Big tv Kissik Talks: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన వారిలో సీనియర్ నటి రాశి(Raasi) ఒకరు. ఈమె హీరోయిన్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ హీరోలు అందరి సినిమాలలో నటించి ఎంతో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్నారు. ఇక రాశి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం గోకులంలో సీత(Gokulamlo seeta). ఈ సినిమా అప్పట్లో ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా సీక్వెల్ గురించి రాశి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
తాజాగా నటి రాశి బిగ్ టీవీ(Bigg Tv) నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్(Kissik Talks) కార్యక్రమానికి హాజరయ్యారు. ఇందులో భాగంగా సినిమా విషయాల గురించి అలాగే వ్యక్తిగత విషయాల గురించి ముచ్చటిస్తూ ఎన్నో విషయాలను తెలియచేశారు. ఈ క్రమంలోనే యాంకర్ వర్ష ఈమె సినీ కెరియర్ గురించి మాట్లాడుతూ ఇంకా ఎలాంటి సినిమాలు చేయాలని ఉంది అంటూ ప్రశ్నించడంతో తనకు గోకులంలో సీత 2(Gokulamlo Seeta 2) చేయాలని ఉంది అంటూ తన మనసులో మాట బయటపెట్టారు. మరి ఈమె గోకులంలో సీత సీక్వెల్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలియడంతో ఈమెతో నటించడానికి పవన్ ఒప్పుకుంటారా? అసలు ఈ సీక్వెల్ సాధ్యమవుతుందా? అంటూ అభిమానులు ఆలోచనలో పడ్డారు.
రాజకీయాలలో బిజీగా పవన్ కళ్యాణ్…
పవన్ కళ్యాణ్,రాశి జంటగా ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గోకులంలో సీత. ఈ సినిమా 1997 వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఇటీవల కాలంలో సీక్వెల్ సినిమాలో ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గోకులంలో సీత 2 చేయాలనే ఆలోచనలో రాశి ఉన్నప్పటికీ ఇది సాధ్యం కానీ విషయమనే తెలుస్తుంది. ప్రస్తుతం రాశి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి పలు సినిమాలలో హీరో హీరోయిన్లకు తల్లి పాత్రలలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక పవన్ కళ్యాణ్ హీరోగా సినిమాలు చేస్తున్న ఈయన మాత్రం రాజకీయ వ్యవహారాలలో బిజీగా ఉన్న నేపథ్యంలో సినిమాలను పూర్తిగా తగ్గించారని చెప్పాలి.
పెళ్లి తర్వాత రాశి సినిమా ఇండస్ట్రీకి కొంత గ్యాప్ ఇచ్చినప్పటికీ ప్రస్తుతం మాత్రం ఎంతో బిజీగా ఉన్నారు. ఏకంగా ఐదు సినిమాలకు ఈమె కమిట్ అయ్యారని తెలుస్తుంది. ఇలా ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బుల్లితెర సీరియల్స్ లో కూడా నటిస్తూ సందడి చేశారు. అయితే తనకు బుల్లితెరపై ప్రసారమయ్యే డాన్స్ షోకు జడ్జిగా చేయాలని కోరికగా ఉంది అంటూ ఈ సందర్భంగా తన మనసులో మాటను బయటపెట్టారు. మరి రాశి జడ్జిగా చేయాలనుకుంటున్న విషయాన్ని తెలియజేయడంతో ఈమెకు ఎవరైనా అవకాశం ఇస్తారా? లేదా?అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈమె నటించిన సినిమాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయని కూడా వెల్లడించారు.
Also Read: Big tv Kissik Talks: కూతురి కోసం శ్రీకాంత్ కొడుకును లైన్ లో పెట్టిన రాశి..పెద్ద ప్లానింగే!