SBI Credit Card Extra Charges| చేతిలో నగదు లేకపోయినా క్రెడిట్ కార్డు ఉపయోగించి అవసరమైన చెల్లింపులు సులభంగా చేయవచ్చు. అందుకే చాలామంది షాపింగ్, పెట్రోల్, డీజిల్ కొనుగోళ్ల నుంచి ప్రయాణ ఖర్చుల వరకు కార్డులపైనే ఆధారపడుతున్నారు. అయితే SBI క్రెడిట్ కార్డు వినియోగదారులు ఇకపై కొన్ని చెల్లింపుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. డిసెంబర్ 1, 2026 నుంచి కొన్ని లావాదేవీలపై కొత్త ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. ముఖ్యంగా ఎక్కువ మొత్తంలో ఖర్చు చేసే వారికి ఈ మార్పు అదనపు భారంగా మారవచ్చు. మరి కొత్త నిబంధనలు ఏమిటి? ఎవరిపై ప్రభావం పడుతుంది? తెలుసుకుందాం.
SBI కార్డు కొత్త నిబంధనల ప్రకారం.. రూ.3,000 కంటే ఎక్కువ విలువైన ట్రాన్స్‌పోర్టేషన్ లావాదేవీలపై 1 శాతం అదనపు ఛార్జీ వసూలు చేస్తుంది. ఈ ఛార్జీ తగిన లావాదేవీకి విడివిడిగా వర్తిస్తుంది. నెల మొత్తం చేసిన ట్రాన్స్‌పోర్టేషన్ ఖర్చును కలిపి లెక్కించరు. ఉదాహరణకు.. మీరు SBI క్రెడిట్ కార్డుతో ఒక ట్రాన్స్‌పోర్టేషన్ సర్వీస్‌కు రూ.4,000 చెల్లించారనుకుందాం. అప్పుడు ఆ లావాదేవీపై 1 శాతం అదనపు ఛార్జీ పడుతుంది. అంటే రూ.40 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే రూ.3,000 లేదా అంతకంటే తక్కువ చెల్లింపులపై ఈ అదనపు ఛార్జీ ఉండదు. కాబట్టి ఎక్కువ మొత్తంలో ప్రయాణ సంబంధిత చెల్లింపులు చేసేవారు ఈ మార్పును గమనించాలి.
పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లకు కూడా SBI ప్రత్యేక నిబంధన ప్రకటించింది. ఒక బిల్లింగ్ సైకిల్‌లో మీ మొత్తం ఫ్యూయల్ ఖర్చు రూ.50,000 దాటితే అదనపు ఛార్జీ వర్తిస్తుంది. అయితే మొత్తం ఖర్చుపై కాకుండా, రూ.50,000 లిమిట్ మించిన మొత్తంపైనే 1 శాతం ఛార్జీ విధిస్తారు. ఉదాహరణకు, ఒక నెలలో మీ ఫ్యూయల్ ఖర్చు రూ.60,000 అయిందనుకుందాం. ఇందులో మొదటి రూ.50,000పై అదనపు ఛార్జీ ఉండదు. మిగిలిన రూ.10,000పై మాత్రమే 1 శాతం వసూలు చేస్తారు. అంటే మీరు అదనంగా రూ.100 చెల్లించాలి. నెలవారీ ఫ్యూయల్ ఖర్చు రూ.50,000 లోపు ఉంటే ఈ అదనపు ఛార్జీ వర్తించదు.
Also Read: చాణక్య నీతి.. దానధర్మాలు చేసే ముందు ఈ 7 విషయాలు గుర్తుంచుకోండి
ఈ నిబంధనల ప్రభావం ఎక్కువగా అధిక మొత్తంలో ఖర్చు చేసే వారిపై ఉంటుంది. ముఖ్యంగా కార్పొరేట్ సంస్థలు, కమర్షియల్ వాహనాల నిర్వాహకులు, ఫ్లీట్ ఆపరేటర్లు అదనపు ఖర్చును ఎదుర్కోవచ్చు. తరచూ పెద్ద మొత్తంలో పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేసేవారు కూడా తమ ఖర్చులను పరిశీలించాలి. సాధారణంగా నెలకు రూ.50,000 కంటే తక్కువ ఫ్యూయల్ ఖర్చు చేసే వారికి ఈ ఛార్జీ ఉండదు. అలాగే రూ.3,000 మించని ట్రాన్స్‌పోర్టేషన్ చెల్లింపులకు కూడా అదనపు రుసుము వర్తించదు.
SBI క్రెడిట్ కార్డు వినియోగదారులు ప్రతి బిల్లింగ్ సైకిల్‌లో తమ ఫ్యూయల్ ఖర్చులను గమనించాలి. అలాగే ప్రతి ట్రాన్స్‌పోర్టేషన్ చెల్లింపు మొత్తాన్ని కూడా పరిశీలించాలి. క్రెడిట్ కార్డు స్టేట్‌మెంట్‌ను క్రమం తప్పకుండా చెక్ చేయడం మంచిది. పెద్ద మొత్తంలో చెల్లింపులు చేసేముందు కొత్త పరిమితులను గుర్తుంచుకోవాలి. డిసెంబర్ 1, 2026 నుంచి ఈ మార్పులు అమల్లోకి వస్తాయి. ముందుగానే నిబంధనలు తెలుసుకుంటే అనవసరమైన అదనపు ఖర్చులను నివారించుకోవచ్చు.
Also Read: డేటింగ్ యాప్స్‌లో చాట్‌ఫిషింగ్ కలకలం.. రొమాంటిక్ మెసేజ్‌లతో మాయాజాలం