Brahmamudi : తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్స్ లలో మంచి టీఆర్పీ రేటింగ్ తో దూసుకుపోతున్న సీనియల్స్ లలో బ్రహ్మముడి మూవీ ముందు వరుసలో ఉంటుంది. తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న ఈ డైలీ సీరియల్ లో హీరోగా నటిస్తున్న మానస్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. గతంలో ఈయన నటించిన ప్రతి సీరియల్ అందరిని బాగా ఆకట్టుకున్నాయి. అయితే ఇందులో మంచి క్రేజ్ వచ్చింది. భార్యను అర్ధం చేసుకోకుండా ఆమెను సూటిపోటి మాటలతో హింసించే భర్తగా మానస్ ఒదిగిపోయారు. మరి బ్రహ్మముడిలో నటిస్తున్నందుకు గాను మానస్ రెమ్యునరేషన్ ఎంత? ఒక్కరోజుకు ఎన్ని లక్షలు తీసుకుంటున్నాడో ఒక్కసారి వివరంగా తెలుసుకుందాం..
బ్రహ్మముడి సీరియల్ కు రాజ్ రెమ్యూనరేషన్..?
స్టార్ మా లో ప్రసారం అవుతున్న హిట్ సీరియల్స్ లలో బ్రహ్మముడి సీరియల్ ఒకటి. టీఆర్పీలో ఈ ధారావాహిక దరిదాపుల్లోకి కూడా మరో సీరియల్ లేదంటే అతిశయోక్తి కాదు. బ్రహ్మముడిలో హీరో రాజ్‌గా బుల్లితెర నటుడు మానస్ నాగులపల్లి అద్భుతంగా నటించారు.. ఇష్టం లేని పెళ్లి చేసుకున్న అతను భార్యను మానసికంగా హింసిస్తు ఇబ్బంది పెట్టేవాడు. అలా చివరికి భార్యతో కనెక్ట్ అవుతాడు. మానస్ భారీగా రెమ్యునరేషన్ అందుకొంటున్నాడు. ఈ ధారావాహికలో నటించిన ఆయనకు ప్రతీ రోజు 50 వేల రూపాయల చొప్పున పారితోషికాన్ని అందుకొంటున్నట్టుగా టాక్.. రోజుకు ఇంత అందుకుంటే పూర్తిగా నెల రోజుల వరకు షూటింగ్ జరుగుతుంది. మరి దానికి లక్షల్లోనే అందుకుంటున్నాడని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.. 20 రోజులు షూటింగ్ జరిగితే 10 నుంచి 12 లక్షలు అందుకొనే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. అంటే నెలకు లక్షల్లో సంపాదిస్తున్నాడని తెలుస్తుంది.
Also Read : నెటిజన్స్ కు దిమ్మతిరిగే కౌంటర్.. నిధిలో ఈ యాంగిల్ కూడా ఉందా..?
మానస్ గురించి ఆసక్తికర విషయాలు..
ఆగస్ట్ 2, 1990న విశాఖపట్నంలో జన్మించారు మానస్ నాగులపల్లి. ఆయన పూర్తి పేరు మాస్టర్ రామ్ తేజ.. అటు చదువుల్లో కూడా మంచి ర్యాంకులు సాధిస్తున్నాడు. అయితే స్క్రీన్ పై కనిపించాలనే కోరికతో అటుగా ఆయన అడుగులు వేసాడు. బాల నటుడిగా 2001లో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టాడు. బీ. గోపాల్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన నరసింహానాయుడు సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించాడు. ఆ తర్వాత పలు సినిమాల్లో కనిపించిన ఆయన క్షీరసాగర మథనం, అర్జున్, వీడే లాంటి సినిమాల్లో హీరోగా చేశాడు. ఆ సినిమాలు మంచి పేరును అందించాయి. దాంతో పాటుగా బిగ్ బాస్ లో తన సత్తాను చాటాడు.. ప్రస్తుతం బుల్లితెర పై వరుస సినిమాలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని టాక్.. ఒకవైపు వరుసగా సీరియల్స్ చేస్తున్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సీరియల్ అందరిని బాగా ఆకట్టుకున్నాయి. అన్నింట్లో కన్నా ఎక్కువగా బ్రహ్మముడి డైలీ సీరియల్ ఎక్కువ ప్రేక్షకుల ప్రశంసలు పొందింది. ఇటీవలే ఓ ఇంటివాడు అయిన మానస్ ఓ బిడ్డకు తండ్రి అయ్యాడు. ఇక సీరియల్స్, షోలతో బిజీగా ఉన్నా కూడా మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటాడు.