One Rupee Murder| మార్కెట్లో తరుచూ చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి. కానీ అలాంటి ఒక గొడవ అనూహ్యంగా ఒక హత్యకు కారణమైంది. ఒక షాపు ఓనర్ కోపంతో తన వద్దకు వచ్చే కస్టమర్ ని హత్య చేశాడు. ఆ కస్టమర్ వ్యవహరించిన తీరుతో సహనం నశించి ఆ షాపు ఓనర్ కొట్టిన దెబ్బలకు ఆ కస్టమర్ చనిపోయాడు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర రాష్ట్రంలోని నాశిక్ నగరంలో సిడ్కో ప్రాంతంలో ఒక పాన్ షాపు నడుపు కుంటూ బాపు సోనావానె అనే వ్యక్తి జీవనం సాగిస్తున్నాడు. అతని షాపు తరుచూ భాలే రావు అనే వ్యక్తి కస్టమర్ గా వచ్చి సిగరెట్, పాన్ లాంటివి కొనుగోలు చేస్తూ ఉంటాడు. దీంతో వారిద్దరికీ పరిచయం ఉంది. భాలే రావు ఆ ప్రాంతంలోని ఒక దుకాణంలో గుమస్తాగా పని చేస్తున్నాడు. భాలే రావు కొంచెం కోపిష్టి ఆ ప్రాంతంలో అందరితో గొడవలు పడుతూ ఉంటారు.
ఈ క్రమంలో రోజూ లాగే భాలేరావు తన స్నేహితులతో కలిసి సిగరెట్ తాగేందుకు వెళ్లాడు. ఫ్రెండ్స్ తో కాసేపు మాట్లాడుతూ బాపు సోనావానె కు చెందిన పాన్ షాపుకి వెళ్లి ఒక సిగరెట్ తీసుకున్నాడు. సిగరెట్ తాగుతూ భాలె రావు తన జేబులో నుంచి రూ.10 తీసి బాపు సోనావానెకు ఇచ్చాడు. అయితే సిగరెట్ ధర రూ.11 అని బాపు సోనావానె అన్నాడు. దానికి భాలె రావు నవ్వుతూ.. అందరూ రూ.10 తీసుకుంటే నీవు ఒక్క రూపాయి ఎక్కువ ఎందుకు తీసుకుంటున్నావ్? అని ప్రశ్నించాడు. దానికి బాపు సోనావానె ధర పెరిగిందని ఇకపై అంతేనని అన్నాడు. కానీ భాలే రావు మాత్రం తాను రూ.10 ఇస్తానని ఎక్కువ ధర అడిగితే షాపు అక్కడి నుంచి తొలగించాల్సి వస్తుందని బెదిరించాడు.
ఈ బెదిరింపులకు బాపు సోనావానె కూడా ధీటుగా సమాధానం చెప్పాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో భాలెరావు పాన్ షాపుని ధ్వంసం చేసుందుకు ప్రయత్నించాడు. షాపులోని కొంత సరుకు రోడ్డుపై పడేశాడు. ఇక సహనం నశించిన బాపు సోనావానె పక్కను ఉన్న కర్రతో భాలెరావుని చితకబాదాడు. ఈ క్రమంలో అతని తలపైన బలంగా గాయమైంది. ఆ దెబ్బకు తట్టుకోలేక భాలేరావు అక్కడి నుంచి పారిపోయాడు. ఆ తరువాత తాను గుమస్తా పనిచేసే దుకాణంలో ఉండగా.. అతనికి తీవ్ర స్రావం అయింది. దీంతో అతడు స్పృహ కోల్పోగా.. అతని స్నేహితులు అతడిని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
Also Read: ఐపిఎల్ చూస్తూ ప్రమాదవశాత్తు తుపాకీ పేల్చిన బాలుడు.. పొరుగింటి వ్యక్తి మృతి
చికిత్స పొందుతూ మృతి
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భాలే రావు మృతి చెందాడు. భాలే రావు మరణం గురించి పోలీసులకు ఆస్పత్రి నుంచి సమాచారం అందింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. భాలే రావు మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం తరలించి.. దర్యాప్తు చేపట్టారు. సిడ్కో ప్రాంతంలో భాలేరావు పనిచేసే పరిసరాల్లో పోలీసులు విచారణ చేయగా.. ఆ రోజు పాన్ షాపు ఓనర్ తో అతనికి గొడవ జరిగిందని.. ఆ గొడవలోనే ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నట్లు పోలీసులకు తెలిసింది. దీంతో పోలీసులు పాన్ షాపు ఓనర్ బాపు సోనావానె ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ కేసులో ఇంకా విచారణ కొనసాగుతోంది.