BigTV English

Dhoni – Abdo Feghani : ధోని క్రేజీ మామూలుగా లేదుగా.. రేసర్ కూడా ఆ జెర్సీ ధరించాడు !

Dhoni – Abdo Feghani : ధోని క్రేజీ మామూలుగా లేదుగా.. రేసర్ కూడా ఆ జెర్సీ ధరించాడు !

Dhoni – Abdo Feghani : టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గురించి ఏ విషయం చర్చించినా అది క్షణాల్లో వైరల్ అవుతుంటుంది. తాజాగా అతని గురించి ఓ విషయం ట్రెండింగ్ లో కొనసాగుతోంది. టీమిండియా తరపున ఆడిన సమయంలో ధోనీ జెర్సీ నెం.7 ధరించాడు. అయితే ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కూడా నెం.7 జెర్సీని ధరించి ఆడుతున్నాడు. ధోనీ నెంబర్ 7 జెర్సీని ధరించడం వెనుక చాలా లెక్కలు ఉన్నాయట. ఇక మరో విషయం ఏంటంటే.. రేసింగ్ లో గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన వ్యక్తి అబ్డో ఫెఘాని ధోనీ జెర్సీ నీ ధరించాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది వైరల్ అవుతోంది.


రెడ్ బ్లూ మోటోజామ్ లో జరిగిన కార్యక్రమంలో ధోనీ జెర్సీ ధరించాడు అబ్డో ఫెఘాని. భారత్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి నె0.7 జెర్సీతోనే ఇంటర్నేషనల్ మ్యాచ్ లు ఆడిన ధోనీ.. రిటైర్మెంట్ వరకు ఆ నెంబర్ ని కొనసాగించాడు. అలాగే ఐపీఎల్ లో ఇప్పటికీ నెం.7 జెర్సీతోనే అతను బరిలోకి దిగుతున్నాడు. నెంబర్ 7 నా లక్కీ నెంబర్ అని చాలా మంది అనుకున్నారు.  నెంబర్ 7ని నాజెర్సీ నెంబర్ గా ఎంచుకోవడానికి కారణం చాలా సింపుల్. జులై నెల 7న తేదీ పుట్టాను. ఏడో నెల ఏడో తేదీ నా పుట్టిన రోజు ఆ నెంబర్ ని ఎంచుకున్నాను. ఏ నెంబర్ మంచిది.. ఏ నెంబర్ కలిసొస్తుంది అని తర్జనభర్జన పడేదాని కంటే నా పుట్టి రోజు తేదీని జెర్సీ నెంబర్ గా ఎంచుకోవాలని నిర్ణయించుకున్నట్టు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు ధోనీ.

ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ధోని కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా ఈ సీజన్ కి దూరమైన విషయం తెలిసిందే. లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై ఘన విజయం సాధించింది. ఈ సీజన్ ను తొలి మ్యాచ్ లో ఘన విజయంతో ప్రారంభించి అభిమానుల్లో అంచనాలు పెంచింది. ఆ తరువాత 20 రోజుల తరువాత ఒక్కటంటే ఒక్కటి కూడా గెలవలేదు. ఒక దశలో చెన్నై పరిస్థితి ఓటముల్లో డబుల్ హ్యాట్రిక్ కొడుతుందేమో అనిపించింది. కానీ సరైన సమయంలో ధోనీ మెరుపులు మెరిపించడంతో పాటు శివమ్ దూబె కూడా సమయోచితంగా షాట్లు ఆడి చెన్నై ని విజయానికి చేరువ చేశాడు.


చేజింగ్ లో చెన్నైకి శుభారంగం దక్కింది. కొత్త ఓపెనర్ ఆంధ్ర కుర్రాడు షేక్ రషీద్ బౌండరీల మోత మోగిస్తూ చెన్నై ఛేదనను ధాటిగా ప్రారంభించాడు. మరో ఓపెనర్ రచిన్ రవీంద్ర సైతం నిలకడగా ఆడటంతో చెన్నై 4 ఓవర్లకే 45 పరుగులు చేసింది. కానీ మంచి ఊపుమీదున్న రషీద్ ను అవేష్  ఔట్ చేశాడు. పార్ట్ టైమ్ స్పిన్నర్ మార్ క్రమ్ రచిన్ ని ఔట్ చేసి చెన్నై ని కష్టాల్లోకి నెట్టాడు. స్పిన్నర్లు రవి బిష్ణోయ్, దిగ్వేశ్ రాఠి స్పిన్ మాయాజాలంతో త్రిపాఠి, జడేజా, విజయ్ శంకర్ లను పెవిలీయన్ కి పంపారు. 111/5 చెన్నై ఇబ్బందుల్లో పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ధోనీ చెలరేగాడు. దీంతో చెన్నై విజయం సునాయసం అయింది.

?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">

 

View this post on Instagram

 

?utm_source=ig_embed&utm_campaign=loading" target="_blank" rel="noopener">A post shared by RVCJ Sports (@rvcjsports)

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×