోయలో కొన్ని విపరీత శక్తులు ఉంటాయి. వాటిని ఎదుర్కోవడానికి, ఇద్దరు స్నైపర్లను ఒక సంస్థ నియమిస్తుంది. ఆ తరువాత అక్కడ జరిగే సన్నివేశాలు భయంకరంగా ఉంటాయి. ఈ మూవీ పేరు ఏమిటి? ఇందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ యాక్షన్ మూవీ పేరు ‘ది గార్జ్’ (The Gorge). 2025 లో వచ్చిన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీకి స్కాట్ డెరిక్సన్ దర్శకత్వం వహించారు. ఇందులో మైల్స్ టెల్లర్, అన్యా టేలర్ జాయ్, సిగౌర్నీ వీవర్ నటించారు. లెవీ, డ్రాసా అనే ఇద్దరు ఎలైట్ స్నిపర్‌లు లోతైన లోయలో, ఏమి ఉందో తెలియకుండా కాపలాగా ఉంటారు. ఆ తరువాత అసలు స్టోరీ మొదలౌతుంది. ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది
స్టోరీలోకి వెళితే
ఈ మూవీలో ఇద్దరు ఎలైట్ స్నైపర్లు లెవీ కేన్, డ్రాసా చుట్టూ తిరుగుతుంది. వీరిద్దరూ ఒక రహస్యమైన, లోతైన లోయను రక్షించే బాధ్యతను మీద వేసుకుంటారు. లెవీ ఒక మాజీ యు.ఎస్. మెరైన్ స్కౌట్ స్నైపర్, బార్తోలోమెవ్ అనే ఒక రహస్యమైన మహిళా ఏజెంట్ ద్వారా రిక్రూట్ చేయబడతాడు. డ్రాసా ఒక లిథువేనియన్ కవర్ట్ ఏజెంట్, ఆమె తరచూ క్రెమ్లిన్ అనే వ్యక్తి కోసం పనిచేస్తుంది. వీరిద్దరూ ఈ లోయలో రెండు వైపులా ఉన్న గార్డ్ టవర్లలో ఒక సంవత్సరం పాటు ఒంటరిగా ఉండాలని, బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా ఉండాలని వీళ్ళకి ఆదేశాలు అందుతాయి. లెవీకి PTSD నుండి వచ్చే నైట్మేర్స్ ఉంటాయి. అయితే డ్రాసాకు తన తండ్రి ఎరికాస్ మరణాంతరం తరువాత జీవితం ఆందోళనకరంగా ఉంటుంది. వారు తమ విధులను నిర్వర్తిస్తున్నప్పుడు, లోయలోపల ఏదో రహస్యమైన, ప్రమాదకరమైన శక్తి ఉందని తెలుస్తుంది.
ఈ లోయ నుండి ‘హాలో మెన్’అనే వింత జీవులు బయటకు రావడం ప్రారంభిస్తాయి. వీటిని నియంత్రించడం వారి పని. ఈ పరిస్థితిలో లెవీ, డ్రాసా ఒకరితో ఒకరు సంబంధం పెంచుకుంటారు. వీళ్ళిద్దరూ ప్రేమలో కూడా పడతారు.ఈ సినిమా మధ్యలో, ఈ లోయ ఒక రకమైన సైన్స్ ఫిక్షన్ రహస్యాన్ని బయటపెడుతుంది. అప్పుడు ఈ ప్రపంచాన్ని రక్షించడానికి, ఈ ఇద్దరు స్నైపర్లు కలిసి పోరాడాల్సిన సమయం వస్తుంది.చివరికి ఆ లోయలో ఉండే శక్తి ఏమిటి? ఆ వింత జీవులు ఎందుకు బయటికి వస్తాయి ? ఈ విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ యాక్షన్ మూవీని చూడాల్సిందే. యాక్షన్ సన్నివేశాలు, ఒక అసాధారణ ప్రేమకథ ఈ సినిమా మిమ్మల్ని చూపు తిప్పుకోకుండా చేస్తుంది.