BigTV English

OTT Movie : శుక్ల పక్షంలోనే హత్యలు చేసే సైకో… ఒకరిని ప్రేమించి మరొకరితో గడిపే వాళ్లే వీడి టార్గెట్

OTT Movie : శుక్ల పక్షంలోనే హత్యలు చేసే సైకో… ఒకరిని ప్రేమించి మరొకరితో గడిపే వాళ్లే వీడి టార్గెట్

OTT Movie : క్రైమ్ థ్రిల్లర్ సినిమాల ట్రెండ్ ఇప్పుడు నడుస్తోంది. వీటిలో మలయాళం నుంచి వచ్చే క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఆ తర్వాత మిగతా భాషల్లో వచ్చే క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. వీటిలో బెంగాల్ ఇండస్ట్రీ నుంచి కూడా మంచి కంటెంట్ ఉన్న స్టోరీలు వస్తున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకునే బెంగాల్ మూవీలో కాలేజ్ అమ్మాయిలు మిస్ అవుతూ ఉంటారు. ఒక సైకో కిల్లర్ ఇదంతా చేస్తుంటాడు. ఆ కిల్లర్ ని పట్టుకునే క్రమంలో మూవీ స్టోరీ తిరుగుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


చోర్కి (Chorki) లో

ఈ బెంగాలీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘శుక్ల పొక్క’ (Shuklopokkho). ఈ మూవీకి విక్కీ జావిద్ దర్శకత్వం వహించాడు. చివరి వరకు సస్పెన్స్ తో ఈ మూవీ అదరగొడుతుంది. ప్రస్తుతం ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ చోర్కి (Chorki) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

హసన్, ఆదిలా స్కూల్లో మంచి ఫ్రెండ్స్ గా ఉంటారు. హాసన్ తల్లి ఎవరితోనో లేచిపోతుంది. ఊర్లో వాళ్ళ సూటు పోటి మాటలతో తండ్రి కూడా చనిపోతాడు. ఆ తర్వాత హసన్ ఒంటరి వాడు అవుతాడు. ఆదిలా హాసన్ తో క్లోజ్ గా ఉంటుంది. ఒకరోజు ఆదిలా కూడా వేరే అబ్బాయితో క్లోజ్ గా ఉంటుంది. అది చూసి తట్టుకోలేక పోతాడు హాసన్. అలా ఉండకు అని చెప్పినా వినిపించుకొదు. ఆ అమ్మాయిని ఒక చెరువులో చంపి పడేస్తాడు హసన్. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. నసీం, అదితి కాలేజీలో మంచి ఫ్రెండ్స్ గా ఉంటారు. అదే కాలేజీలో ఉండే మాధవ్ తో అదితి క్లోజ్ గా ఉంటుంది. అయితే మాధవ్ చాలామంది అమ్మాయిలను లొంగదీసుకుని అనుభవిస్తూ ఉంటాడు. అతని మీద అనుమానంతో అదితికి వార్నింగ్ ఇస్తాడు నసీం. అయినా నువ్వు నాకు ఫ్రెండ్ మాత్రమే అంటూ, నా పర్సనల్ విషయాలు జోక్యం చేసుకోవద్దని చెప్పి వెళ్ళిపోతుంది అదితి. అదే కాలేజీలో ఇదివరకే ఇద్దరు అమ్మాయిలు కనిపించకుండా పోతారు. ఈ కేసును ఒక ఇన్స్పెక్టర్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాడు. ఈ క్రమంలోనే మరొక అమ్మాయి కూడా మిస్ అవుతుంది. పోలీసులు నసీం ని కూడా విచారిస్తారు. అయితే నసీం మాధవ మీద అనుమానం వ్యక్తం చేస్తాడు.

అదే కాలేజీలో ఒక క్యాంటీన్లో కమల్ అనే కుర్రాడు వెయిటర్ గా పనిచేస్తుంటాడు. వాడు ఒక మంచి చెఫ్ అవ్వాలని కలలు కంటూ ఉంటాడు. ఒకరోజు అదితి కూడా కనిపించకుండా పోతుంది. పోలీసుల దగ్గరికి నసీం వచ్చి మాధవ్ ను విచారించమని అడుగుతాడు. ఈ హత్యలన్నీ శుక్లపక్షం రోజునే జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఎదురవుతుంది. అదితిని నసీం కిడ్నాప్ చేస్తాడు. మాధవ్ నుంచి రక్షించడానికి ఇలా చేశానని ఆమెకు చెప్తాడు. అక్కడినుంచి తప్పించుకొని అదితి పారిపోతుంది. ఇదివరకే పరిచయం ఉన్న కమల్ కి కనిపిస్తుంది. అతడు ఆమెను తన ఇంటికి తీసుకొని పోతాడు. ఆ ఇంట్లో ఎక్కడ చూసినా రక్తపు మరకలు ఉంటాయి. అనుమానం వచ్చి అతిథి అక్కడ నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తుంది. చివరికి అదితి ఏమవుతుంది? ఆ సైకో కిల్లర్ ఎవరు? పోలీసులు ఆ కిల్లర్ ను పట్టుకుంటారా? ఈ విషయాలు తెలియాలంటే ఈ మూవీని చూడండి.

Tags

Related News

Ghaati OTT : అనుష్కకు ఘోర అవమానం… 20 రోజుల్లో జీరో థియేటర్స్

Junior Movie: ఓటీటీలోకి జూనియర్ మూవీ..ఆ రోజే స్ట్రీమింగ్!

OTT Movie : టెర్రరిస్టులకే టెర్రర్ పుట్టించే ఆడపులి… ప్రతీ 5 నిమిషాలకో ట్విస్ట్… నరాలు కట్ అయ్యే సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : షార్క్‌లను దేవతలుగా భావించే సైకో… ఆడవాళ్లను బలిచ్చి దిక్కుమాలిన పని… గ్రిప్పింగ్ సర్వైవల్ హారర్ థ్రిల్లర్

OTT Movie : తల్లీకూతుర్లు ఇద్దరితో ఒక్కడే… ఐఎమ్‌డీబీలో రేటింగ్ 9.1… తెలుగు మూవీనే మావా

OTT Movie : రోబోని కూడా వదలకుండా ఆటగాడి అరాచకం… అదిచ్చే షాక్ కు మైండ్ బ్లాంక్

OTT Movie : మనుషులకు తెలియకుండా మాయదారి పనులు… ఫ్యూచర్లో ఏఐ ఇంత డేంజర్ స్టంట్స్ చేస్తుందా మావా ?

OTT Movie : బాడీ బిల్డర్ తో ఆ పాడు పని… ఈ నలుగురు ఆడవాళ్ళూ అరాచకం మావా… సింగిల్ గా చూడాల్సిన మూవీ

Big Stories

×