Gundeninda GudiGantalu Today episode May 31st : నిన్నటి ఎపిసోడ్ లో.. మౌనికను ఇంట్లో నుంచి పంపించేసి కొత్త పెళ్లి చేసుకోవాలని సంజయ్ అనుకుంటాడు. ప్లాన్ ప్రకారం ఫ్రెండ్స్ నీ ఇంటికి తీసుకొచ్చి మందు పొయ్యమని అడుగుతాడు. మందులోకి నంచుకోవడానికి మెనూని చెప్తాడు. అవన్నీ చేసుకొని వెళ్ళిన మౌనికను డ్రైవర్తో అక్రమ సంబంధం ఉంది అంటూ అంట కట్టేసి బాధ పెట్టేస్తాడు. తర్వాత రోజు ఉదయం మౌనిక ఇంట్లో కనిపించకపోతే సంజయ్ నీలకంఠం సంతోషపడతారు. ప్రభావతి మౌనిక తో మాట్లాడాలని ఫోన్ చేస్తుంది. ఇంకా విషయం తెలియదు అనుకుంటాను అందుకే కూల్ గా మాట్లాడుతుంది అని సంజయ్ అనుకుంటాడు. ఇక లేదు అత్తయ్య ఎక్కడికో వెళ్ళింది అని చెప్తాడు ప్రభావతి టెన్షన్ పడుతూ ఉంటుంది. మౌనిక ఎక్కడికి వెళ్ళింది బాబు అంటూ ప్రభావతి అడుగుతుంది అలాగే సంజయ్ వాళ్ళమ్మ కూడా మౌనికను వెతికి ఇంటికి తీసుకురావాలని డిమాండ్ చేస్తుంది. బాలు ఆటోలో ఒక వ్యక్తిని ఎక్కించుకొని ఓ పార్టీ ఆఫీస్ దగ్గర దిగబెడతారు. అయితే అక్కడే తన ఫ్రెండ్ అశోక్ ని కలుసుకుంటాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. తన ఫ్రెండ్ అశోక్ వల్ల మీనాకు బంఫర్ ను ఇస్తాడు బాలు.. ఎమ్మెల్యే చేస్తున్న సామూహిక వివాహాల కోసం 500 దండల ఆర్డర్ ని మీనాకు తీసుకొచ్చి ఇస్తాడు బాలు. ఈ విషయాన్ని బాలు డైరెక్ట్ గా చెప్పకుండా మధ్యలో సత్యంని పెట్టి అసలు విషయాన్నీ చెప్తాడు. అయితే మీనా ఒక్కొక్క దండ ధర 500 చెప్పడంతో బాలు షాక్ అవుతాడు.. ఏంటి దండ 500 అంత రేటు పెట్టి జనాలని దండుకుంటున్నారా అంటూ బాలు మీనా పై సీరియస్ అవుతాడు.. ఈ ఆర్డర్ రెండు రోజుల్లో కావాలని బాలు అడుగుతాడు. రెండు రోజుల్లో అయితే నేను బస్తి జనానికి కొంత అమౌంట్ ఇచ్చి దండలు తయారు చేయించాలని అంటాడు. బస్తీలోని మందిని పెట్టుకొని చేస్తాను నాకు ముందు అడ్వాన్స్ కావాలని డిమాండ్ చేస్తుంది. తనకి బాలు అడ్వాన్స్ ఇవ్వడంతో మీనా ఆ ఆర్డర్ ని తీసుకుంటుంది.
ముందు నేను గుడికి వెళ్లి దేవుడి దగ్గర దండం పెట్టుకొని అక్కడ భక్తి జనాలకి చెప్పమని సుమతీకి చెప్పేసి వస్తాను… ఏ నాకు పూలు కొనడానికి పెద్ద ఆటో కావాలి అని నేను అడుగుతుంది. అదంతా నేను చూసుకుంటాను నాకు దండలు మాత్రమే కావాలి అని బాలు అంటాడు. వీరిద్దరిని చూసిన సత్యం మీ మెసేజ్లు పాస్ చేసుకోవడం అయిపోతే నన్ను వదిలేస్తే నేను పక్కకెళ్ళిపోతానని అంటాడు. ఇకమీద గుడికి వెళ్ళగానే అక్కడ మౌనిక కనిపిస్తుంది. ఏమైంది మౌనికాని మొత్తం అడుగుతుంది.. వీరిద్దరి మధ్య గొడవలు ఎప్పుడు తగ్గుతాయో మనం అందరం ఎప్పుడు సంతోషంగా ఉంటాము అని మౌనిక అంటుంది. రోజు త్వరలోనే వస్తుందిలే మౌనికని, మీనా ధైర్యం చెప్పి ఇంటికి పంపిస్తుంది.
ఇక మౌనికా ఇంట్లో నుంచి ఎవ్వరికీ చెప్పుకుండా రావడంతో సంజూ భయపడిపోతాడు. తను ఏదైనా అఘాయిత్యానికి పాల్పడితే కేసు తమపైకే వస్తుందని సంజూ తండ్రి అనడంతో వెంటనే మౌనికా ఆచూకీ కోసం ప్రయత్నిస్తాడు. రోడ్డుపైకి వెళ్లి రెగ్యులర్ రూట్లలో మౌనికా ఆచూకీ కోసం ప్రయత్నిస్తాడు. అక్కడ ఉన్న స్థానికులకు మౌనికా ఫొటోను చూపించి ఈమెను చూశారా? అని అడుగుతూ ఉంటాడు. అయితే సంజూ కంగారు పడుతూ అలా రోడ్లపై తిరుగుతుండాన్ని బాలు చూస్తాడు. వెంటనే వెళ్లి దేని కోసం వెతుకుతున్నావని అడుగుతాడు. దాంతో సంజూ నీకు చెప్పాల్సిన పని లేదని, వేరే అడ్రస్ కోసం వెతుకుతున్నానని చెబుతాడు. నేను సాయం చేస్తానని బాలు చెప్పినా ఏం అవసరం లేదని చెప్పి అక్కడి నుంచి వెళ్లి పోతాడు..
సంజు పై అనుమానంతో బాలు ఒక వ్యక్తిని అడిగితే అతను ఒక అమ్మాయిని వెతుకుతూ వచ్చాడని నిజం చెప్తాడు. మౌనికకు ఏమైంది అసలు ఈ దుర్మార్గుడు ఏం చేశాడు అంటూ భయంతో కంగారు పడుతూ మౌనిక వాళ్ళ ఇంటికి బాలు వస్తాడు. అక్కడ సంజీవ్ వాళ్ళమ్మ సువర్ణను అడుగుతాడు. ఈ దుర్మార్గులు ఏం చేశారో చెప్పండమ్మా మీకు మాత్రమే తెలుసు ఉంటుంది అని అంటాడు.. మీరు ఇలా చెప్తేనే నిజం చెప్పరు కానీ అని మెడ మీద కత్తి పెట్టి నిజం చెప్పమని సంజయ్ ని అడుగుతాడు. ఇప్పుడు అక్కడికి వచ్చిన మౌనిక అన్నయ్య నేను ఇక్కడే ఉన్నాను అని అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. ఇక సోమవారం ఎపిసోడ్లో మౌనిక సంజయ్ బాగోతాన్ని బయటపెడుతుందా..? శివ గురించి మీనాకు అసలు నిజం తెలిసిపోతుందా? అన్నది చూడాలి..