Big tv Kissik Talks: బిగ్ టీవీ(Big Tv) ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కిసిక్ టాక్స్(Kissik Talks) కార్యక్రమం ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. జబర్దస్త్ వర్ష యాంకర్ గా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమం ఇప్పటికే 27 ఎపిసోడ్ లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. తాజాగా ఈ కార్యక్రమంలో భాగంగా సీనియర్ నటి రాశి (Rassi)హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమంలో వర్ష అడిగిన ప్రశ్నలకు రాశి ఆసక్తికరమైన సమాధానాలను తెలియజేస్తూ వచ్చారు. సినిమా ఇండస్ట్రీ అన్న తర్వాత వారసత్వం కొనసాగడం సర్వసాధారణం. ఈ క్రమంలోనే రాశి తన కూతురు ఇండస్ట్రీకి రావడం గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.
రాశికి పెళ్లయిన తర్వాత 10 సంవత్సరాలకు తన కుమార్తె జన్మించిందని తెలిపారు. అయితే తనకు మాత్రం హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి రావాలని చాలా ఇష్టమని, స్కూల్లో టీచర్స్ పెద్దయిన తర్వాత ఏమవుతావని అడిగిన మా అమ్మలాగే నటి అవుతానని చెబుతుంది అంటూ ఈ సందర్భంగా రాశి తెలియజేశారు. రాశి ఇలా చెప్పడంతో వెంటనే వర్ష ఒకవేళ మీ కూతురిని హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం చేస్తే ఏ హీరోతో ఇండస్ట్రీకి పరిచయం చేస్తారు అంటూ ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నకు రాశి చెప్పిన సమాధానం విని అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
రోషన్ కళ్ళు అంటే చాలా ఇష్టం…
తన కుమార్తెను హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం చేస్తే కచ్చితంగా శ్రీకాంత్ (Srikanth)కుమారుడు రోషన్(Roshan) తోనే తనని హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం చేస్తానని రాశి తెలియజేశారు. శ్రీకాంత్ రాశి కాంబినేషన్లో ఎన్నో అద్భుతమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ క్రమంలోనే తన కుమార్తె అలాగే శ్రీకాంత్ కొడుకు సినిమా చేస్తే బాగుంటుందని అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక రోషన్ గురించి కూడా రాశి మాట్లాడుతూ చాలా మంచి అబ్బాయి, తన కళ్ళు అంటే నాకు చాలా ఇష్టమని తెలియజేశారు. చిన్నప్పుడు తనతో చాలా బాగా ఆడుకునే వాళ్ళం అంటూ అప్పటి విషయాలను రాశి గుర్తు చేసుకున్నారు.
ఈ విధంగా తన కుమార్తె సినీ కెరియర్ గురించి రాశి ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. మరి ఈమె కుమార్తెతో సినిమా చేయటానికి రోషన్ ఒప్పుకుంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక రోషన్ ఇప్పటికే హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పలు సినిమాలలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇలా నటన పరంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న రోషన్ ఇప్పటివరకు సరైన సక్సెస్ మాత్రం అందుకోలేదు. ప్రస్తుతం రోషన్ పలు సినిమా పనులలో బిజీగా ఉన్నారని తెలుస్తుంది. ఇక రాశి కెరియర్ విషయానికి వస్తే.. ఒకానొక సమయంలో హీరోయిన్ గా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన ఈమె ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఐదు సినిమాల షూటింగ్ పనులలో రాశి బిజీగా ఉన్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు.
Also Read: Rajinikanth: రజినీకాంత్ ఆలయంలో నవరాత్రి పూజలు… ఇదేమీ అభిమానం రా సామి!