OTT Movie : బాసిల్ జోసెఫ్ ఇప్పుడు స్టార్ హీరో అయిపోయాడు. రీసెంట్ గా ఇతని సినిమాలు థియేటర్లతో పాటు, ఓటీటీ లో కూడా ఆదరగొడుతున్నాయి. మంచి కంటెంట్ ఉన్న కథలను ఎంచుకోవడంలో ఈ హీరో ఒక అడుగు ముందే ఉన్నాడు. అందులోనూ ఇతని నటన నేచురల్ గా ఉండటంతో, ప్రేక్షకులు కూడా ఇతని సినిమాలు ఆదరించడం మొదలుపెట్టారు. రీసెంట్ గా వచ్చిన ఒక బ్లాక్ కామెడీ థ్రిల్లర్ మూవీ ఓటిటిలో అదరగొడుతుంది. ఇందులో ఒక మర్డర్ చుట్టూ తిరిగే ఇన్వెస్టిగేషన్లో, అనేక మలుపులు తిరుగుతాయి. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే…
సోనీ లివ్ (Sony liv) లో
ఈ మలయాళం బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ప్రవీంకూడు షాప్పు’ (Pravinkoodu Shappu). దీనికి శ్రీరాజ్ శ్రీనివాసన్ దర్శకత్వం వహించారు. అన్వర్ రషీద్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ద్వారా అన్వర్ రషీద్ దీన్ని నిర్మించారు. ఈ మూవీలో సౌబిన్ షాహిర్, బాసిల్ జోసెఫ్, చెంబన్ వినోద్ జోస్ ప్రధాన పాత్రల్లో నటించగా, చాందిని శ్రీధరన్, శివజిత్, శబరీష్ వర్మ సహాయక పాత్రల్లో నటించారు.ఈ మూవీ ఒక రాత్రి తాటి కల్లు షాపులో జరిగే ఒక మర్డర్ మిస్టరీ చుట్టూ తిరుగుతుంది. 2024 ఫిబ్రవరి లో త్రిసూర్, ఎర్నాకులంలో షూటింగ్ ప్రారంభమైంది. ఈ మూవీ 16 జనవరి 2025న థియేటర్‌లలో విడుదలైంది. ఏప్రిల్ 11, 2025 నుంచి ఈ మూవీ సోనీ లివ్ (Sony liv) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
వర్షం కారణంగా తాటి కల్లు షాపును మూసివేసినా కూడా, ఆ రోజు రాత్రి, 11 మంది వ్యక్తులు లోపల ఉండి కార్డులు ఆడుతూ, తాగుతూ గడుపుతారు. మరుసటి ఉదయం, షాపు యజమాని కొంబన్ బాబు షాపు మధ్యలో ఉరివేసుకుని చనిపోయినట్లు కనిపిస్తాడు. ఈ కేసును ఛేదించేందుకు ఎస్ఐ సంతోష్ (బాసిల్ జోసెఫ్) రంగంలోకి దిగుతాడు. సంతోష్ తన తెలివితేటలతో కేసును విచారించడం ప్రారంభిస్తాడు. కానీ షాపులో ఉన్న ప్రతి వ్యక్తికి ఏదో ఒక రహస్యం ఉండటంతో విచారణ క్లిష్టంగా మారుతుంది. కణ్ణన్ (సౌబిన్ షాహిర్) ఆ షాపులో పనిచేసే వ్యక్తిగా ఉంటాడు. సంతోష్, కణ్ణన్ ను మొదట అనుమానిస్తాడు. ఇతనికి కొంచెం అవిటి తనం కూడా ఉంటుంది. కణ్ణన్ భార్య మెరిండా (చాందిని శ్రీధరన్) కూడా అనుమానంగా వ్యవహరిస్తుంది.
పోలీసుల విచారణలో కొంబన్ బాబు ఒక దూకుడు మనిషిగా గుర్తిస్తారు. ఇతనికి ఇదివరకే చాలా గొడవలు జరిగిఉంటాయి. అయితే మెరిండా పై ఒక సారి అఘాయిత్యం చేస్తాడు కొంబన్. ఈ విషయం ఎవరికీ చెప్పకుండా తమలోనే దాచుకుంటారు. ఈ ఘటనలో మెరిండా కి ప్రెగ్నెన్సీ కూడా పోతుంది. మరోవైపు కణ్ణన్ కి మ్యాజిక్ చేయడం వస్తుంది. కల్లులో మత్తు వచ్చే మాత్రలు అతని దగ్గర ఉంటాయి. వీటి ఆధారంగా కణ్ణన్ ని అనుమానిస్తాడు సంతోష్. చివరికి ఆ హత్య ఎవరు చేశారో సంతోష్ కనిపెడతాడా ? ఈ కేసులో వచ్చే చిక్కులను సంతోష్ ఎలా తీస్తాడు? కణ్ణన్ పాత్ర ఎంత ఉంది ? ఈ విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే, ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.
Read Also : మొదటి రాత్రే పైకి పోయే పెళ్లి కొడుకు … ప్రియుడి ఆత్మతో గందరగోళం… మైండ్ బ్లాక్ చేసే మిస్టరీ థ్రిల్లర్