E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: నిజం కక్కేసిన లారీ డ్రైవర్.. అడ్డంగా ఇరుక్కున్న శ్రీవల్లి.. తల్లి కాబోతున్న శ్రీవల్లి..

Illu Illalu Pillalu Today Episode: నిజం కక్కేసిన లారీ డ్రైవర్.. అడ్డంగా ఇరుక్కున్న శ్రీవల్లి.. తల్లి కాబోతున్న శ్రీవల్లి..
Advertisement

Illu Illalu Pillalu Today Episode April 23rd: ప్రేమకు యాక్సిడెంట్ చేసిన లారీ డ్రైవర్ టీ తాగడానికి అని ఆ కొట్టుకు వస్తాడు. అతని చూసిన నర్మదా ధీరజ్ లారీ డ్రైవర్ వచ్చేసాడు అని అంటుంది. ఇద్దరూ కలిసి ఆ లారీ డ్రైవర్ ని పట్టుకునే ప్రయత్నం చేస్తారు. కానీ వాడు పారిపోతాడు. రోజు ఎలాగైనా సరే వాడి చేత నిజం కక్కించాలి అని ధీరజ్ నర్మద ఇద్దరు కూడా వాడిని వెంబడిస్తారు. చివరికి ధీరజ్ నర్మదాలు ఇద్దరూ చిరువైపు వెళ్లి ఆ డ్రైవర్ని పట్టుకుంటారు. మా అన్నయ్యని యాక్షన్ చేయమని ఎవరు చెప్పారు చెప్పు లేదంటే నేను చంపేస్తాను అని ధీరజ్ వాడిని దారుణంగా కొడతాడు. మొత్తానికి అతను నిజం చెప్పేస్తాను అని అంటాడు..

అడ్డంగా ఇరుక్కున్న శ్రీవల్లి..

డ్రైవర్ని ఎంత కొట్టినా సరే నిజం చెప్పడు. నువ్వు నిజం చెప్పకపోతే కచ్చితంగా నా చేతిలో చస్తావు అని కొడతాడు ధీరజ్. ఇక డ్రైవరు ఆ దెబ్బలు తినలేక ఆకలి నిజం చెప్తానని అంటాడు. యాక్సిడెంట్ చేయడానికి భాగ్యం డబ్బులు ఇచ్చింది అని చెప్పగానే ఒక్కసారిగా ధీరజ్ షాక్ అయిపోతాడు. భాగ్యమత్త ఇలా చేసిందని నేను అస్సలు ఊహించలేదు. వాళ్ళు ఎందుకు ఆక్సిడెంట్ చేస్తారు అని నర్మదా కూడా డ్రైవర్ని అడుగుతుంది.. వాళ్ళే చేయించారు డమ్మి ఆక్సిడెంట్ చేయమని నాకు డబ్బులు ఇచ్చారు అని అతను నిజం చెప్తాడు.. ఇదే విషయాన్ని వాళ్ళ దగ్గర చెప్పు పదా అని ధీరజ్ తీసుకొని వస్తూ ఉంటే అక్కడ నుంచి అతను పారిపోతాడు..

భాగ్యం పై శ్రీవల్లి సీరియస్..

Advertisement

ఆ డ్రైవర్ దొరికిపోతే నా పరిస్థితి ఏంటి అని శ్రీవల్లి ఆలోచిస్తూ ఉంటుంది. నిజంగానే ఆ డ్రైవర్ గనక దొరికితే మన పరిస్థితి ఇక తలకిందులు అయినట్లే అని శ్రీవల్లి టెన్షన్ పడిపోతూ ఉంటుంది.. ఒకవేళ దొరికితే నిజంగానే మనమే ఆక్సిడెంట్ చేయించమని తెలిస్తే మా ఆయన నాకు శాశ్వతంగా దూరమైపోతాడు అని కన్నీళ్లు పెట్టుకుంటుంది.. ప్రేమ నర్మద లేని నిన్ను ఇరికించారు అని చెప్పగానే వాళ్ల గురించి మాట్లాడితే మర్యాదగా ఉండదు అని శ్రీవల్లి టెన్షన్ పడిపోతూ ఉంటుంది.. ఏమన్నా జరగాలి నీకు చెప్తాను అని శ్రీవల్లి భాగ్యంకి వార్నింగ్ ఇస్తుంది..

శ్రీవల్లికి దిమ్మతిరిగే షాక్..

ప్రేమని కూడా భాగ్యం వాళ్ళ ఇంటికి రమ్మని నర్మదా చెప్తుంది. మీరు ఇలా ఒక మనిషి ప్రాణాలు తీయాలి అనుకోవడం తప్పు కాదని ఎలా అనుకుంటారు. అయినా కట్టుకున్న భర్తని చంపాలని అనుకోవడం నీ మూర్ఖత్వం కాదా అని నర్మదా ప్రేమ ఇద్దరు కూడా శ్రీవల్లికి దిమ్మ తిరిగిపోయేలా క్లాస్ పీకుతారు. ఎందుకు కట్టుకున్న భర్తని ఇలా చేయాలి అనుకున్నావు అని వాళ్ళు నిలదీస్తారు. నేను ఏమి ఆక్సిడెంట్ చేయమని చెప్పలేదు ఎంత వద్దని చెప్పినా మా అమ్మే ఇదంతా చేసింది అని శ్రీవల్లి అంటుంది.. ప్రేమ శ్రీవల్లి మాటకి కోపంతో రగిలిపోయి చంప పగలగొడుతుంది.

ఆ ఇంటికి శాశ్వతంగా దూరం..

Advertisement

మేము నిన్ను చందు బావని కలపడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నించమని నీకు తెలుసా? అయినా కూడా నువ్వు ఇలాంటి పాడు పనులు చేసావు. అంటే ఇక నువ్వు ఆ ఇంటికి రావాల్సిన అవసరం కూడా లేదు అని ప్రేమ నర్మదలు అంటారు. చందు బావని ఎన్నిసార్లు వల్లి అక్కని తీసుకురా అని బ్రతిమలాడము నీకు తెలుసా అని నర్మదా అంటుంది. వల్లి ఎంత చెప్తున్నా సరే ప్రేమ నర్మదలు మాత్రం నువ్వు ఆ ఇంటికి శాశ్వతంగా దూరమైనట్లే అని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. మాట వినగానే వల్లి ఒక్కసారిగా కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. భాగ్యం ఆనందరావు ఇద్దరు కూడా టెన్షన్ పడిపోతూ ఉండగా వాళ్ళు కొత్త డ్రామా మొదలు పెట్టకండి అని అంటారు. నిజంగానే బల్లి కింద పడిపోయింది అని తెలుసుకుని హాస్పిటల్ కి తీసుకొని వెళ్తారు..

తల్లి కాబోతున్న వల్లి..

మా అమ్మాయి అమాయకురాలు మీ వల్లే మా అమ్మాయికి ఇలా జరిగిందని భాగ్యం అప్పటికి వాళ్ళని నిందిస్తూ ఉంటుంది. అయితే డాక్టరు చందు వాళ్ళు మాట్లాడుతుండగా వచ్చి ఆమెకు వచ్చింది చిన్నాచితదేమీ కాదు. ఆమె ప్రెగ్నెంట్ అని చెప్పగానే అందరూ చాలా సంతోషంగా ఉంటారు. గొడవలన్నీ మర్చిపోయి వల్లిని చూసి అందరూ చాలా సంతోషంగా తల్లివి కాబోతున్నావని చెప్తారు. కానీ చందు మాత్రం వల్లితో మాట్లాడకపోవడంతో వల్లి చాలా బాధపడుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్లు ఏం జరుగుతుందో చూడాలి..

Also Read : Intinti Ramayanam Today Episode: అవనికి భరత్ దిమ్మతిరిగే షాక్.. పల్లవి ప్లాన్ సక్సెస్.. రాజేశ్వరికి స్ట్రాంగ్ వార్నింగ్..

Related News

వార్తా ప్రపంచం మారిపోయిందండోయ్.. 80ల్లో అలా, ఇప్పుడేమో ఇలా!

సెలబ్రిటీలకు మద్దతు తెలిపిన మాజీ కంటెస్టెంట్.. కామనర్స్ అంటే అంత చులకనా?

బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ద్వారా సుప్రీత.. ఏమన్నారంటే?

సీక్రెట్ రూమ్ లో చరణ్, చైత్ర? కంటెస్టెంట్లకు నాగార్జున స్ట్రాంగ్ వార్నింగ్!

ఢీ10 షో విన్నర్ రాజు అరెస్ట్?

నా జీవితంలో మర్చిపోలేని రోజు అదే – నటరాజ్ మాస్టర్!

బిగ్ బాస్ 10పై షాకింగ్ కామెంట్స్ చేసిన నటరాజ్ మాస్టర్!

కన్నీళ్లు పెట్టుకున్న ఉదయభాను.. వీడియో వైరల్!

Big Stories

Advertisement
×