Big tv Kissik Talks: టాలీవుడ్ సీనియర్ నటి రాశి (Raasi)తాజాగా బిగ్ టీవీ(Big Tv) నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్(Kissik Talks) కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె తన సినీ కెరియర్ గురించి ఎన్నో విషయాలను వెల్లడించారు. ఈ క్రమంలోనే యాంకర్ వర్ష రాశిని ప్రశ్నిస్తూ.. మీరు చిరంజీవి(Chiranjeevi) గారితో ఓ సినిమా చేయాల్సి ఉండగా కొన్ని కారణాలవల్ల ఆగిపోయిందని విన్నాము. అసలు ఏం జరిగింది అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు రాశి సమాధానం చెబుతూ.. చిరంజీవి గారితో నేను, ఆర్తి అగర్వాల్ కలిసి ఓ సినిమా చేయాల్సి ఉంది. ఈ సినిమాకు తాము అడ్వాన్స్ కూడా తీసుకున్నామని తెలిపారు.
ఇక ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుందన్న సమయంలో కథ విషయంలో డైరెక్టర్ గారికి చిరంజీవి గారికి మధ్య చిన్న అభిప్రాయ భేదాలు రావడంతో ఈ సినిమా ఆగిపోయిందని, ఈ సినిమా మరెవరు కూడా చేయలేదని గుర్తు చేసుకున్నారు. ఇలా చిరంజీవి ప్రస్తావన రావడంతో రాశి మరొక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు. అదే సమయంలోనే చిరంజీవిగారు ఐ బ్యాంక్ ప్రారంభించారని, తాను కూడా చిరంజీవి ఐ బ్యాంక్ కోసం తన కళ్ళను దానం(Eye Donation) చేశానని ఈ సందర్భంగా బయటపెట్టారు. ఇలా తాను కళ్ళు దానం చేయడానికి ముందుకు రావడంతో తనని చూసి చాలామంది కళ్ళను దానం చేయడానికి ముందుకు వచ్చారని తెలిపారు.
పెళ్లి పందిరి సినిమా ప్రభావం..
ఇక ఇప్పుడు ఈ షో ద్వారా ఈ విషయాన్ని తెలియజేయడంతో మరికొంతమంది కూడా తమ కళ్ళను దానం చేయటానికి ముందుకు వస్తే బాగుంటుందని రాశి తెలిపారు. తనకు కళ్ళు దానం చేయాలనీ ఆలోచన పెళ్లి పందిరి(Pelli Pandiri) సినిమా ద్వారా వచ్చిందని తెలిపారు. జగపతిబాబు రాశి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో రాశి కళ్ళు లేని అమ్మాయి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో కళ్ళు లేని వారి జీవితం ఎలా ఉంటుందో నాకు స్పష్టంగా అర్థమైంది అందుకే తాను కళ్ళు దానం చేయాలనే నిర్ణయాన్ని తీసుకున్నాను అంటూ ఈ సందర్భంగా తెలియజేశారు. పెళ్లి పందిరి సినిమా ప్రభావమే తన చేత ఒక మంచి పని చేయించిందనే విషయం తెలియడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సినిమాలపై ఆసక్తితో బాల నటిగానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రాశి అనంతరం హీరోయిన్ గా స్టార్ హీరోలు అందరి సరసన నటిస్తూ ఎన్నో అద్భుతమైన సినిమాలను చేశారు. ఇక పెళ్లి తర్వాత తన వ్యక్తిగత కారణాలవల్ల కొంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీకి దూరమైన ఈమె బుల్లితెరపైకి రీ ఎంట్రీ ఇస్తూ పలు బుల్లితెర సీరియల్స్ లో నటించి సందడి చేశారు. ఇక ప్రస్తుతం సినిమాలను చేసే అవకాశాలను కూడా అందుకుంటున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇప్పటికే మూడు సినిమాల షూటింగ్ పనులు కూడా పూర్తి అయ్యాయని త్వరలోనే ఈ సినిమాలు విడుదల కాబోతున్నాయని రాశి ఈ సందర్భంగా వెల్లడించారు.
Also Read: Big tv Kissik Talks: గోకులంలో సీత 2 మనసులో మాట బయటపెట్టిన రాశి… పవన్ ఛాన్స్ ఇస్తారా?