BigTV English
Advertisement

Gorantla Madhav In Jail: జైలులో గోరంట్లకు రాజభోగాలు.. తలలు పట్టుకుంటున్న అధికారులు

Gorantla Madhav In Jail: జైలులో గోరంట్లకు రాజభోగాలు.. తలలు పట్టుకుంటున్న అధికారులు

Gorantla Madhav In Jail: నిత్యం వార్తల్లో ఉండాలనుకునే వారిలో మాజీ పోలీసు అధికారి, వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఒకరు. ఆయన అధికారి ఉన్నప్పుడు ఎలాగ ఉండేవారో తెలీదు. ఎంపీగా ఉన్నప్పుడు మాత్రం ఆయన లీలలు అన్నీ ఇన్నీకావు. పదవి లేకపోయినా ఏ మాత్రం తగ్గేది లేదంటున్నారు. చేబ్రోలు కిరణ్‌పై దాడి కేసులో అడ్డంగా బుక్కయ్యారు. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఆయన ఉంటున్నారు. అక్కడ కూడా అధికారులకు చుక్కలు చూపిస్తున్నారని తెలుస్తోంది.


వైసీపీలో ఫైర్ బ్రాండ్‌ అవతారమెత్తారు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్.  ఆయన గురించి రాజకీయ నేతలు రకరకాలుగా చెప్పుకుంటారు. అయితే  వైఎస్ భారతిపై వల్గర్ కామెంట్స్ చేసిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్‌ను గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన్ని విచారణ కోసం తీసుకుని వెళ్తుండగా పోలీసు వాహనం ఆపి మరీ దాడి చేశారు మాజీ ఎంపీ. ఈ దాడిని వైసీపీ నేతలు సమర్థించిన విషయం తెల్సిందే.

ఈ వ్యవహారంలో అడ్డంగా ఇరుక్కున్నారు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్. న్యాయస్థానం ఆదేశాల మేరకు 14 రోజులు రిమాండ్ తరలించారు. మాధవ్‌ను రాజమండ్రి సెంట్రల్ జైలుకి అధికారులు తరలించారు. జైలులో ఆయనకు 3130 నెంబరు కేటాయించారు అధికారులు. బయటే కాదు.. జైలులో కూడా డ్రామాలు మొదలుపెట్టారట మాజీ ఎంపీ.


రెండు చేతులు వెనక్కి పెట్టి బ్యారక్ బయట ఉంటానని, గదిలోకి వెళ్లనని మొండి కేస్తున్నారట. సింపుల్‌గా చెప్పాలంటే జైలు అధికారులను బెదిరిస్తున్నారట గోరంట్ల మాధవ్. ఒకప్పుడు మీరు పోలీసు అధికారి కావచ్చు.. మాజీ ఎంపీ కావచ్చని, జైలుకి ఎవరు వచ్చినా ఒక పద్దతి ఉంటుందని, దాని నడుచుకోవాల్సిందేనని వివరించారట. ఏ మాత్రం ఆయన వినలేదట.

ALSO READ: లిక్కర్ స్కామ్‌ నిధులు, మూడింటిలో పెట్టుబడి, బినామీలకు టెన్షన్

జైలులో బ్యారక్ బయట రెండు చేతులు వెనక్కి పెట్టి సోలో వాకింగ్ చేస్తున్నారట. ఎవరితో మాట్లాడకుండా బ్యారక్ అంతా తిరుగుతున్నారని సమాచారం. ఆ భోజనం చూసి ఇలాంటిది మీరు తింటారా? అంటూ అధికారులపై ప్రశ్నల మీద ప్రశ్నలు రైజ్ చేసినట్లు తెలుస్తోంది. బహుశా పార్లమెంట్ క్యాంటెన్‌లో ఉన్నట్లుగా జైలులో ఉండాలని ఆయన కోరుకుంటారేమో తెలీదు.

జైలు సిబ్బంది షిప్టులు మారేటప్పుడు వారితో వాగ్వాదానికి దిగడంతో వాళ్లేమీ చెయ్యలేకపోతున్నారట. ఆయనను హ్యాండిల్ చేయడం అధికారులకు కత్తిమీద సాముగా మారిందని కొందరు సిబ్బంది మాట. రానున్న రెండు వారాలు అక్కడి సిబ్బందికి గోరంట్ల కష్టాలు తప్పవన్నమాట.

Related News

CM Chandra Babu: ఇదే లాస్ట్ వార్నింగ్.. ఎమ్మెల్యేలపై సీఎం సీరియస్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పర్యటనలో అపశృతి.. మహిళకు గాయాలు

Vidadala Rajini: రజిని కొత్త రచ్చ.. పోలీసులపై ఫైర్

Janasena X Account: జనసేన అధికారిక ‘ఎక్స్’ ఖాతా హ్యాక్.. వరుసగా అనుమానాస్పద పోస్టులు

Pawan Kalyan: కుంకీ ఏనుగుల కేంద్రాన్ని ప్రారంభించిన.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Nara Lokesh: బీహార్ ఎన్నికల్లో బీజేపీ తరపున మంత్రి నారా లోకేష్ ప్రచారం..

Kotamreddy Sridhar Reddy: మాకేమైనా బిచ్చమేస్తున్నారా? అధికారులపై టీడీపీ ఎమ్మెల్యే ఆగ్రహం

Ambati Logic: చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలసి ఉంటేనే మాకు లాభం.. అంబటి వింత లాజిక్

Big Stories

×