Ramakant Dayama Death: బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ వెటరన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్, థియేటర్ నటుడు రమాకాంత్ దాయమా (69) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మే 26న తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల బాలీవుడ్ ప్రముఖులు, సహనటులు తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Read also-డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో టాలీవుడ్ నిర్మాతలు భేటీ.. ఈ సారైనా..
రమాకాంత్ దాయమా అనగానే ప్రేక్షకులకు మొదట గుర్తొచ్చేది షారుఖ్ ఖాన్ నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘చక్ దే! ఇండియా’. ఈ సినిమాలో హాకీ టీమ్ మేనేజర్‌గా ఆయన చేసిన పాత్ర ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. దీనితో పాటు హర్షద్ మెహతా కథ ఆధారంగా వచ్చిన సెన్సేషనల్ వెబ్ సిరీస్ ‘స్కామ్ 1992’ లో కూడా ఆయన కీలక పాత్రలో నటించి మెప్పించారు. అవార్డు విన్నింగ్ చిత్రం ‘ధనక్’తో పాటు పలు హిందీ సినిమాలు, నాటకాల్లో నటించి వర్సటైల్ యాక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు.
రమాకాంత్ దాయమా కుమార్తె యశస్విని దాయమా కూడా బాలీవుడ్‌లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె అలియా భట్ నటించిన ‘డియర్ జిందగీ’, అలాగే ‘ఢిల్లీ క్రైమ్’, ‘అడల్టింగ్’ వంటి పాపులర్ వెబ్ సిరీస్‌ల ద్వారా డిజిటల్ స్క్రీన్‌పై మంచి ఇన్‌ఫ్లుయెన్సర్‌గా రాణిస్తున్నారు.
రమాకాంత్ మృతిపై ‘సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ (CINTAA) తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసింది. గతంలో ఆయన CINTAA ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా పనిచేసి, తోటి కళాకారుల సంక్షేమం కోసం ఎంతో కృషి చేశారని గుర్తుచేసుకుంది.
Read also-Podarillu Pratap : ‘పొదరిల్లు’ ప్రతాప్ సినీ బ్యాగ్రౌండ్.. ఒక్క రోజుకు అంత తీసుకుంటున్నాడా..?
ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ సీనియర్ నటి శుభాంగి లత్కర్ సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్ పెట్టారు. “ఆయన ఎంతో ఎనర్జిటిక్ అద్భుతమైన వ్యక్తి. మేమిద్దరం కలిసి త్వరలోనే ఒక హిందీ ప్లే (నాటకం) చేయాలని ప్లాన్ చేశాం. కానీ ఇంతలోనే ఈ విషాద వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదు” అంటూ రమాకాంత్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, రీయేటర్ నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకున్న రమాకాంత్ దాయమా మరణం బాలీవుడ్‌కు తీరని లోటు.