Bigg Boss 10 Telugu Day 84 Promo 3 : బిగ్ బాస్ 10 తెలుగు కార్యక్రమం నేటితో 12 వారాలు పూర్తి కాబోతున్నాయి. ఇక మరొక మూడు వారాలలో ఈ కార్యక్రమం గ్రాండ్ ఫినాలే జరగబోతుంది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఈ వారం వంశీ ఎలిమినేట్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. ఓటింగ్ పరంగా లీస్ట్ లో ఉన్న వంశీ 12వ వారం బయటకు రాబోతున్నట్లు తెలుస్తుంది. ఇకపోతే ఈ వీకెండ్ ఎపిసోడ్ లో భాగంగా బిగ్ బాస్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోలు విడుదల చేశారు. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ వేదికపై వృషకర్మ (vrusha karma)టీం సందడి చేశారు.
కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య(Nagachaitanya) మీనాక్షి చౌదరి (Meenakshi Chaudary ) హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా డిసెంబర్ 4వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్లలో భాగంగా డైరెక్టర్ తో పాటు నాగచైతన్య మీనాక్షి బిగ్ బాస్ వేదిక పైకి వచ్చారు. ఇలా నాగచైతన్య వేదిక పైకి రావడంతో నాగార్జున హౌస్మెట్స్ అందరిని వాళ్లకు పరిచయం చేస్తున్నారు. ముఖేష్ ను పరిచయం చేస్తూ తన పేరు ముఖేష్ స్టార్డం ఉన్న వ్యక్తి అని తెలిపారు. అనంతరం శివకుమార్ ను పరిచయం చేస్తూ ఈయన మాట్లాడే ప్రతి ఒక్కరిని మేడం సార్ అంటూ పిలుస్తూ ఉంటారు.
ఇక ఇంట్లో ప్రియాంకను కూడా మేడం అని పిలుస్తారని నాగార్జున చెప్పారు. అదేవిధంగా నువ్వు ఎప్పుడైనా శోభిత(Sobhita)ని అలా పిలిచావా అంటూ నాగార్జున చైతన్యను అడగడంతో కొన్నిసార్లు పిలవాల్సి వచ్చింది అంటూ నాగ చైతన్య షాకింగ్ సమాధానం చెప్పారు. ఇలా తన భార్యను మేడం గారు అని పిలిచిన పరిస్థితులు వచ్చాయని నాగచైతన్య చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అనంతరం మీనాక్షి చౌదరితో అమన్, నరేష్ పులిహోర కలిపే ప్రయత్నాలు చేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో వీడియో అందరిని ఎంతగానో ఆకట్టుకుంటుంది.
ఇక 12వ వారం నామినేషన్‌లో త్రిగుణ్, ముఖేష్, రామ్ ప్రసాద్, రామకృష్ణ, దేబ్జానీ, వంశీ, వర్షిని ఉన్నారు. వీరిలో ఎప్పటిలాగానే త్రిగుణ్ టాప్ లో దూసుకుపోతున్నాడు. త్రిగుణ్ తరువాత ముఖేష్ గట్టి పోటీ ఇస్తున్నారు. ఆ తర్వాత రాంప్రసాద్ సుధీర్ వంటి వారు ఓటింగ్లో ముందంజలో ఉండగా డేంజర్ పొజిషన్లో వర్షిని రామకృష్ణ వంశీ ఉన్నారు. అయితే బిగ్ బాస్ ఉద్దేశపూర్వకంగానే వర్షిణిను సేవ్ చేస్తూ ఈవారం టెంపర్ వంశిని హౌస్ నుంచి బయటకు పంపించారని తెలుస్తోంది. ఇలా 12వ వారం వంశీ ఎలిమినేట్ అయినట్టు వార్తలు వస్తున్నాయి మరి ఇందులో ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది.
Also Read: సుధీర్, అనసూయ జబర్దస్త్ నుంచి అందుకే వెళ్లిపోయారు.. సత్య శ్రీ క్లారిటీ!