Illu Illalu Pillalu Today Episode August 11th : మాట్లాడనివ్వకుండా చేయాలి అని అనుకుంటారు. ప్రేమ అర్చన చేయించడానికి కూడా తన పేరు చెప్పడానికి ఇష్టపడకపోవడంతో ధీరజ్ కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఎందుకు ఇలా చేస్తుంది ప్రేమ అని ఆలోచిస్తూ ఉంటాడు.. నువ్వంటే నాకు ఎంత ప్రేమ తెలుసు కదా.. నేనంటే కూడా నీకు అంతే ప్రేమ కదా మరి ఎందుకు నువ్వు నా పేరు కూడా చెప్పడానికి ఇష్టపడడం లేదు అని కన్నీళ్లు పెట్టుకుంటాడు ధీరజ్.. ప్రేమ కూడా ధీరజ్ పై ఇలా మాట్లాడడం బాగోలేదు అని ఆలోచిస్తూ ఉంటుంది.. ఇక ధీరజ్ ఒకతను పడిపోతూ ఉంటే అతని పట్టుకుంటాడు అప్పుడే అక్కడేసిన పందిరి ధీరజ్ మీద పడిపోతుంది. అది చూసిన ప్రేమ ధీరజ్ కి ఏమన్నా అయిందేమో అని ఆలోచిస్తూ ఉంటుంది.. తనకి దెబ్బ తగిలింది అని వేదవతి అందరూ కూడా కన్నీళ్లు పెట్టుకుంటారు..
ప్రేమ దగ్గరకొచ్చిన పంతులుగారు భర్త పేరు చెప్పమ్మా అని ఎంతగా అడుగుతున్నా సరే.. తను మాత్రం అస్సలు వినకుండా ప్రేమ ఏం పర్లేదు అర్చన చేయండి అని అంటుంది. భర్తకి అయిష్టం అని చెప్తున్న సరే ప్రేమ మాత్రం ఏమి పర్వాలేదు చేయండి అని అంటుంది. అదేంటి ధీరజ్ కి ప్రమాదమని ఎంత చెప్తున్నా సరే నువ్వు వినవేంటి ప్రేమ అని వేదవతి అంటుంది. కానీ వేదవతి మాట కూడా ప్రేమ వినకుండా.. ప్రేమ ఏమి పర్వాలేదు అని అంటుంది. ఎందుకు ప్రేమ ఇంత మొండిగా మాట్లాడుతున్నావు అని మీ అబ్బాయి కదా నన్ను భార్య కాదు అని చెప్పాడు అని ప్రేమ ఉంటుంది.. భద్ర కావాలనే ప్రేమను రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది కానీ ప్రేమ మాత్రం అస్సలు వినకుండా ఉండడంతో ఈ కట్ చేసేది ఏమీ లేక పూజారిగారు పూజ చేస్తారు. ఇక రామరాజు దగ్గరికి వెళ్లి గోత్రం ఇంటి పేరు చెప్పమని అడిగితే నేను ఒక అనాధ అని చెప్తారు.. ఇక భద్ర గోరంగా అవమానిస్తుంది..
శ్రీవల్లి తన ప్లాన్ బాగా సక్సెస్ అయింది అని చాలా సంతోషంగా ఉంటుంది. నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను.. ఆ కాపురనే కూల్చేసిన ప్రేమ కాపురం సంతోషంగా ఉండడం నేను సహించలేకపోయాను. అందుకే దానికి కాపురంలో చిచ్చుపెట్టాను. మొగుడుతో కాపురం చేయకుండా విడగొట్టాను అని చాలా సంతోషంగా ఉంటుంది శ్రీవల్లి.. సుకన్య నీకు ప్రసాదం కావాలని అడిగి ఒక చిన్న పాప దగ్గరికి వెళ్లి కొబ్బరి చెపు తీసుకొని వచ్చి ఇస్తుంది. ఏంటే ఇంత సంతోషంగా ఉన్నావు ఏమైంది అని శ్రీవల్లిని సుక్కు అడుగుతుంది. తన మాట విన్న శ్రీవల్లి నా కాపురం విడగొట్టాలి అనుకుంది నా గురించి చెప్పింది. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది అనే శ్రీవల్లి చాలా సంతోషంగా ఉంటుంది. చందు ఎదురుగా రావడంతో మా బావ వస్తున్నాడు అని ఒకరి నుంచి వెళ్ళిపోతారు.
రామరాజు దేవుడు దగ్గరికి వెళ్లి దండం పెట్టుకుంటూ ఉండగా.. అక్కడ భద్ర అలాగే సేన వచ్చి కూడా దండం పెట్టుకుంటూ ఉంటారు.. అసలు గోత్రం ఇంటి పేరు లేని వాడు కూడా మనల్ని ఎత్తి పడేసేలాగా మాట్లాడతాడా అంటూ భద్ర రామరాజుని అవమానించేలా మాట్లాడుతుంది.. దేవుడి దగ్గరికి వచ్చాయో ఒక 500 కూడా హారతి పళ్లెంలో వేయలేని వాడు కూడా మనల్ని చూసి వెటకారంగా మాట్లాడుతున్నాడు అని ఇద్దరు కూడా రామరాజుని అవమానించేలా మాట్లాడుతారు. ఒక అనాధ నాకు చెల్లెల్ని దూరం చేశాడు ఇప్పుడు నా మేనకోడల్ని కూడా మాయమాటలు చెప్పి దూరం చేయాలని అనుకుంటున్నాడు అని భద్ర అంటుంది. భద్రాసేన ఇద్దరు కూడా రామరాజుని దారుణంగా అవమానించేలా మాట్లాడుతారు. మీ ఇంట్లో వాళ్ళు నా మేనకోడల్ని నీ కొడుకుని కలిపే ప్రయత్నం చేస్తున్నారు ఈ జన్మలో అది జరగదు అని వాళ్ళు రామరాజు తో చెప్తారు.
ఇక వేదవతి నర్మదా ధీరజ్ అమూల్య అందరూ కూడా.. ఏంటే ప్రేమతో మాట్లాడాలని నువ్వు వెళ్ళినా కూడా మా అక్క సడన్ గా అలా ఎలా వచ్చింది. మొదటిసారి ప్లాన్ ఫెయిల్ అయిపోయింది కదా అని అందరూ బాధపడిపోతూ ఉంటారు.. నర్మద మాత్రం వేదవతి ముందే భద్రను రమ్మని చెప్పావేమో అందుకే ఆవిడ సడన్గా వచ్చిందే నీ వెటకారంగా మాట్లాడుతుంది.. ఒక్కసారి కదా ఫెయిల్ అయింది మరోసారి మాట్లాడడానికి ప్రయత్నిద్దాం అని ధీరజ్ కూడా అనడంతో అందరూ ప్రేమతో ఎలాగైనా మాట్లాడి అసలు విషయాన్ని ప్రేమకు చెప్పాలి అని అనుకుంటారు. అప్పుడే రామరాజు అక్కడికి వచ్చి అక్కడ పూజకి ఎంత సిద్ధం చేస్తూ ఉంటే మీరు ఎందుకు ఇక్కడ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ నిలబడ్డారు పదండి అక్కడికి అనేసి అంటారు.. ఇక రామరాజు మాట విన్న అందరూ కూడా పూజలో కూర్చోడానికి వెళ్లిపోతారు..
పూజలో కూర్చున్నప్పుడు అమ్మవారికి కుంకుమ అభిషేకం చేస్తూ ఉంటారు. కుంకుమార్చన చేయాలి అంటే శాస్త్రోపేతంగా చేయాలి అని అక్కడున్న పంతులు అంటాడు. కానీ భద్ర మాత్రం నేను తొందరగా వెళ్ళి పోవాలి తొందరగా చదవండి అని తొందర పెడుతూ ఉంటుంది.. శ్రీవల్లి మీరు తొందరగా వెళ్ళిపోండి అని ఒకపక్క సైగలు చేస్తూ ఉంటుంది. పూజారి అమ్మవారికి కుంకుమభిషేకం చేసిన కుంకుమ ని ఆడవాళ్ళకి ఇచ్చే మీ భర్తలతో నుదుట బొట్టు పెట్టించుకోండి. మీ భర్తకి క్షేమంగా ఉంటుంది అని చెప్తాడు.. అందరూ కూడా తమ భర్తలతో బొట్టు పెట్టించుకుంటారు.. కానీ ప్రేమ దగ్గరికి వచ్చేలోగా ప్రేమ మరేం పర్వాలేదు అని ఎంత చెప్తున్నా సరే వినకుండా మొండిగా ఉంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..
Also Read :Intinti Ramayanam Today Episode: అవని సేఫ్..పల్లవికి దిమ్మతిరిగే షాక్..భానుమతి కి కమల్ ఝలక్..