Kannappa Movie : మంచు విష్ణు ప్రెస్టేజియస్ మూవీగా భారీ బడ్జెట్తో తెరకెక్కిన చిత్రం కన్నప్ప (Kannappa) . అక్షయ్ కుమార్ (Akshay Kumar), కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal), మోహన్ లాల్ (Mohan lal), ప్రభాస్ (Prabhas), బ్రహ్మానందం(Brahmanandam ), శరత్ కుమార్ (Sarath Kumar) లాంటి భారీ తారాగణం భాగమైన ఈ సినిమా.. అటు థియేటర్లలో ఇటు ఓటీటీలలో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమా టీవీ ప్రీమియర్ కి సిద్ధమవుతోంది. దీపావళి సందర్భంగా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ షోగా అక్టోబర్ 19న మధ్యాహ్నం 12 గంటలకు జెమినీ టీవీలో సన్ నెట్వర్క్ వారు ప్రసారం చేయనున్నారు. ఈ సందర్భంగా చిత్ర బృందం ఒక ప్రత్యేకమైన పోస్టర్ ను విడుదల చేస్తూ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా ఈ సినిమా కోసం సన్ నెట్వర్క్ దాదాపు 8 సంవత్సరాలు తర్వాత చేస్తున్న ఒక పని అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే.. దాదాపు 8 సంవత్సరాల తర్వాత సన్ నెట్వర్క్ ఒకేసారి నాలుగు భాషల్లో ఒకే చిత్రాన్ని ప్రసారం చేస్తుండడం కన్నప్పకు దక్కిన మరో గౌరవం అని చిత్ర బృందం చెబుతోంది. మొత్తానికైతే కన్నప్ప సినిమా సన్ నెట్వర్క్ కి సంబంధించిన నాలుగు భాషల్లో ఒకేసారి ఒకే సమయంలో ప్రసారం కాబోతుండడం గమనార్హం.
ఏవీఏ ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై డాక్టర్ మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. జూన్ 7 2025న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా.. సెప్టెంబర్ 4 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కి వచ్చింది.
ALSO READ:Star Singer: క్యాన్సర్ తో గ్రామీ విజేత కన్నుమూత
అడవిలో గూడెంలో పుట్టిన తిన్నడు(మంచు విష్ణు).. చిన్నవయసులోనే తల్లిని కోల్పోతాడు. అలా తల్లి లేకపోవడంతో తండ్రి నాథనాథుడు (శరత్ కుమార్) అన్ని తానై పెంచుతాడు. గూడెంలో జనాలంతా ఎలాంటి సమస్యలు లేకుండా చల్లగా ఉండాలి అంటే.. అమ్మవారికి నరబలి ఇవ్వాల్సిందే అని అక్కడి ప్రజలు నమ్ముతారు. అలా చిన్నప్పుడే తన స్నేహితుడిని బలి ఇవ్వడం చూసిన తిన్నడు అసలు దేవుడే లేడు.. అది ఒట్టి రాయి మాత్రమే అంటూ అప్పటి నుండి నాస్తికుడిగా మారుతాడు. పెద్దయిన తర్వాత కూడా తిన్నడులో మార్పు రాదు. దీన్ని వ్యతిరేకించిన తిన్నడిని గూడెం నుండి బహిష్కరిస్తారు. అప్పటికే ప్రేమించిన నెమలి (ప్రీతి ముకుందన్) కూడా తిన్నడుతోపాటు బయటకు వస్తుంది . ఇక బయటకు వచ్చిన తిన్నడు మహా శివ భక్తుడిగా ఎలా మారుతాడు ? ఆయన మారేందుకు రుద్ర (ప్రభాస్) చేసిన సహాయం ఏమిటి? మహా భక్తుడిగా తిన్నడు మారడానికి ఎదురైన పరిస్థితులు ఏంటి? వాయు లింగానికి కాపలా కాస్తున్న మహాదేవశాస్త్రి (మోహన్ బాబు) ఎవరు? అనేది మిగతా సినిమా కథ. ప్రేక్షకులను థియేటర్లలో మెప్పించిన ఈ సినిమా.. ఇప్పుడు టీవీల్లో ఎలాంటి రికార్డు క్రియేట్ చేస్తుందో చూడాలి.