Illu Illalu Pillalu Today Episode April 9th : నిన్నటి ఎపిసోడ్ లో.. చందు సేటు దగ్గరికి వెళ్లి డబ్బులు కావాలి అని అడుగుతాడు. ఎంత కావాలి బాబు నీకు ఎంత కావాలన్నా ఇస్తాను అయితే మీ నాన్నగారితో ఒక మాట చెప్పిందో చాలు అనేసి అనగానే చందు షాక్ అవుతాడు. నా పర్సనల్ ఖర్చులకోసం నేను తీసుకుంటున్నానండి కచ్చితంగా నెలరోజులు తిరిగిచ్చేస్తాను మీరు అర్థం చేసుకోవాలి అని బ్రతిమలాడుతాడు. ఏంటి ఏం మాట్లాడుతున్నావ్ మీ నాన్నగారు ఉంటే నమ్మకం ఆయన మాట లేకుండా ఆయన ఏమీ చేయకుండా నేను నీకు డబ్బులు ఇస్తే నువ్వు ఇస్తావని గ్యారెంటీ ఏంటి అని చెందును సేటు అడుగుతాడు.. అప్పుడే రామరాజు సేటుకు పెళ్లి పత్రిక ఇవ్వడానికి అక్కడికి వస్తాడు. అయితే చందు నిజం చెప్పొద్దని అడుగుతాడు. బాధను అర్థం చేసుకున్నా సేటు చందు కు డబ్బులు ఇస్తాడు. ఆ డబ్బులు తీసుకెళ్లి శ్రీవల్లికి ఇస్తాడు. భాగ్యం ప్లాను మొత్తానికి వర్కౌట్ అయినట్టే కనిపిస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. డబ్బులు చేతిలో పడటంతో భాగ్యం మొహం వెలిగిపోతుంది. పడ్డాడు బుట్టలో అని సంబరపడిపోతుంది. అనంతరం ఇరు ఫ్యామిలీలు కలిసి బట్టలు కొనడానికి షాపింగ్‌కి వెళ్తారు. అమ్మోయ్.. ఇంత పెద్ద బట్టల కొట్టుకి మనం ఎప్పుడూ రాలేదు కదే.. మన బండారం బయటపడిపోతుందేమోనని భయంగా ఉందే అని అంటుంది శ్రీవల్లి.. నువ్వేం మాట్లాడకుండా రా అమ్మడు నేను చూసుకుంటాను కదా అనేసి భాగ్యం అంటుంది.. ఎస్కలేటర్ మీద ఎక్కడానికి అందరూ భయపడిపోతారు.. పైకి వెళ్ళగానే ఆనంద్ రావు ఎస్కులేటర్ ని దిగడానికి భయపడి కింద పడతాడు సాగరు సెటైర్లు వేస్తాడు. పెళ్ళికొడుకు బట్టలు పెళ్ళికొడుకు తీసుకుంటారు ముందు మనకి బట్టలు తీసుకుందాం రండి అని భాగ్యం అంటుంది. వేదవతి కూడా అలాగే వదిన గారు అందరికీ బట్టలు తీసుకుందాం పదండి అని అంటుంది.
ముందు కోడలికి బట్టలు చూద్దాం పదండీ అని వేదవతి అంటే.. లేదు లేదు.. పద్దతి ప్రకారం మగపెళ్లి వారికే కొనాలి.. ఫస్ట్ మీ ఫ్యామిలీలో ఎవరికి ఏం కావాలో తీసుకోండి.. డబ్బులు మేం కట్టేస్తాం అని అంటుంది భాగ్యం. ఏటండీ ఆవిడగారండీ.. డబ్బులు కట్టేస్తా అంటున్నావ్.. ఓ యాభై వేలు పెట్టి కొంటావా ఏంటీ అని అంటాడు భాగ్యం భర్త. అబ్బే పది వేలులో మొత్తం తెమిల్చేత్తాను.. అని అంటుంది భాగ్యం. వాళ్లు ఒప్పుకుంటారా అంటే.. నేను ఒప్పిస్తాగా అని అంటుంది భాగ్యం.. మొత్తానికి భాగ్యం ముందు వాళ్లకి చీరలు కొనడానికి ఒప్పించేస్తుంది..
ఆమె అన్నట్టుగానే రామరాజు ఫ్యామిలీ మొత్తాన్ని మరోసారి గొర్రెల్ని చేస్తుంది. ఎవరికి ఏ చీర నచ్చిందని చెప్పినా కూడా.. అబ్బే ఇది బాలేదని తక్కువ రేటు చీరల్నే బలవంతంగా కట్టపెట్టేస్తుంది భాగ్యం. భాగ్యము తన కూతుర్లకు మాత్రం ఖరీదైన చీరలను చూపించమని అడుగుతుంది ఒక్కొక్క చీర ఖరీదు 75000, 80000 ఉండేలా చూసుకుంటుంది.. భాగ్యం పీసినాడు తనని చూసి ప్రేమ నర్మదా ఒక ప్లాన్ చేస్తారు. ఇది గమనించావా అక్క మన వాళ్ళకైతే చీప్ గా ఉన్న చీరలను కొనిపిస్తుంది. వాళ్లకేమో వేళల్లో కావాలని అడుగుతుంది ఏదో ఒకటి చేయాలి అక్క అనేసి ఇద్దరు కలిసి ఒక ప్లాన్ చేస్తారు.
ఇక్కడ షాప్ లో ఉన్న వ్యక్తిని 70000, 80000 పైగా ఉన్న స్టిక్కర్లని మాకు ఇస్తారని అడుగుతారు. ఎందుకు మేడం అంటే పిల్లలు ఆడుకోవడానికి అని ప్రేమ అబద్ధం చెప్తుంది. ఆ స్టిక్కర్లని 1000 రూపాయలు ఉన్న చీరలకి అంటించి భాగ్యం ని తిరిగి బురిడీ కొట్టిస్తారు. ఈ చీరలు చాలా ఖరీదైనవి పిన్ని గారు లక్షకు పైగా ఉన్నాయి మీకు నచ్చాయా అని అడక్కని భాగ్యం రేట్లు చూసి చూడడానికి చీప్ గా అన్న చాలా బాగున్నాయి అమ్మాయి రేటు చాలా ఖరీదు కదా అనేసి అంటుంది. వేదవతి మాత్రం తన కోడలు ఏం చేస్తున్నారని టెన్షన్ పడుతూ ఉంటుంది.
ఇక నర్మదను ప్రేమను తీసుకెళ్లి బట్టలు కొనిపించమని తన కొడుకులకు చెప్తుంది. అక్కడిదో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. ప్రేమ మాత్రం వద్దని అనేస్తుంది. తీసుకోమని ధీరజ్ అనేసరికి.. ‘మీ నాన్న అన్నమాటల్ని నువ్వు మర్చిపోతావేమో కానీ.. నేను మర్చిపోలేను.. అంతకీ నీకు చీర కొనాలంటే.. నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బులు ఇవ్వు కొనుక్కుంటా అని అంటుంది. నా దగ్గర 15 వందలే ఉన్నాయి అని ధీరజ్ అంటే.. అవే చాలు నాకు చీర రేటు కంటే కూడా ఆత్మాభిమానమే ముఖ్యం అని అంటుంది ప్రేమ. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..