Illu Illalu Pillalu Today Episode April 15th : నిన్నటి ఎపిసోడ్ లో.. పెళ్లిని ఆపేశక్తి మీ భూమిపై ఎవరికీ లేదు అని భాగ్యం అనేసరికి.. నాకు ఉంది కదా అన్నట్టుగా వచ్చి తలుపుకొడుతుంది బ్యుటీషియన్. ఎవరు మీరు అని అంటే.. నేను మేకప్ ఆర్టిస్ట్‌ని అని పరిచయం చేసుకుని శ్రీవల్లి దగ్గరకు వెళ్తుంది. మేకప్ కావాలని నేను చెప్పలేదు కదా.. నువ్వెందుకు వచ్చావ్ అని భాగ్యం అడిగితే.. నన్ను పెళ్లి కొడుకు వాళ్లు పంపించారు అని అంటుంది.. డబ్బులు వాళ్ళే ఇస్తారని అంటుంది.. భాగ్యం అక్కడికి వచ్చి పెళ్లి కూతురు అని చెప్పారు కానీ అక్కడ పెళ్ళికి కూతురు కనిపించదు. భాగ్యం ఎక్కడ పోయిందని టెన్షన్ పడుతూ ఉంటుంది ఈ మేకప్ వేసే అమ్మాయి కూడా లేదని అనుకుంటుంది. కానీ పెళ్లి కూతురు కనిపించడం తో మండపానికి తీసుకొని వెళ్తారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. పెళ్ళికొడుకుని తీసుకోమని పూజారి చెప్తాడు. అప్పుడే విశ్వంకి ఫోన్ రావడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక చందును తీసుకురమ్మని పూజారి గారు చెప్తే ఇద్దరు అన్నదమ్ములు అక్కడికి వెళ్తారు కానీ అక్కడ చందు లేకపోవడంతో అందరూ టెన్షన్ పడుతుంటారు. రూమ్ లో ఒకటి లెటర్ కనిపిస్తుంది ఆ లెటర్ ని చూసి అక్కడ ఏమయిందని చూస్తారు కానీ చందు ఈ పెళ్లి ఇష్టం లేదు నా మనసులో వేరే అమ్మాయిని లెటర్లో రాసిపెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు విశ్వం క్రియేట్.. అది చూసిన వాళ్ళందరూ రామ్ రాజ్తో సహా అందరూ షాక్ అవుతారు.
చందుని కిడ్నాప్ చేశామని విషయం బయటపడకుండా చాలా తెలివిగా పథకం రచించాడు విశ్వ. ఈ పెళ్లి ఇష్టం లేదని.. శ్రీవల్లి మెడలో తాళి కట్టడం ఇష్టంలేకే వెళ్లిపోతున్నట్టుగా చందు రాసినట్టు ఓ లెటర్‌ని క్రియేట్ చేసి.. దాన్ని పెళ్లి కొడుకు గదిలో పెట్టిస్తాడు విశ్వ. ఇక ఆ లెటర్ చూసిన తరువాత.. ఎంత పని చేశావ్ రా పెద్దోడా అని భోరున ఏడుస్తాడు రామరాజు. ఇక పీటలపై పెళ్లి ఆగిపోవడంతో శ్రీవల్లి బాధ అయితే వర్ణణాతీతం. నన్ను వదిలి వెళ్లిపోయాడా? అంటూ భోరున ఏడుస్తుంది శ్రీవల్లి. ఇక రామరాజు అయితే.. ఆ పెళ్లి మండపంలోనే కుప్పకూలిపోతాడు..
పెళ్లికొచ్చిన పదిమంది పది రకాలుగా మాట్లాడుతారు దానితో రామ్ రాజు నా పరువు మొత్తం పోయింది నా ప్రాణం పోయేలా ఉంది అని బాధపడుతూ ఉంటారు. దీనికి మాత్రం అన్ని అలా చేశారంటే అస్సలు నమ్మలేదు నాన్న నీ పరువు కాపాడేది వాడే అని వారికి తెలుసు ఇక్కడ ఏదో జరిగింది ఏదో తప్పు జరిగింది అని అర్థమవుతుంది వెంటనే వాడు ఎక్కడున్నాడో తెలుసుకుని నేను తీసుకొస్తాను పెళ్లికి ముహూర్తానికి ఇంకొక గంట టైం ఉంది కదా ఖచ్చితంగా వాళ్ళని తీసుకొచ్చి పెళ్లి జరిగేలా చేస్తానని అంటాడు.
అటు భాగ్యం శ్రీవల్లి కూడా ఈ పెళ్లి ఎందుకు ఆగిపోయింది ఇష్టం లేకపోతే పెళ్లి పీటల వరకు ఎందుకు తీసుకురావాలి నా బిడ్డ మనసులో ప్రేమను ఎందుకు పుట్టించాలని గొడవ చేస్తుంది. చూసావా అమ్మ బావకు నిజంగా నేనే లాంటి ఇష్టం లేదమ్మా అందుకే పెళ్లి ఎవరికీ ఉంచి పెళ్లెప్పుడు బయటికి వెళ్లిపోయాడా నా జీవితం ఏం కావాలి బావ లేకుండా నేను ఎలా బతకాలని బాధపడుతూ ఉంటుంది. ఈరోజు మాత్రం అన్నయ్య ఎక్కడున్నాడో నేను కనిపెట్టి తీసుకొస్తాను అని వెళ్తాడు.
ప్రేమ, ధీరజ్ లు ఇద్దరు కూడా మా అన్నయ్య విశ్వం ఖచ్చితంగా కిడ్నాప్ చేసి ఉంటాడని భావిస్తారు. విశ్వంకి ఫోన్ చేసిన విశ్వం ఫోన్ లిఫ్ట్ చేయరు దానితో కచ్చితంగా వాడే కిడ్నాప్ చేస్తారని ఇద్దరు నమ్ముతారు. అని పట్టుకోవడం ఎలా గంటలోపులా అన్నయ్యని తీసుకురావడం ఎలా అని ధీరజ్ ప్రేమ ఆలోచిస్తూ ఉంటారు..శ్రీవల్లికి మేకప్ చేయడానికి వచ్చిన బ్యూటీషియన్‌పై అనుమానం రావడంతో ఆమె చెంప చెల్లుమనిపిస్తుంది ప్రేమ. దాంతో ఆమె నిజాన్ని కక్కేస్తుంది. ధీరజ్‌ని వెంటపెట్టుకుని చందు కిడ్నాప్ అయిన చోటుకి తీసుకుని వెళ్తుంది. అయితే ఆ బ్యుటీషియన్.. ప్రేమ, ధీరజ్‌లను బోల్తా కొట్టించి.. వాళ్లని ఓ గదిలో పెట్టేసి ఎస్కేప్ అవుతుంది. మరి అక్కడ నుంచి చందుని తప్పించారా? శ్రీవల్లితో అతని పెళ్లి జరిగిందా? లేదంటే పెళ్లి ఆగిపోయిందా? అన్నది రేపటి ఎపిసోడ్‌లో చూడాలి..