Illu Illalu Pillalu Today Episode April 1st: నిన్నటి ఎపిసోడ్ లో.. రామ రాజు ఇంట పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. కోడళ్ళతో కలిసి వేదవతి పెళ్లి పనులను మొదలు పెడుతుంది. అటు భాగ్యం కూడా కూతురితో అమ్మవారికి పూజలు చేయిస్తుంది. పెళ్లిని ఎంత త్వరగా అయితే అంత త్వరగా పూర్తి చేయాలని భాగ్యం పట్టు బట్టి కూర్చుంటుంది. నిశ్చితార్థం అయిన తర్వాత శ్రీవల్లి చందుల మధ్య ప్రేమ పుడుతుంది. శ్రీవల్లి మెల్లగా చందు ని ట్రాప్ చేస్తుంది. చందు తన బుట్టలో వేసుకొని తన పుట్టింటి కష్టాలను పోగొట్టాలని శ్రీవల్లి ఆలోచిస్తూ ఉంటుంది. అటు చందు ఎంగేజ్మెంట్ ని తలుచుకొని మురిసిపోతూ ఉంటాడు. మరోవైపు తన తమ్ముణ్ణి, తన కన్న తండ్రి పెళ్లికి రావద్దు అని చెప్పడంతో బాధపడుతూ ఉంటాడు. చందు వల్ల ధీరజ్ ను పెళ్లికి రావడానికి ఒప్పుకుంటాడు. ధీరజ్ ప్రేమ ఇద్దరూ కలిసి తన అన్నయ్య పెళ్లిని చేయాలని అనుకుంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికోస్తే.. ధీరజ్ ప్రేమ దగ్గరికి వచ్చి నువ్వు నాకు సాయం చేయాలి నేను ఏ తప్పులు చేయకుండా నన్ను కట్టడి చేయాలి అంటూ రిక్వెస్ట్ చేస్తాడు. ధీరజ్ సంతోషంలో ప్రేమని హగ్ చేసుకుంటాడు. తన భర్త సంతోషం కోసం ప్రేమ ఏదైనా చేస్తుందని అర్థమవుతుంది. మొత్తానికి ధీరజ్ ప్రేమల మధ్య ప్రేమ పుడుతుంది. అందరు సంతోషంగా సందడి చేస్తూ పసుపు దంచే కార్యక్రమాన్ని మొదలుపెడతారు. అలాగే అటు భాగ్యముల ఫ్యామిలీ కూడా పెళ్లికూతురు చేత అమ్మవారికి పొంగళ్ళు పెడతారు. పెళ్లి పనులు అయితే మొదలు పెట్టేసాం పెళ్లి ఎలా చేయాలి అని భాగ్యమలు ఆలోచిస్తారు అయితే.. మన అల్లుడు గారే ఈ పెళ్లిని దగ్గరుండి చేసేలా చేయాలని భాగ్యం అంటుంది. ఇంట్లో చందు పెళ్లి పనులను మొదలు పెడతారు..
అయితే రామరాజు తన కొడుకు పెళ్లి ఫిక్స్ అయిందని సంతోషంతో అందరితో చెప్తాడు. గతంలో తన కొడుకుకి ఇంక పెళ్లి కాదన్న వారి దగ్గరికి వెళ్లి మరి తన కొడుకు పెళ్లి కుదిరిందని శుభలేఖలు తీసుకొని ఇంటికొస్తానని చెప్పి సంతోషంగా ఇంటికి వస్తాడు. బయట ఉల్లిగడ్డలు అమ్మే వ్యక్తి మైకులో అరుస్తూ ఉంటాడు ఆ మైకను తీసుకొని భద్ర వాళ్ళని రెచ్చగొట్టేలా నా పెద్ద కొడుకు పెళ్లి ఫిక్స్ అయింది అందరూ తప్పకుండా రావాలని అనౌన్స్ చేస్తాడు. అది విన్న భద్ర కుటుంబం కోపంతో రగిలిపోతుంది. పాతికేళ్ల తర్వాత మన ఇల్లు ఇలా అవ్వడానికి కారణం ప్రేమనే ప్రేమని ఎలాగైనా అంటే నుంచి దూరం చేయాలని భద్రను విశ్వం ఆలోచిస్తూ ఉంటాడు.
శారదంబ మాత్రం తన మనవరాలు సంతోషంగా ఉండాలని అనుకుంటుంది. ప్రేమ వాళ్ళు మావిడాకులు కడుతూ ఉంటే వీళ్ళ సంతోషం చూసి నాకు కన్నీళ్లు వస్తున్నాయి. ఇవి రెండు కుటుంబాల్ని వీళ్ళే కలపాలి అని అంటుంది. ఇక ప్రేమ ధీరజిద్దరూ ఒకరినొకరు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఒకరి మీద ఒకరు పడతారు ఆ తర్వాత రామరాజు పెళ్లి పత్రికలు తీసుకొని ఇంటికి వస్తాడు. నర్మదా పెళ్లి పత్రికను చదివి వినిపిస్తుంది.
భాగ్యం శ్రీవల్లి పెళ్లిని ఎలా చేస్తుందని ఆనంద్ రావు ఆలోచిస్తూ ఉంటాడు. భాగ్యం మాత్రం అల్లుడు గారిని ఎలాగైనా రమ్మని చెప్పాలి అని అనుకుంటుంది. శ్రీవల్లికి ఫోన్ చేసి చంద్రుని రమ్మని చెప్తుంది. అనుకున్నట్లుగానే శ్రీవల్లి చందు కి ఫోన్ చేసి మాట్లాడాలి అర్జెంటుగా మా ఇంటికి రండి అని పిలుస్తుంది. ఇంట్లో వాళ్ళందరూ పెళ్లి పత్రికను చూసుకుంటూ సంతోషంగా ఉంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. నర్మదా తన పెళ్లి అలా జరగలేదని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. పెళ్లి పత్రిక పై తన పేరు సాగర్ పేరు తల్లిదండ్రుల పేరు రాసి కన్నీళ్లు పెట్టుకుంటుంది. ప్రేమ అక్కడికి వచ్చి ఏమైంది అక్క ఎందుకు ఏడుస్తున్నావ్ అంటే మనకోసం తల్లిదండ్రులు ఏమైనా చేస్తారు కానీ మనం ఒక వ్యక్తిని ప్రేమించామంటే ఆ పనికి మాత్రం అస్సలు ఒప్పుకోరు నీకు నాకు అదృష్టం లేదు కదా ప్రేమా అని బాధపడుతూ ఉంటుంది. అది విన్న బుజ్జమ్మ బాధపడుతుంది . ప్రేమ తన పుట్టింటి వాళ్ళని తలుచుకొని కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇక రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..