Big tv Kissik Talks: టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడుగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో సుకుమార్ (Sukumar)ఒకరు. సుకుమార్ దర్శకత్వంలో ఎన్నో అద్భుతమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. సుకుమార్ దర్శకత్వం వహించిన సూపర్ హిట్ సినిమాలలో రంగస్థలం (Rangasthalam)సినిమా ఒకటి. సమంత రామ్ చరణ్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే. ఇలా ఈ సినిమాలో రంగమ్మత్త పాత్ర కూడా అదే స్థాయిలో ఆదరణ సొంతం చేసుకుంది .ఈ పాత్రలో అనసూయ(Anasuya) నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఈ పాత్ర అనసూయ కెరియర్ ను కీలక మలుపు తిప్పిందని చెప్పాలి.
ఇక రంగస్థలం సినిమా తర్వాత అనసూయకు పెద్ద ఎత్తున సినిమాలలో అవకాశాలు రావడంతో ఈమె ఏకంగా బుల్లితెరకి గుడ్ బై చెబుతూ వెండితెరపై సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. అయితే ముందుగా రంగమ్మత్త పాత్రలో నటించే అవకాశం నటి రాశి(Raasi)కి వచ్చిందని, రాశి ఈ పాత్రను రిజెక్ట్ చేయడంతో అనసూయకు అవకాశం లభించింది అంటూ గతంలో వార్తలు వచ్చాయి. తాజాగా ఈ విషయంపై రాశి స్పందించారు. బిగ్ టీవీ కిస్సిక్ టాక్ షో(Big Tv Kissik Talks show) కార్యక్రమంలో పాల్గొన్న రాశికి రంగస్థలం సినిమాలోని రంగమ్మత్త పాత్ర గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.
ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయలేరు..
ఈ ప్రశ్నకు రాశి సమాధానం చెబుతూ సుకుమార్ గారు ఈ పాత్ర కోసం తనను ముందుగా సంప్రదించిన మాట నిజమేనని తెలిపారు. అయితే అప్పటివరకు తనని ఓకే ధోరణిలో చూసిన ప్రేక్షకులకు రంగమ్మత్తగా ప్రేక్షకుల ముందుకు వస్తే యాక్సెప్ట్ చేయలేరన్న ఉద్దేశంతోనే తాను నటించలేదని తెలిపారు. ఈ సినిమాలో రంగమ్మత్త మందు బాటిల్ ఓపెన్ చేసి తాగడం అలాగే స్నానం చేస్తూ కనిపించడం, ఈ పాత్ర కోసం కాస్ట్యూమ్ కూడా నాకు సౌకర్యవంతంగా ఉండదనిపించింది. ఈ విషయం గురించి తాను సుకుమార్ గారికి చెప్పడంతో ఆయన కూడా ఓకే చెప్పి తనని కాదని అనసూయను తీసుకున్నారని రాశి తెలిపారు.
ఈ సినిమా విడుదలైన తర్వాత ఈ పాత్రలో చేసి ఉంటే బాగుండేదనే భావన కలిగిందా అనే ప్రశ్న కూడా ఎదురైంది. సినిమా చూసిన తర్వాత ఆ పాత్రకు అనసూయ కరెక్ట్ గా సెట్ అయిందనిపించింది. అనసూయ కూడా ఈ పాత్రలో చాలా అద్భుతంగా నటించింది అంటూ రాశి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఏది ఏమైనా రాశి ఎంతో అద్భుతమైన సినిమాలో ఒక గొప్ప అవకాశాన్ని వదులుకున్నారనే చెప్పాలి. ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా మంచి సక్సెస్ అందుకున్న ఈమె తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ఇండస్ట్రీలో ఎంతో బిజీ అవుతున్నారు. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బుల్లితెర సీరియల్స్ లో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈమె నటించిన జానకి కలగనలేదు సీరియల్ ఎంతో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకుంది. ప్రస్తుతం రాశి వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.
Also Read: Big tv Kissik Talks: కళ్ళను డొనేట్ చేసిన నటి రాశి…ఆ సినిమా ప్రభావమేనా?