BigTV English

Nidhi Agarwal: నెటిజన్స్ కు దిమ్మతిరిగే కౌంటర్.. నిధిలో ఈ యాంగిల్ కూడా ఉందా..?

Nidhi Agarwal: నెటిజన్స్ కు దిమ్మతిరిగే కౌంటర్.. నిధిలో ఈ యాంగిల్ కూడా ఉందా..?

Nidhi Agarwal: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ నిధి అగర్వాల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎపుడో ఎంట్రీ ఇచ్చింది. కానీ ఇప్పటివరకు చేసిన సినిమాల్లో ఇస్మార్ట్ శంకర్ మూవీ ఒక్కటే హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈమె వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఈమె సవ్యసాచి, మిస్టర్ మజ్ను సినిమాలతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ నిధి అగర్వాల్‌. తక్కువ సమయంలోనే ఈ అమ్మడికి ఇస్మార్ట్‌ శంకర్ సినిమాలో నటించే అవకాశం దక్కడంతో పాటు, సూపర్‌ హిట్‌ దక్కింది. ఈ మూవీ తర్వాత బిజీ అవుతుందని అనుకున్నారు కానీ పెద్దగా సినిమాలు చెయ్యలేదు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నిధి లేటెస్ట్ ఫోటోలతో పాటుగా తన పై కామెంట్స్ చేసిన వారికి దిమ్మతిరిగే కౌంటర్ ఇస్తుంది. తాజాగా ఓ నెటిజన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


నెటిజన్ కు స్ట్రాంగ్ కౌంటర్.. 

సినిమాలతో బిజీగా ఉండే ఈమె కు నెటిజన్స్ వల్ల తీవ్ర అసహనం వ్యక్తం చేస్తుంది. నిజానికి కొందరు ఈమెపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. నీ తర్వాత వచ్చిన హీరోయిన్స్‌ చాలా మంది నీ కంటే ఎక్కువ సినిమాలు చేశారు. కానీ నువ్వు మాత్రం ఇప్పటికీ సినిమాల సంఖ్యను పెంచలేక పోతున్నావు అంటూ విమర్శిస్తున్నారు. మొన్న వచ్చిన శ్రీలీల ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటుంది . ఆమె కన్నా ముందు ఎంట్రీ ఇచ్చిన నువ్వు ఇంకా స్టార్ ఇమేజ్ ను అందుకోలేదు. కనీసం సినిమాలను పెంచితే బెటర్ అని సలహాలుఇచ్చారు. దానికి సీరియస్ అయిన ఆమె దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది. . నా గురించి ఎక్కువ ఆందోళన అవసరం లేదు. తొందర పడాలని నేను అనుకోవడం లేదు. తొందర పడటం వల్ల ఫలితం తారు మారు అయ్యే అవకాశాలు ఉన్నాయి.. స్లో గానే చేద్దాం అని రిప్లై ఇచ్చింది.


నిధి సినిమాలు.. 

మొన్నటివరకు సినిమాలు కోసం వెయిట్ చేసిన ఈమె ప్రస్తుతం రెండు మూడు భారీ ప్రాజెక్టులతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీగా ఉంది. ప్రభాస్ సరసన రాజా సాబ్, పవన్ కళ్యాణ్ తో కలిసి హరిహర వీరమల్లు మూవీలో నటిస్తుంది. ప్రస్తుతం చేస్తున్న రెండు సినిమాలు పెద్ద హీరోల సినిమాలు కావడంతో కచ్చితంగా ఈ అమ్మడు ముందు పెద్ద సినిమాలు మరిన్ని చేయడంతో పాటు, పలువురు పెద్ద హీరోల సినిమాలను చేసే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.. రెండు భారీ ప్రాజెక్టులు కావడం తో ఆచితూచి వ్యవహారిస్తుంది. మరి నెక్స్ట్ ఏ హీరోతో చేస్తుందో చూడాలి.. ఈమె నటించిన రెండు సినిమాలు త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ముందుగా పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు మూవీస్ రిలీజ్ అవుతుంది. ఈ చిత్రం నుంచి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ ఆకట్టుకుంటున్నాయి. సినిమా ఎలా ఉంటుందో చూడాలి..

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×