Illu Illalu Pillalu Today Episode April 18th : నిన్నటి ఎపిసోడ్ లో.. చందుని కిడ్నాప్ చేశామని విషయం బయటపడకుండా చాలా తెలివిగా పథకం రచించాడు విశ్వ. ఈ పెళ్లి ఇష్టం లేదని.. శ్రీవల్లి మెడలో తాళి కట్టడం ఇష్టంలేకే వెళ్లిపోతున్నట్టుగా చందు రాసినట్టు ఓ లెటర్‌ని క్రియేట్ చేసి.. దాన్ని పెళ్లి కొడుకు గదిలో పెట్టిస్తాడు. ఇక ఆ లెటర్ చూసిన తరువాత.. ఎంత పని చేశావ్ రా పెద్దోడా అని భోరున ఏడుస్తాడు రామరాజు. ఇక పీటలపై పెళ్లి ఆగిపోవడంతో శ్రీవల్లి బాధ అయితే వర్ణణాతీతం. నన్ను వదిలి వెళ్లిపోయాడా? అంటూ భోరున ఏడుస్తుంది శ్రీవల్లి. ఇక రామరాజు అయితే.. ఆ పెళ్లి మండపంలోనే కుప్పకూలిపోతాడు.. విశ్వం కు ధీరజ్ ఫోన్ చేస్తాడు కానీ లిఫ్ట్ చేయడు మీ భద్రతను కిడ్నాప్ చేశాను కావాలంటే కన్ఫామ్ చేసుకో అని మెసేజ్ చేస్తాడు. కానీ విశ్వం ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఆ తర్వాత విశ్వం వాళ్ళ నాన్నకి కాల్ చేస్తాడు అత్త ఉంటే ఇవ్వు ఒకసారి మాట్లాడాలని అంటాడు. అత్తలేదు ఇంట్లో చాలా సేపట్నుంచి కనిపించలేదని మీ అమ్మ నాన్నమ్మ చెప్పారు అనేసి చైనా అంటాడు. నిజంగానే టెన్షన్ పడిపోయిన విశ్వం ధీరజ్ కిడ్నాప్ చేశాడని ఆలోచిస్తూ ధీరజ్ కి ఫోన్ చేస్తాడు. మొత్తానికి ధీరజ్ చందును తిరిగి తీసుకొని వస్తారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. పెళ్లి జరిగేట్టు లేదని.. పెళ్లికి వచ్చిన వాళ్లంతా వెళ్లిపోతుంటారు. ఇంతలో చందుని తీసుకుని ఎంట్రీ ఇస్తాడు ధీరజ్, ప్రేమలు. వాళ్ల రాకతో రామరాజు పొలంలో మొలకలు వచ్చేస్తాయి. అతనికైతే ప్రాణం లేచివచ్చినట్టు అవుతుంది. పోనీ వస్తే వచ్చాడని అనుకోకుండా.. ఈ నాన్నా ఆశలపై నీళ్లు చల్లావ్ కదరా.. ఈ నాన్నని నువ్వు కూడా మోసం చేశావా? అని అంటాడు రామరాజు. నాన్న నేను కొడుకుని నాన్న నేను నీ పరువు తీసేలా ఏ రోజు చేయను నా వెనకాల పెద్ద కుట్ర జరిగింది. ఇదంతా ఆ విశ్వకాడే చేశాడు. నేను మానసికంగా చంపేయాలని అనుకున్నాడు కుమిలిపోయేలా చేయాలని నీ పరువు తీయాలని అనుకున్నాడు అని చందు నిజం చెప్తాడు.
నావల్ల నీ పరువు పోయేది కానీ తమ్ముడు నీ పరువుని నిలబెట్టడు నాన్న తమ్ముడు లేకుండా నేను కచ్చితంగా చచ్చిపోయే వాడిని చందు టిఆర్ఎస్ గురించి గొప్పగా చెప్తాడు. ఇక పంతులు పెళ్లి ముహూర్తానికి సమయమైంది అనగానే చందు పెళ్లి పెట్టరు మీద కూర్చుని రామరాజు చెప్తాడు. ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది.
ఇక పోతే విశ్వక్ గాడు వచ్చాడంటే.. పెళ్లి కానివ్వడమ్మా.. ఏదో కుట్ర చేస్తాడని ధీరజ్ నెత్తి నోరు బాదుకున్నా కూడా.. వాడు నా మేనల్లుడ్రా.. పెళ్లికి వచ్చిన వాడ్ని అవమానించడం కరెక్ట్ కాదు అంటూ నీతి సూక్తులు చెప్పి.. విశ్వక్‌కి మర్యాదలు చేసింది. వాడేమో చందుని ఎత్తుకునిపోయాడు. దరిద్రం పోయింది. ఇప్పుడే వాడే చందుని కిడ్నాప్ చేశాడని తెలియడంతో నోరెళ్లబెట్టింది వేదవతి. అసలు రామరాజుపై భద్రావతి పగపట్టడానికి.. ధీరజ్‌ని రామరాజు అసహ్యించుకోవడానికి.. ధీరజ్ ప్రేమ మెడలో తాళి కట్టడానికి.. రామరాజు ఫ్యామిలీ వీధిన పడటానికి.. ఇలా కాదేదీ సమస్యకి అనర్హం అన్నట్టుగా అన్ని సమస్యలకు మూలకారణం మాత్రం వేదవతే అవుతుంది.
ఇక మొత్తానికి అనుకున్నట్లుగానే చందు పెళ్లిని ధీరజ్ దగ్గరుండి చేస్తారు. అయితే ప్రేమ ధీరజ్ఇద్దరు ఒకరికి ఒకరు థాంక్స్ చెప్పుకుంటారు నీవల్లే జరిగిందంటూ నీ వల్ల జరిగిందని ఇద్దరు సంతోషంగా ఉంటారు. సంతోషం లేదు ఉషారు లేరు అనేసి ప్రేమ అంటారు. ఇద్దరు కలిసి డాన్స్ ప్లాన్ చేస్తారు ప్రేమ, ధీరజ్ లు.. అందరు వీరిద్దరి డ్యాన్స్ చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒక భాగ్యం మాత్రం తన కూతురికి ఇంటిని మొత్తం నీ కంట్రోల్లో పెట్టుకోవాలని క్లాసు పీకుతుంది.. ఇంకా చందు చేతిలో శ్రీవల్లిని పెట్టి అప్పగిస్తారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…