Illu Illalu Pillalu Today Episode April 5 th : నిన్నటి ఎపిసోడ్ లో.. శ్రీవల్లి పెళ్లి ఆగిపోతుంది అని చెప్పినప్పటి నుంచి చందు బాధపడుతూ ఉంటాడు. తన మనసులో తాను లేకుండా అదే ఆలోచనతో ఉంటాడు. ధీరజ్ సాగరు చందు ముగ్గురు రెస్టారెంట్ కి వెళ్తారు. ధీరజ్ సాగర్ ఇద్దరూ మాట్లాడుకుంటూ తింటూ ఉంటారు కానీ చందు మాత్రం మౌనంగా ఏదో పోగొట్టుకున్న వాడిలాగా ఉంటారు. అది చూసినా ధీరజ్ ఏమైంది అన్నయ్య ఎలా ఉన్నావ్ అని అడుగుతారు. ఏం లేదురా ఏం కాలేదు అంటే మా ఇద్దరి పెళ్లి ఎలాగో నాన్న చేతుల మీదుగా జరగలేదు నీ పెళ్లి నాన్న చేతుల మీదుగా జరగాలని ఎన్నో ఆశలు పడ్డాడు. నీ పెళ్లి చూడాలని కలలు కన్నాడు నువ్వు మాత్రం ఏ తప్పు చేయకు రానేసి అంటారు.. చందు అలాంటిది ఏమి లేదని అంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. చందు 10 లక్షల కోసం తన ఫ్రెండ్స్ అందరిని అడుగుతుంటాడు. ఇంట్లో వాళ్ళ సంతోషాన్ని దూరం చేయొద్దని ఈ పెళ్లి ఎలాగైనా జరగాలని తనలో తానే మధుర పడుతూ ఉంటాడు. డబ్బుల కోసం ఫ్రెండ్స్ అందరినీ ఒక్కొక్కరుగా అడుగుతుంటాడు. కానీ ఎవరి దగ్గర డబ్బులు లేవని సమాధానం రావడంతో ఫీల్ అవుతాడు. ఇక వెనకనుంచి రామరాజు చందు భుజంపై చేయి వేస్తారు. అది చూస్తున్న చందు షాక్ అవుతాడు.
చందు ఏమైందిరా ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావ్ నీ మీద నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. ఈ పెళ్లిని జాగ్రత్తగా జరిగేలా చూడాల్సిన బాధ్యత నీదే అనేసి రామరాజు అంటాడు. దానికి చందు కూడా అదేం లేదు నాన్న పెళ్లి కదా హడావిడిలో అలా అనిపిస్తుంది అంతే అని అంటాడు. అటు భాగ్యం వాళ్ళు అల్లుడుగారు ఇంకా డబ్బులు పంపించలేదని టెన్షన్ పడుతూ ఉంటారు. అల్లుడు డబ్బులు పంపిస్తాడని ఆశగా ఎదురు చూస్తుంటారు కానీ శ్రీవల్లి మాత్రం ఆయన ఇంకా డబ్బులు పంపించలేదు కదమ్మా ఏమనుకున్నారో వాళ్ళ నాన్నకి చెప్పేసారేమో అనేసి అంటుంది.
ఎందుకు చెప్తారు అమ్మడు నువ్వేం టెన్షన్ పడకు ఏమి జరగలేదు అని భాగ్యం అంటుంది. ఇక ఆనందరావు ఏమైనా జరిగింటదేమో అండి ఆవిడగా రండి ఇంతవరకు డబ్బులు రాలేదంటే కచ్చితంగా చెప్పే ఉంటాడని టెన్షన్ పడతాడు. కానీ భాగ్యం మాత్రం చాలా కూల్ గా ఆయన గారండీ మీరు కాస్త నోరు మూస్తారని అంటుంది. కచ్చితంగా డబ్బులను అల్లుడుగారు తీసుకొస్తారు అని ధీమాగా ఉంటుంది.
వేదవతి తన కోడలతో కలిసి పిండి వంటలు మొదలు పెడుతుంది. అందరూ సరదాగా పిండి వంటలు చేస్తుంటారు. వేదవతి పెద్ద కూతురు వరసగా సెటర్లు వేస్తూ ఉంటుంది. ఇక ప్రేమ మా అమ్మ కూడా పెళ్లి వంటలు మంచిగా చేస్తుంది అని అంటుంది. మా అమ్మ తర్వాత ఎవరైనా మా అమ్మ చేతి వంట తింటే అమృతం లాగా ఉంటుందని అంటుంది. ఇక అప్పుడే ప్రేమ మా అమ్మ కూడా చాలా బాగా చేస్తుంది అనగానే మీ అమ్మ చేతి వంటని ఎప్పుడైనా ఇట్ల విశ్లేషరా ఏంటి? ఏ రోజైనా పెడితే తెలుస్తుంది అని అంటుంది.
నర్మద కూడా మా అమ్మ చేతి వంట చాలా బాగుంటుంది పిండి వంటలు ఇంకా బాగా చేస్తుందని గొప్పగా చెప్తుంది. మీ అమ్మ పిండి వంటలు చేసి తీసుకురావడానికి మీరేమన్న మామూలుగా చెప్పి పెళ్లి చేసుకున్నారా లేచిపోయి పెళ్లి చేసుకున్నారు కదా ఇంక ఎలా వస్తుంది మీ అమ్మ అనేసి వేదవతి అంటుంది. నేను లేచిపోయి పెళ్లి చేసుకుంది మీ అబ్బాయి కోసమే నేను మీ అబ్బాయి నువ్వు లేకుండా నేను ఉండలేను అంటేనే నేను పెళ్లి చేసుకున్నాను అని నర్మదా అంటుంది. ఇదంతా కాదు మీరు మీ అబ్బాయి పెళ్లి గురించి మా అమ్మ వాళ్లకి పెళ్లి పత్రిక ఇచ్చారా అని నర్మదా అడుగుతుంది. నిన్నే వద్దనుకున్న వాళ్ళు ఈ పెళ్లికి ఎలా వస్తారు అని నేను ఇవ్వలేదు అని అంటుంది.
మీ అమ్మ నీకోసం వస్తుందేమో అని వేదవతి వేదాలు వల్లిస్తుంది. మీ అమ్మ వచ్చింది ఒకసారి అటు చూడు అని వేదవతి అనగానే నర్మదా వాళ్ళ అమ్మని చూసి షాక్ అవుతుంది. నువ్వేంటమ్మా ఇలా వచ్చావు అని అనగానే మీ అత్తయ్య నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది ఇంట్లో పెళ్లి పెట్టుకున్నామని నీ గురించి గొప్పగా చెప్పింది అని నర్మదతో అంటుంది. నర్మద ఒక్కసారిగా తన తల్లిని చూసి కన్నీళ్లు ఆపుకోలేక కౌగిలించుకొని బాధపడుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో తన తల్లిని ఇంటికి తీసుకొచ్చినందుకు నర్మదా సంతోషపడుతూ వేదవతిని కౌగిలించుకుంటుంది. ప్రేమ ధీరజ్ మాత్రం కొట్టుకుంటూనే ఉంటారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో సోమవారం ఎపిసోడ్లో చూడాలి..