BigTV English

Ganta Srinivasa Rao: గంటా ట్వీట్‌పై చంద్రబాబు సీరియస్‌!

Ganta Srinivasa Rao: గంటా ట్వీట్‌పై చంద్రబాబు సీరియస్‌!

Ganta Srinivasa Rao: ఎప్పుడో ఓసారి పొలిటికల్ స్క్రీన్ మీదకు వస్తారు. వచ్చిన ప్రతిసారీ.. తన స్టైల్లో గంట గట్టిగా మోగించి వెళ్లిపోతారు. ఇప్పుడు కూడా అదే చేశారు. తెలుగుదేశంలో పార్టీలో సీనియర్ నేతగా, నిత్య అసంతృప్తివాదిగా పేరొందిన నాయకుడు గంటా శ్రీనివాసరావు. ఇప్పుడాయన మారిపోయారనే టాక్ వినిపిస్తోంది. ఆయన వ్యవహారశైలి కూడా వివాదాస్పదమవుతోంది., సొంత పార్టీ నేతల్ని, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయ్. ఉన్నట్టుండి ఆయన ఇలా ఎందుకు చేస్తున్నారనే చర్చ పార్టీలో జోరుగా నడుస్తోంది. మరి.. గంటా లెక్కేంటి?


టీడీపీలో హాట్ టాపిక్‌గా గంటా శ్రీనివాసరావు వ్యవహారం

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యవహారశైలి.. తెలుగుదేశంలో హాట్ టాపిక్‌గా మారింది. గత ఎన్నికల్లో భీమిలి నుంచి గెలిచిన ఆయన.. కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే.. మంత్రి పదవి ఆశించారు. కానీ.. వివిధ సమీకరణాలతో ఆయనకు ఛాన్స్ దక్కలేదు. దాంతో.. తన పని తాను చేసుకుంటున్నారు. పర్లేదు.. అంతా బాగానే నడుస్తోందనుకుంటున్న టైమ్‌లో.. గంటా వ్యవహారశైలిలో మార్పు వచ్చిందనే చర్చ జరుగుతోంది. ఇటీవల ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వ్యవహరిస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయ్.


పారిశుద్ధ్య నిర్వహణపై ఓ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌పై ఆగ్రహం

ఈ మధ్యకాలంలోనే తన నియోజకవర్గంలో ఓ ఉద్యోగిపై చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయ్. పారిశుద్ధ్య నిర్వహణపై ఓ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసే క్రమంలో.. రాస్కెల్ అంటూ మాట్లాడిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయ్. ఇవేవీ చల్లారకముందే విశాఖ నుంచి అమరావతికి విమాన సర్వీసులు లేకపోవడంపై చేసిన ట్వీట్.. రాజకీయంగా చర్చనీయాంశమైంది. విశాఖ విమాన సర్వీసుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ.. గంటా శ్రీనివాసరావు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టారు. అది కాస్తా.. స్టేట్ మొత్తం హాట్ టాపిక్‌గా మారింది.

సీప్లేన్‌ల ఏర్పాటు, అంతర్జాతీయ విమాన సర్వీసులు

తెలుగుదేశం పార్టీకి చెందిన కింజరాపు రాంమోహన్ నాయుడు పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంలో ఆయన కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు.. రాష్ట్రవ్యాప్తంగా సీప్లేన్‌ల ఏర్పాటు, అంతర్జాతీయ విమాన సర్వీసులు, ఇతర వసతులు ఏర్పాటు చేయడంలో.. కేంద్రమంత్రి రాంమోహన్ నాయుడు కృషి చేస్తున్నారు. ఏపీ వ్యాప్తంగా విమాన సర్వీసులు పెంచే విధంగా.. ఆయన పనిచేస్తున్నారనే చర్చ ఉంది.

అమరావతికి నేరుగా విమాన సర్వీసులు లేకపోవడంపై అసంతృప్తి

సరిగ్గా.. ఇదే సమయంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు.. విశాఖ నుంచి నేరుగా అమరావతికి విమాన సర్వీసులు లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వివాదాస్పదంగా మారింది. వైజాగ్ నుంచి విజయవాడకు వెళ్లాలంటే.. విశాఖలో ఫ్లైట్ ఎక్కి.. తెలంగాణలోని శంషాబాద్‌లో దిగి.. అక్కడి నుంచి మరో ఫ్లైట్ టికెట్ కొనుక్కొని అమరావతికి రావాల్సి వస్తోందని అందులో రాసుకొచ్చారు. తనతో పాటు వచ్చిన సీఐఐ, ఫిక్కీ సంస్థలకు చెందిన వ్యాపారవేత్తలు, ప్రముఖులకు కూడా ఇదే చేదు అనుభవం ఎదురైందన్నారు.

విశాఖలో విమాన ప్రయాణికులకు ఎందుకు దుస్థితి?

మంగళవారం వందే భారత్ రైలు కూడా లేకపోవడంతో.. తాను రెండు విమానాలు మారాల్సి వచ్చిందని తన అసహనాన్ని అంతా వెళ్లగక్కారు. విశాఖలో విమాన ప్రయాణికులకు ఎందుకీ దుస్థితి అంటూ తన ట్వీట్‌లో.. సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి రాంమోహన్ నాయుడు, మంత్రి నారా లోకేశ్‌కు ట్యాగ్ చేశారు. దీనికి.. తెలుగుదేశం హైకమాండ్ హర్ట్ అయిందట. దాంతో.. గంటా వ్యవహారంపై అధిష్టానం స్పందించాల్సి వచ్చిందనే టాక్ పార్టీలో వినిపిస్తోంది.

సమస్యపై స్పందించే తీరు ఇది కాదనేలా మందలింపు!

కూటమి ప్రభుత్వం విశాఖను ఆర్థిక రాజధానిగా పరిగణిస్తోంది. ఈ క్రమంలో విశాఖ నుంచి ఏపీ రాజధాని అమరావతికి నేరుగా విమాన సర్వీసులు లేకపోవడం ఏమిటని.. గంటా ట్వీట్ చేయడం పెద్ద చర్చకే దారితీసింది. పార్టీలో సీనియర్ నాయకుడు.. సమస్యపై స్పందించే తీరు ఇది కాదనే విధంగా అధిష్టానం మందలించే ప్రయత్నం చేసిందనే గుసగుసలు తెలుగుదేశం పార్టీలో వినిపిస్తున్నాయ్. ఇబ్బందులేమైనా ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలే తప్ప.. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడమేంటని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి.. టీడీపీకి చెందిన వారేననే విషయం గుర్తుంచుకోవాలని చెప్పారట. భవిష్యత్‌లో ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకోవాలని అధిష్టానం గంటాకు సూచించిందని.. తెలుగుదేశం నేతలు చర్చించుకుంటున్నారు.

Also Read: బండి, రాజాసింగ్‌ భేటీ వెనుక వ్యూహం అదేనా?

వైసీపీ హయంలో పార్టీ వీడతారేమోనని ఐదేళ్లు సస్పెన్స్

గతంలో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు.. అవంతి శ్రీనివాస్‌తో విభేదాలు. ఆ తర్వాత ఎన్నికల్లో గెలిచాక.. ఎప్పుడు పార్టీ వీడతారోనని ఐదేళ్లు సస్పెన్స్ కొనసాగిన పరిస్థితి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంత్రి అవుతారనుకున్నా.. ఆ అవకాశం దక్కలేదు. దాంతో.. ఏదో రకంగా, ఏదో ఒక ఇష్యూపై.. గంటా శ్రీనివాసరావు అసంతృప్తి వెళ్లగక్కడంపై.. పార్టీ పెద్దలు అసహనం వ్యక్తం చేస్తున్నారట. ఇప్పుడు అధిష్టానం హెచ్చరికతోనైనా.. గంటా తీరు మారుతుందా? లేక.. ఇలాగే కొనసాగుతుందా? అన్నది ఆసక్తి రేపుతోంది.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×