E-Paper
Advertisement

మెహబూబ్ తో లవ్.. స్పందించిన శ్వేతా నాయుడు!

మెహబూబ్ తో లవ్.. స్పందించిన శ్వేతా నాయుడు!
Advertisement

Swetha Naidu:సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా కెరియర్ మొదలుపెట్టి ఆ తర్వాత యూట్యూబర్ గా మంచి పేరు సొంతం చేసుకున్న శ్వేతా నాయుడు (Swetha Naidu) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. డాన్సర్ గా ఊహించని క్రేజ్ దక్కించుకున్న ఈమె ఢీ 14లో టీం లీడర్ గా పనిచేసి, ఢీ 17 లో రన్నరప్ గా నిలిచి ఆడియన్స్ హృదయాలను దోచుకుంది. ఢీ 20 లో కూడా కనిపించి సందడి చేసిన విషయం తెలిసిందే. అలా మంచి ప్రజాదారణ సొంతం చేసుకున్న శ్వేతా నాయుడు బిగ్ బాస్ సీజన్ 10 లోకి వైల్డ్ కార్డు ద్వారా అడుగు పెట్టింది .అక్కడ తనదైన పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను మెప్పించి, ఫ్యామిలీ వీక్ వరకు ఉన్న ఈమె అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యి అభిమానులను ఆశ్చర్యపరిచింది.

మెహబూబ్ తో ప్రేమలో పడ్డ శ్వేతా నాయుడు..

బిగ్ బాస్ 10 నుండి బయటకు వచ్చిన తర్వాత పలు ఇంటర్వ్యూలు ఇస్తూ వార్తల్లో నిలుస్తున్న ఈమె. గత కొంతకాలంగా మెహబూబ్ తో ప్రేమలో ఉందంటూ వస్తున్న వార్తలపై తాజాగా స్పందించింది. ఇంటర్వ్యూలో భాగంగా మీరు మెహబూబ్ (Mehaboob dil Se) తో లవ్ లో ఉన్నారు అంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి కదా.. సోషల్ మీడియాలో కూడా మీ జోడి పై పెద్ద ఎత్తున రూమర్స్ వస్తున్నాయి. మరి దీనిపై మీ సమాధానం ఏంటి? అని ప్రశ్నించారు.

గత పదేళ్లుగా అంటూ క్లారిటీ..

Advertisement

శ్వేతా నాయుడు మాట్లాడుతూ… “మా ఇద్దరి మధ్య ఏమీ లేదు. మేము కేవలం స్నేహితులం మాత్రమే. గత 10 సంవత్సరాలుగా మేమిద్దరం స్నేహితులుగానే కొనసాగుతున్నాము. ఇప్పటికి ఒకరికొకరు ఫోన్ కాల్స్ చేసుకుంటాము.. కలుస్తూ ఉంటాము. ఇంస్టాగ్రామ్ లో కూడా ఒకరినొకరం ఫాలో అవుతున్నాము. మేమిద్దరం స్నేహితులం మాత్రమే మా మధ్య ఏమీ లేదు” అంటూ క్లారిటీ ఇచ్చింది శ్వేతా నాయుడు. మొత్తానికైతే పదేళ్లుగా తమ మధ్య స్నేహం తప్ప మరో బంధం లేదు అని క్లారిటీ ఇవ్వడంతో రూమర్స్ కి కాస్త చెక్ పడింది.

ALSO READ:‘ఓమ్’ మూవీ నటీనటుల రెమ్యూనరేషన్?

రూమర్స్ క్రియేట్ అవ్వడానికి కారణం?

Advertisement

బిగ్ బాస్ కంటెస్టెంట్ గా పేరు దక్కించుకున్న మెహబూబ్ దిల్ సే యూట్యూబ్, టిక్ టాక్ వీడియోలతో భారీ ఆదరణ సొంతం చేసుకున్నారు. ఇక బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొని మరింత పాపులారిటీ అందుకున్న మెహబూబ్.. షో నుంచి బయటకు వచ్చాక గుంటూరు మిర్చి అనే వెబ్ సిరీస్ తో పాటు కవర్ సాంగ్స్, వెబ్ సిరీస్ లు అలాగే సినిమాలలో కూడా చేస్తూ బిజీగా మారారు.

ముఖ్యంగా శ్వేతా నాయుడుతో కలిసి గతంలో ఎక్కువగా ఇంస్టాగ్రామ్ రీల్స్ అప్లోడ్ చేస్తూ వచ్చిన మెహబూబ్.. 2021లో ఆమెతో ఉన్న ఒక వీడియోని షేర్ చేస్తూ..” ఎప్పటినుంచో చెబుదాం అనుకున్నాను. కానీ ఎప్పుడు ఎలా అయిందో తెలియదు? ఎందుకు ఇష్టం అన్నదానికి సమాధానం లేదు.. నువ్వు నా తోడుంటే బెటర్, సక్సెస్ఫుల్ పర్సన్ ని అవుతాను. నాతో జీవితాంతం తోడుంటావా?” అంటూ తన మనసులో మాటను బయటపెట్టి ఆమెకు ప్రపోజ్ చేశాడు. దీంతో ఆమె సిగ్గుపడుతూ మెహబూబ్ ప్రేమను అంగీకరించింది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.

అయితే ఇది రియలా లేక యూట్యూబ్ కోసం చేసిన ప్రాంక్ వీడియోనా అన్నది అప్పట్లో ప్రశ్నార్ధకంగా మారినా.. అప్పటి నుంచే వీరిద్దరు ప్రేమలో ఉన్నారని వార్తలు వైరల్ అయ్యాయి. ఇక తర్వాత అది యూట్యూబ్ వీడియో అని అందరికీ తెలిసిందే. కానీ ఏదో ఉందనే వార్తలు వైరల్ కాగా.. ఇన్నేళ్లకు శ్వేతా నాయుడు క్లారిటీ ఇచ్చింది.

Related News

సలహా ఇస్తూనే ఏడిపించేసిన వీ.జే.సన్నీ.. ప్రియాంక ప్రవర్తనపై శివ్ తో ఏమన్నారంటే?

చె*ప్పుతో కొడతా.. మనుషులేనా.. ట్రోలర్స్ పై ఫైర్ అవుతున్న రాధమ్మ కూతురు!

‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. భద్ర అవుట్..

Gundeninda GudiGantalu Today episode: అయ్యో సుమతికి ఏమైంది..? అరుణ్, బాలు గొడవ.. ఏడ్చిన ప్రభావతి..

Podarillu Today Episode : మహాకు సారీ చెప్పిన విక్కీ.. మహా మాటతో విక్కీ షాక్.. చక్రీ, మహా కలిసిపోతారా..?

Illu Illalu Pillalu Today Episodes: నర్మదా పై వేదవతి సీరియస్.. అంజలి పై చందు ఫైర్.. ధీరజ్ కు దొరికిన చందు..

Brahmamudi Serial Today Episode November 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: అపర్ణ ను భయపెట్టిన భ్రమరాంబ 

Big Stories

Advertisement
×