Illu Illalu Pillalu Today Episode july 19th: నిన్నటి ఎపిసోడ్ లో.. ప్రేమ ధీరజ్ కోసమే నేను జాబ్ చేశాను అత్తయ్య అర్థం చేసుకోండి.. మావయ్య గారిని అలా అనడం నాకు బాధగానే ఉంది.. అయితే ఇంత జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు నన్ను క్షమించండి అత్తయ్య అని ప్రేమ వెదవతిని అడుగుతుంది. ఇక నర్మదా వేదవతి తరపున మాట్లాడుతుంది. అసలు నువ్వు మాట్లాడద్దు అని వేదవతి నర్మదపై సీరియస్ అవుతుంది. ఇంట్లో ఇదంతా జరగడానికి కారణం నువ్వే. ప్రేమ పిరికిది నువ్వే దానికి ధైర్యాన్ని నూరిపోసి ఇలా మాట్లాడించావు ఇలా చేశావు అంటూ వేదవతి అరుస్తుంది. మిమ్మల్ని నేను ఎంతగా నమ్మాను.. ఫ్రెండ్స్ లాగా ప్రతిదీ మీకు చెప్తూ వచ్చాను. కానీ మీరు మాత్రం నన్ను ఇలా మారుస్తారని అస్సలు ఊహించలేదు.. మధ్యలో శ్రీవల్లి వచ్చి అతను సపోర్ట్ చేస్తున్నట్టు మాట్లాడుతుంది.. ఆ తర్వాత తిరుపతి ప్రేమనగర్ ని తీసుకొని వాళ్ళ ఇంట్లో ఇవ్వడానికి వెళ్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. ఇంట్లోకి వెళ్లిన తిరుపతి ఇంకా రాలేదని గుమ్మం బయట ఎదురు చూస్తూ టెన్షన్ పడుతూ శ్రీవల్లి ఉంటుంది.. బాబాయ్ గారు నగలను ఇచ్చేసారా అని అడుగుతుంది. అయితే ఇచ్చాను అని అంటాడు. అవి డూప్లికేట్ అని ఎక్కడ తెలుసుకుంటారు అని ప్రేమ టెన్షన్ పడుతూ ఉంటుంది. బాబాయ్ గారు అంటే అవి ప్రేమ నగలుగా ఎందుకు చెక్ చేస్తారు లోపల పెట్టేసారు అని అనగానే శ్రీవల్లి సైలెంట్ అవుతుంది. అమ్మయ్య గిల్టు నగల్ని ఆ ఇంటికి చేర్చేశాను ఇక నాకు ఏ బాధ లేదు నా నగలు గిల్టు అని తెలిసే అవకాశం లేదు అని శ్రీవల్లి సంతోష పడుతూ ఉంటుంది.
ఇదంతా కాదమ్మా ఆ నగలు ప్రేమ ఉంది కదా నువ్వెందుకు ఇంతగా ఆరాటపడుతున్నావో నాకు అర్థం కావట్లేదు అని తిరుపతి అంటాడు. మీ ఇంటికి పెద్ద కోడలు కాదు బాబాయ్ అన్ని విషయాలు తెలుసుకుంటే మంచిది కదా అని అంటుంది శ్రీవల్లి. శ్రీవల్లి అంత ఆతృతగా అడగడంతో ప్రేమ వింటుంది. అక్క ఏంటి ఆ నగలు ఎవరివి అని అడుగుతుంది. ఆ నగలు నీవే మరి నువ్వు ఎందుకు ఇంత ఆసక్తిగా అడుగుతున్నావు అని ప్రేమ అంటుంది. ఇంటికి నేను పెద్ద కోడల్ని అన్ని విషయాలు దగ్గరుండి చూసుకోవాలి కదా అని అంటుంది శ్రీ వల్లి.
నాన్నకుల గురించి నా వాళ్ల గురించి నువ్వెందుకు ఇంతగా ఆసక్తి చూపిస్తున్నావు నాకర్థం కావట్లేదని ప్రేమ అంటుంది.. ఏం మాట్లాడుతున్నావ్ ప్రేమా అని శ్రీవల్లి అంటుంది. పోలీసులుకు దొంగ దొరికినట్లు ఆ ప్రశ్నలు ఏంటి అక్క అని ప్రేమ అంటుంది. భలేదని ప్రేమ ఇవన్నీ తెలుసుకోవడం నా బాధ్యత అది నువ్వు మర్చిపోవద్దు అని శ్రీవల్లి వెళ్ళిపోతుంది. ఆ నగల గురించి ఏమైనా ఇంత శ్రద్ధ ఎందుకు తీసుకుంటుందో నాకు అర్థం కావట్లేదు ఏదో జరుగుతుంది ఈమె ఏదో ఒక కన్నెయ్యలని ప్రేమ అనుకుంటుంది.
అటు నర్మదా సాగర్ మాట్లాడకపోవడంతో బాధపడుతూ ఉంటుంది. సాగరు ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. ఇంట్లో నాతో అత్తయ్య మామయ్య తో సహా ఎవ్వరూ నాతో మాట్లాడడం లేదు. నువ్వు కూడా నాతో మాట్లాడకుండా ఉంటే నేను ఏమైపోవాలి అని కన్నీళ్లు కారుస్తుంది. సాగర్ ని ఎంత బ్రతిమిలాడుతున్న మాట్లాడడు. నువ్వు నన్ను అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు సాగర్ అని నర్మదా బాధపడుతుంది.
సాగర్ మాత్రం నిన్ను ఒక మాట అంటేనే నువ్వు ఇంత ఫీలవుతున్నావు.. ఆ ఇంటి వాళ్ళు మా నాన్న చొక్కాని చించారు. చాలా అవమానించారు. నాన్న ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా బాధపడుతున్నాడు అని సాగర్ అంటాడు. మా డాన్స్ క్లాసులు చెప్పడానికి కారణం నువ్వే.. ఇప్పటికి నువ్వు నిజాన్ని ఒప్పుకోవడం లేదు చూడు అని సాగర్ అంటాడు. నేను ఎప్పుడూ అబద్ధాలు చెప్పను సాగర్ ఏదైనా పొరపాటున కొన్ని విషయాలు దాస్తానేమో కానీ నర్మదా అంటుంది. కానీ సాగర్ మాత్రం ఇప్పటికీ నీ తప్పులేదు అని అంటున్నావు. అందుకే నాకు నీతో మాట్లాడాలంటే ఇష్టం లేదు అసహ్యం వేస్తుంది అని అంటాడు.
శ్రీవల్లి భాగ్యం కి ఫోన్ చేసి నగల విషయాన్ని చెప్తుంది. ఆ నగల్ని డౌట్ లేకుండా ప్రేమ నగలులో కలిపేసావా అని భాగ్యం అడుగుతుంది.. ఏ అనుమానం రాలేదు కదా ఏ గొడవ లేదు కదా అని భాగ్యం అడుగుతుంది. ఏ అనుమానం రాలేదమ్మా. అమ్మయ్య అయితే నీ కాపురానికి ఇక ఏ డోకా లేదు అని భాగ్యం అంటుంది. ప్రేమ నర్మదలతో ఎవ్వరూ మాట్లాడటం లేదు అత్తయ్య కూడా వాళ్ళని దూరం పెట్టేసింది. ఇదంతా తల్చుకుంటుంటే నాకు ఈ ఇల్లు సొంతమైన సంతోషంగా ఉంది అని అంటుంది. అప్పుడే సంతోష పడకు ఇంకా నువ్వు చేయాల్సింది చాలా ఉంది అని భాగ్యం శ్రీవల్లికి ప్లాన్ చెప్తుంది.
Also Read : అవని పై డాక్టర్ ప్రశంసలు.. పార్వతికి కోపం తెప్పించిన పల్లవి.. ప్రణతికి షాక్..
ప్రేమ కోసం ధీరజ్ వెతుక్కుంటూ వస్తాడు. నీకోసం నేను ఎక్కడెక్కడో వెతుకుతున్నాను.. నువ్వెక్కడున్నావా? నీకోసం నేను ఒక అదిరిపోయే సర్ప్రైజ్ తీసుకొచ్చాను అని అంటాడు. నీకోసం ఎంబీఏ ఫార్మ్ తీసుకొచ్చాను. ఇది అయిన తర్వాత నువ్వు ఎమ్మెస్ చేయాలని అనుకుంటున్నావు కదా.. ఫామ్ ఫిల్ చేయని ధీరజ్ అంటాడు.. ప్రేమ మాత్రం కోపంగా ఆ ఫామ్ ని చించేస్తుంది. అదేంటి ఆలోచించేసావ్ ఎమ్మెస్ చేయడం నీ డ్రీమ్ కదా అని ధీరజ్ అంటాడు.. నా డ్రీమ్ గురించి ఆలోచించాల్సిన అవసరం నీకేంటి అని ధీరస్ ని అడుగుతుంది ప్రేమ. నీ గురించి ఆలోచించాల్సిన అవసరం నాకు లేనప్పుడు నా గురించి ఆలోచించాల్సిన అవసరం నీకు లేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. సోమవారం ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..