BigTV English

Ram Chran Peddi: భారీ సెట్టింగ్ తో రామ్ చరణ్ పెద్ది, గురువును మించిపోతాడా.?

Ram Chran Peddi: భారీ సెట్టింగ్ తో రామ్ చరణ్ పెద్ది, గురువును మించిపోతాడా.?

Ram Chran Peddi: ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తుంది. ఎస్.ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా తర్వాత, వరుసగా పాన్ ఇండియా సినిమాలు రావడం మొదలయ్యాయి. వాటిలో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించాయి. ప్రతి హీరో కెరియర్ లో ఎప్పటికీ మర్చిపోలేని కొన్ని సినిమాలు ఉంటాయి. అలా రామ్ చరణ్ విషయానికి వస్తే చరణ్ లోని పరిపూర్ణమైన నటుడును బయటకు తీసిన సినిమా రంగస్థలం. ఈ సినిమాను సుకుమార్ డిజైన్ చేసిన విధానం చాలా మందిని విపరీతంగా ఆకట్టుకుందాం. తరంలో ఉన్న ప్రతిభను పూర్తిస్థాయిలో బయటికి తీసిన సినిమా ఇది. ఇక ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత చరణ్ గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సాధించుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది అనే సినిమాను చేస్తున్నాడు.


మొదటి సినిమాతోనే సక్సెస్ 

సుకుమార్ శిష్యుడుగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయమైన బుచ్చిబాబు ఉప్పెన సినిమాతో దర్శకుడుగా మారాడు. వైష్ణవ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది. దాదాపు 100 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ హీరోగా బుచ్చిబాబు సినిమా చేస్తాడు అని వార్తలు వినిపించాయి. కానీ కొన్ని కారణాల వలన ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. ఇప్పుడు రామ్ చరణ్ హీరోగా పెద్ది అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చరణ్ ఉత్తరాంధ్ర యాసలో మాట్లాడనన్నాడు. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా నుంచి విడుదల చేసిన వీడియో కూడా విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.


పెద్ది కోసం భారీ సెట్

‘పెద్ది’ కోసం హైద‌రాబాద్ శివార్ల‌లో ఓ భారీ విలేజ్ సెట్ తీర్చిదిద్దారు.’రంగ‌స్థ‌లం’ త‌ర‌వాత ఆ రేంజ్‌లో డిజైన్ చేసిన సెట్ ఇది. క‌ళా ద‌ర్శ‌కుడు అవినాష్ కొల్లా చిన్న చిన్న డిటైలింగ్ ని కూడా బాగా క్యాప్చ‌ర్ చేసి ప‌ర్‌ఫెక్ట్ గా వేసిన సెట్ ఇది. సినిమా విడుద‌ల అయిన త‌ర‌వాత ఈ సెట్ గురించి బాగా మాట్లాడుకోవ‌డం ఖాయం.

ఇక్క‌డ ఓ భారీ యాక్ష‌న్ ఎపిసోడ్ తో పాటు కీల‌క‌మైన స‌న్నివేశాలు రూపొందించనున్నారు. ఈ ఘ‌ట్టాలు ‘పెద్ది’ సినిమాకు సెంట్రాఫ్ ఎట్రాక్ష‌న్ గా నిల‌వ‌బోతున్నాయి. రంగస్థలం సినిమా కోసం ఎటువంటి సెట్స్ క్రియేట్ చేశారో అందరికీ తెలిసిన విషయమే. గోదావరి ప్రాంతాన్ని హైదరాబాద్లో కూడా క్రియేట్ చేశారు. ఇక ఇప్పుడు అదే స్థాయిలో పెద్ది సెట్స్ కూడా వేసినట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాకి వచ్చిన గ్రాండ్ టెక్నీషియన్స్ ని చూస్తుంటే సుక్కు తీసిన రంగస్థలం మించి ఉంటుందా అని అందరికీ సందేహాలు ఇప్పటికే మొదలయ్యాయి.

Also Read : AA22xA6 : ప్రభాస్ తో ప్రాజెక్టు పోయిన మరో పాన్ ఇండియా హీరో ప్రాజెక్టు పట్టుకుంది

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×