E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: అవని సేఫ్..పల్లవికి దిమ్మతిరిగే షాక్..భానుమతి కి కమల్ ఝలక్..

Intinti Ramayanam Today Episode: అవని సేఫ్..పల్లవికి దిమ్మతిరిగే షాక్..భానుమతి కి కమల్ ఝలక్..
Advertisement

Intinti Ramayanam Today Episode august 11th : పల్లవి పూజ చేస్తూ ఉండగా అశ్విన్ మెసేజ్ ల మీద మెసేజ్లు చేస్తాడు. పల్లవి ప్రశాంతంగా కూడా పూజ చేసుకుని ఇవ్వట్లేదు అని అనుకునే లోపల కమల్ ఆ ఫోన్ పక్కన పెట్టి పూజ మీద దృష్టి పెట్టు అని అంటాడు.. అయితే పల్లవి అశ్విన్ చేసిన మెసేజ్ ని చూస్తూ పొరపాటున అక్కడ ఉన్న దీపపు కుండీలను కిందపడిస్తుంది. ఆ దీపం వెలుగుతున్నది అవని చీర మీద పడడంతో చీర అంటుకుంటుంది. మంటలు చాలా రేగడంతో ఇంట్లోని వాళ్ళందరూ కంగారు పడిపోతూ ఉంటారు. ఇక మొత్తానికి మంట లార్పి అవని కాపాడుతారు.. పూజారి మాత్రం మృత్యుంజయ హోమం జరిపిస్తున్నప్పుడు ఇలాంటి అపశకనం జరగడం ఏంటి ఏదో జరగబోతుంది అని అనగానే ఇంట్లోని వాళ్ళందరూ కంగారు పడిపోతూ ఉంటారు.. పల్లవి మాత్రం అశ్విన్ వచ్చాడు అంటే కచ్చితంగా నాకే ఏదో పెద్ద ప్రమాదం ఉంది అని ఆలోచనలో పడుతుంది. మొత్తానికి చీర మార్చుకొని వచ్చిన తర్వాత అవని అందరూ కలిసి పూజ ని పూర్తి చేస్తారు.

అవని కోసం బాధపడ్డ అక్షయ్..

అవనికి నిప్పు అంటుంది అని ఇంట్లోని వాళ్ళందరూ బాధపడిపోతూ ఉంటారు.. కాలిన చీరతో పూజలో కూర్చోవద్దు అని చెప్పడంతో అవని చీర మార్చుకోవడానికి పైకి వెళ్తుంది.. అవని చీర మార్చుకున్న తర్వాత అక్షయ్ ఎవరి దగ్గరికి వచ్చి అవన్నీ నీకేం కాలేదు కదా.. నీకేమైనా అయిందేమో అని నేను చాలా కంగారు పడ్డాను.. నేను ఏం జరిగిన కూడా బాధపడను ఎంత సమస్య అయినా ఎదుర్కొంటాను కానీ, నీకు ఏమైనా అయితే మాత్రం నేను అసలు తట్టుకోలేను అవని అని అక్షయ్ అంటారు. నాకు ఏమీ కాకుండా ఉండడానికి మీ ప్రేమ సరిపోతుంది అండి.. నీ ప్రేమే నన్ను ఎప్పటికీ కాపాడుతూ వస్తుంది అని అవని చెప్పగానే అక్షయ్ ఎమోషనల్ అయిపోతాడు. ఇక ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ మాట్లాడుకోవడం జనాలని విపరీతంగా ఆకట్టుకుంది..

అశ్విన్ దెబ్బకు పల్లవి షాక్..

Advertisement

ఇక పూజలు పూర్తి చేసిన తర్వాత పంతులుగారు పూజ సజావుగా జరిగిందమ్మ అనగానే, అంతా మంచే జరుగుతుంది అని అనగానే ఇంట్లోని వాళ్ళందరూ కూడా అక్కడ చేసిన హోమం కి దండం పెట్టుకొని చాలా సంతోషంగా ఉంటారు.. పూజ మొత్తం పూర్తయింది కదా ఇంకేమైనా ఉందా అని పార్వతి అడగగానే అశ్విన్ పూర్తవలేదు ఇంకా ఉంది నా జీవితాన్ని ఎందుకు నాశనం చేశావు అని ఒక్కసారిగా అంటాడు. నా జీవితంతో ఆడుకొని నువ్వు సంతోషంగా ఉంటావా..? నన్ను ఇంతగా ఇబ్బంది గురిచేసిన నిన్ను అసలు వదిలిపెట్టను అని పల్లవిని చూసి అశ్విన్ మాట్లాడడంతో అందరికీ కూడా అశ్విన్ పై అనుమానం వస్తుంది. అసలు అశ్విన్ ఎందుకు పల్లవిని చూసి మాట్లాడుతున్నాడు అని అందరూ కంగారు పడిపోతూ ఉంటారు.

అవనికి పల్లవి పై అనుమానం..

పల్లవిని చూసి ఎందుకు ఇతను మాట్లాడుతున్నాడు? అసలు ఎవరితను? ఎందుకు అలా మాట్లాడుతున్నాడు అని అందరూ ఆలోచిస్తూ ఉంటారు కానీ అవని మాత్రం ఎవ్వరూ నువ్వు? పల్లవిని చూసి ఇలా మాట్లాడుతున్నావు? మా చెల్లెలు నీకేం చేస్తుంది అని అవని అడుగుతుంది కానీ పల్లవి మాత్రం అతని ఎక్కడ నిజం చెప్తాడు అని కంగారు పడిపోతూ ఉంటుంది.. ఇంట్లోని వాళ్ళందరూ కూడా అనుమానంతో చూడడంతో.. అశ్విన్ నేను నీతో మాట్లాడట్లేదండి ఫోన్లో మాట్లాడుతున్నాను అని చెప్తాడు.. పల్లవి తనకు చేసిన అన్యాయాన్ని కూడా చెప్పడంతో ఇండైరెక్టుగా తన ఫ్రెండు తన రిమోసం చేశాడు అని చెప్పి అక్కడినుంచి వెళ్ళిపోతాడు.. పల్లవి మాత్రం కంగారు పడిపోతూ ఉంటుంది.

పల్లవి పై అనుమానం..

Advertisement

ఈ పూజ బాగా పూర్తయింది కదా ఇక అందరం భోజనం చేద్దాం పదండి అని అందరు కూర్చొని తింటూ ఉండగా మీనాక్షి చేసిన పులిహోరపై ప్రశంసలు కురిపిస్తారు.. మీనాక్షి పులిహోర చాలా బాగా చేసింది. ఆమె వంటకి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఆమె చేసిన వంట అలా ఉంది? అద్భుతం అంటూ అందరూ లొట్టలు వేసుకుంటూ తింటూ ఉండగా పల్లవి మాత్రం అశ్వినిచ్చిన జలక్ తో కంగారు పడిపోతూనే ఉంటుంది.. ఎందుకు పల్లవి నువ్వు తినట్లేదు అని మీనాక్షి అడగ్గాని తింటానమ్మా చాలా బాగుంది అని చెప్తుంది.. ఇక అక్కడున్న స్వీట్లు మిస్ అవ్వడంతో కమల్కు భానుమతి పై అనుమానం వస్తుంది. ఇక భానుమతిని వెతుక్కుంటూ బయటికి వెళ్లిన కమల్ తన అనుమానమే నిజమైంది అని ఆ స్వీట్ లని భానుమతి నుంచి తెలివిగా తీసుకుని వచ్చేస్తాడు. భానుమతి ఎంతగా అడిగిన సరే ఒక్క స్వీట్ కూడా ఇవ్వకుండా అందరికీ వడ్డించేస్తాడు కమల్.. ఇక బాబు బాగా ఏడుస్తున్నాడని చూసి ఆరాధ్య కన్నీళ్లు పెట్టుకుంటుంది అది చూసి అందరూ కూడా బాధపడతారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :నెటిజన్లకు బాలు దిమ్మతిరిగే కౌంటర్.. ఆ రూమర్స్ కు చెక్ పడ్డట్లేనా..?

Related News

ఫైమా, యాదమరాజు మధ్య బాంగిల్స్ గోల.. నవ్వులే నవ్వులు!

సోనియానే నా హీరో అన్న యష్.. ఎందుకో తెలుసా?

సనాతన ధర్మంపై ఫైమా ఏమందో తెలుసా.. ఫ్యామిలీ రియాక్షన్ కూడా ఇదే!

యాదమరాజుతో ఫస్ట్ టైమ్ థియేటర్‌కు వెళ్లిన స్టెల్లా.. అక్కడ ఏం జరిగిందంటే?

ఫైమా బెటరా? వర్ష బెటరా?.. సమాధానం విని అంతా నవ్వాల్సిందే!

సింగిల్‌గా ఉండటమే బెస్ట్ అంటున్న వర్ష.. విష్ణుప్రియ కౌంటర్ అదుర్స్!

రూ.15 లక్షలకే ఎందుకు టెంప్ట్ అయ్యావు.. మిథిలేష్ కు ఇచ్చిపడేసిన శివాజీ!

బషీర్ మాస్టర్ ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Big Stories

Advertisement
×