Akkada Ammayi ikkada Abbayi: చిన్న సినిమాలను చూసి సపోర్ట్ చేయడానికి టాలీవుడ్ లో స్టార్ హీరోలు అంతా ముందే ఉంటారు. దానికి నిదర్శనం రీసెంట్ గా వచ్చిన ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రానికి, జూనియర్ ఎన్టీఆర్ సపోర్ట్ చేయడం. మెగా స్టార్ ‘చిరంజీవి’ నుండి సూపర్ స్టార్ ‘మహేష్ బాబు’ వరకు సినిమా చిన్నదైన పెద్దదైన అది చూసి బాగుంటే వెంటనే ట్విట్ చేసి వారిని ఎంకరేజ్ చేస్తారు. ఇప్పుడు చిన్న సినిమాలకు సపోర్ట్ చేసే హీరోల లిస్టులో రామ్ చరణ్ చేరారు. ప్రదీప్, దీపికా పిల్లి నటిస్తున్న ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమా మొదటి టికెట్ ను రామ్ చరణ్ కొనుగోలు చేశారు. ఈ వీడియో ను మూవీ నిర్మాతలు రిలీజ్ చేశారు. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం..
మొదటి టికెట్ అందుకున్న గ్లోబల్ స్టార్ ..
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రదీప్ మూవీ ప్రమోషన్ లో భాగమయ్యారు. ఫస్ట్ టికెట్ ను రామ్ చరణ్ చేతుల మీదగా లాంచ్ చేయించారు. ఈ మేరకు ప్రదీప్, సత్యాలతో కలిసి ఒక ఫన్నీ వీడియోను రిలీజ్ చేశారు నిర్మాతలు. వీడియో ఇలా సాగింది … ఫస్ట్ డే ఫస్ట్ టికెట్ గ్లోబల్ స్టార్ చేతిలో పెడితే బాగుంటుంది అని హీరో అంటుండగా.. సత్య తనకి టికెట్ ఇస్తున్నాడేమో అని ఫీల్ అవుతాడు. నేను ఇవ్వాలనుకుంటున్నది నీకు కాదు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కి అని అంటాడు ప్రదీప్. ఆయన నేను ఎంత క్లోజ్ అయినంత మాత్రాన అని ఫోన్ తీసి రామ్ చరణ్ ఇంట్లో వంట వాళ్లకి ఫోన్ చేస్తాడు. వాళ్ళు మనల్ని రమ్మన్నారు పదం వెళ్దాం అని ప్రదీప్ ని తీసుకొని సత్యా రామ్ చరణ్ ఇంటికి వస్తాడు. అక్కడ మెగా స్టార్ చిరంజీవి ఫోటో చూసి బాస్ ఫోటో చాలా బాగుంది కదా అని ప్రదీప్ అంటాడు. సత్య రామ్ చరణ్ కి నేను చాలా క్లోజ్ అని ప్రదీప్ దగ్గర గొప్పలు చెప్తూ ఉంటాడు. రామ్ చరణ్ లోపలికి వచ్చి ప్రదీప్ కి హాయ్ చెప్పి, విష్ చేస్తాడు. సత్య ని చూసి ఎవరి ఇతను నీ తాలూకానా అని అడుగుతాడు. కావాలనే సత్య ని గుర్తుపట్టనట్టు రామ్ చరణ్ చేసే కామెడీ బాగుంటుంది.
సత్య కాళ్లకు నమస్కారం చేసిన రామ్ చరణ్ ..
సార్ నన్ను గుర్తుపట్టలేదా మీరు అని సత్యా పలకరిస్తూ ఉంటాడు. నీ పేరు కిషోర్ ఆ అని అంటాడు రామ్ చరణ్. కాదు సార్ అని సత్య చెప్తున్నా చరణ్ వినడు. ఇంతకీ మీరు ఎందుకు వచ్చారు అని రామ్ చరణ్ అడగ్గా ప్రదీప్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా రేపు (ఏప్రిల్ )11వ తారీకు రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ టికెట్ ని మీరు కొంటే బాగుంటుంది అని అంటాడు. ఎవరైనా అమ్మాలి కదా కొనాలంటే అని అంటాడు. వెంటనే ప్రదీప్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి పెద్ద టికెట్ ని తీసుకుని రామ్ చరణ్ కి ఇస్తాడు. మీ సినిమా సూపర్ సక్సెస్ అవ్వాలని, బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అని ప్రదీప్ ని విష్ చేస్తాడు చరణ్. లాస్ట్ లో సత్య బాగున్నావా అని పలకరిస్తాడు. సత్య వెంటనే రామ్ చరణ్ కాళ్ళకి నమస్కరిస్తాడు. వెంటనే సత్యా కాళ్లకు రామ్ చరణ్ నమస్కరిస్తాడు. సత్య, ప్రదీప్ ఇద్దరు షాక్ అవుతారు. చరణ్ ఇద్దరికీ నమస్కారం చేస్తాడు. ఏది ఏమైనా చెర్రీ సింప్లిసిటీకి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Also read: Vaishnavi: No.1 ఖతర్నాక్, చీరలో చూసి మోసపోకండి.. వైష్ణవిపై సిద్దు కామెంట్స్.. వీడియో వైరల్