Gundeninda GudiGantalu Today episode September 15th : నిన్నటి ఎపిసోడ్ లో.. రాత్రి గది కోసం బాలు పెద్ద రనరంగమే చేస్తాడు. మనోజ్ ను రోహిణి బయటికెళ్ళి పడుకోవాలి లేదంటే ఆ బాలు వస్తే మనల్ని చంపేస్తాడు అని అంటుంది. రోహిణి మనోజ్ కు క్లాస్ పీకుతుంది. నువ్వు బయటికి రాకుంటే బాలు లోపలికి వచ్చి తలుపు బద్దలు కొట్టేస్తాడు. అందుకే బయటకు వెళ్దాం పద అని రోహిణి చెబుతుంది. బాలు తలుపు బద్దలు కొడతాను అని అరుస్తాడు. దానికి బయపడి రోహిణి బాలును తీసుకొని బయటకు వస్తుంది. ఏం జరిగింది అని ప్రభావతి సత్యం కంగారుగా కిందకు వస్తారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. రోహిణి ఏంటి ఆంటీ ఇంట్లో ఉండాలా వద్దా.. మీకు అరుపులు వినిపించలేదా..? రూం నుంచి బయటకు వచ్చేవరకు బాలు ఎలా గోల చేశాడో.. అసలు వీడికి రూమ్ ఎందుకు ఇవ్వాలి అని మనోజ్ అంటాడు.. దానికి సత్యం వాడు ఇన్నిరోజులు బయట పడుకోలేదా.. అందరు సమానంగా ఉండాలి. అమ్మ చెప్పినట్లే నేను చేస్తున్న నువ్వు కంగారు పడకు.. లేదంటే గది వేయించడానికి డబ్బులు ఇవ్వండి అంటాడు. నానమ్మ చెప్పినట్టు చేయాలి కదరా అందుకే నేను కూడా ఏం మాట్లాడలేకపోయాను అని ప్రభావతి చేతులెత్తేస్తుంది. దాంతో ఇక రోహిణి మనోజ్ కింద పడుకోవడానికి ఒప్పుకుంటారు..
బాలు రూమ్ లో ఎలా ప్రశాంతంగా నిద్రపోతాడు నేను చూస్తానని మనోజ్ పదేపదే తలుపు కొట్టి విసిగిస్తూ ఉంటాడు. ఇక బాలు కోపం వచ్చేసి అక్కడున్న వస్తువులన్నిటిని దుప్పట్లో మూటకట్టి పంపిస్తాడు. మళ్లీ ఎవరో డోర్ కొడుతున్నారని చూస్తే మీనా ఎదురుగా కనిపిస్తుంది. కోసమే నేను వెయిట్ చేస్తున్నాను నువ్వు ఇంత లేటుగా వస్తావు ఏంటి అని అరుస్తాడు. ఇవన్నీ ఎందుకు బెడ్ ఉంది కదా అని బాలు అడిగితే వాళ్ల బెడ్ మీద మనం ఎలా పడుకుంటాము అని చాప వేస్తుంది మీనా. నువ్వెక్కడ పడుకుంటే నేను అక్కడే పడుకోవాలి అని బాలు అంటాడు.
నువ్వు నా గుండెల మీద తల పెట్టుకొని పడుకో. నాకు చాలా హాయిగా ఉంటుందని బాలు అంటాడు. నేనా నీ గుండెల మీద పడుకుంటే బరువు లేదా అనేసి అడుగుతుంది. ప్రేమతో గుండెల మీద పడుకుంటే ఆ ప్రేమ బరువుని తగ్గిస్తుంది కదా అని ఇద్దరు కాస్త రొమాంటిక్ టచ్ లో మాట్లాడతారు. ఇద్దరూ సంతోషంగా గడుపుతారు. మనోజ్ కి మాత్రం దోమలతో ఉక్కపోతతో నిద్ర లేక అవస్థలు పడతారు. ఆ తర్వాత ఉదయం ప్రభావతి లేవగానే అమ్మ నాకు నిద్ర రాలేదమ్మా రోహిణి మాత్రం నిద్రపోతుంది ఏదో ఒకటి చెయ్యమని అంటాడు.
Also Read : సినిమాలకు సంయుక్త బ్రేక్.. ఆ కారణంతోనే షాకింగ్ నిర్ణయం..!
నేనేం చేయాలి రా ఇది మీ నానమ్మ మీ నాన్న వేసిన ఆర్డర్ మాత్రమే అని అంటుంది. అవును నిజమే కానీ నాకు ఇక్కడ దోమలకు నిద్ర పట్టలేదు ఏదో ఒకటి చేయమ్మా అంటే ఒక వారం రోజులు ఓపిక పత్ర ఏదో ఒకటి చేద్దామని అంటుంది ప్రభావతి. ఇక శృతి కింద పడుకోదు కచ్చితంగా ఏదో ఒకటి చేస్తుంది లే అని రోహిణి మనోజ్తో అంటుంది. ఆ తర్వాత అందరూ రెడీ అయ్యి వచ్చి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని టిఫిన్ చేయడానికి రెడీగా ఉంటారు కానీ మనోజ్ మాత్రం డైనింగ్ టేబుల్ మీద కూర్చొని నిద్రపోవడం చూసి అందరూ నవ్వుకుంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..