Intinti Ramayanam Today Episode july 19th: నిన్నటి ఎపిసోడ్ లో.. పార్వతి నేను ఇచ్చిన సున్నుండలు తిన్నాడా అని అడుగుతుంది. మొత్తం తిన్నాడు అత్తయ్య అని పల్లవి అంటుంది. ఎలా ఉన్నాయి అంట బాగున్నాయంటా నాని పార్వతి క్వశ్చన్ మీద క్వశ్చన్ వేస్తుంది. ఇదంతా ఎందుకు మీరే వీడియో కాల్ చేసి ఒకసారి ఎలా ఉందో అడగండి అని పల్లవి సలహా ఇస్తుంది. ఆ తర్వాత అక్షయ్ వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తుందని జూమ్ చేసి ఫోన్ మాట్లాడాలని కాల్ లిఫ్ట్ చేస్తాడు. పార్వతీ అందరితో నార్మల్గానే మాట్లాడుతాడు. ఫోను ఎలాగో మేనేజ్ చేసాడు అని పల్లవి డల్ అవుతుంది. ఇంకా అక్షయ్ హాస్పిటల్ కి వెళ్ళాలని రెడీ అవుతాడు. అవని నేను అందుకే వచ్చాను నేను తీసుకెళ్తాను పదండి అని అంటుంది. అవని అక్షయ్ ను తీసుకోని హాస్పిటల్ కు తీసుకొని వెళ్తుంది. మధ్యలో పార్వతిని చూసి షాక్ అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. పార్వతి నన్ను బండిమీద వచ్చి గుద్దేయాలని చూస్తున్నావా అని అడుగుతుంది. బ్రేక్ ఎందుకు వేస్తాను గుద్దేస్తాను కదా అని అవని అంటుంది. ఇద్దరూ మాటలు యుద్ధం మొదలుపెడతారు. పల్లవి అక్షయ బావ దొరికిపోతే బాగుండు అని టెన్షన్ పడుతూ ఉంటుంది. నా కస్టమర్ కి టైం అవుతుంది. నేను తీసుకొని వెళ్ళిపోతాను అని అవని అంటుంది. అక్షయ్ కూడా ఇంక పద తొందరగా అమ్మకు దొరికితే మామూలుగా ఉండదు అని అనడంతో అవని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
అక్షయ్ ను అవని హాస్పిటల్ కి తీసుకొని వెళ్తుంది. అక్కడ డాక్టర్ దగ్గర రిపోర్ట్ లు చూపించి టెస్టులు చేపిస్తుంది. అనంతరం డాక్టర్ దగ్గరికి వెళ్లిన వాళ్లకి దాదాపు ఇన్ఫెక్షన్ తగ్గిందని అంటాడు డాక్టర్. ఇలాగా తొందరగా మీరు రికవరీ అవ్వడం మామూలు విషయం కాదు ఇదంతా మీ భార్య చేసిన మేలే సేవలే కారణమని డాక్టర్ చెప్తాడు. చెయ్యి పూర్తిగా తగ్గిపోయింది అంటున్నాడు కదా ఇక బయటికి వెళ్లిపోతే బాగుండు అని అనుకుంటాడు. కాని డాక్టర్ మాత్రం ఇంకొన్ని రోజులు మీరు మెడిటేషన్ తీసుకోవాలి అని అంటాడు.
మీ భార్య చేసిన సేవలే మిమ్మల్ని త్వరగా రికవరీ అయ్యేలా చేశాయి. మీరు ఇంకో కొద్ది రోజులు అలానే కంటిన్యూ చేయండి. ఆమె డైట్ ఇస్తే అదే ఫాలో అవ్వండి అని అంటాడు. ఇక పల్లవి పార్వతి ఇద్దరూ వెళ్తూ ఉంటారు దారిలో పార్కులో ప్రణతి భరత్ ని చూస్తారు. పల్లవిని కార్ ఆపమని పార్వతి అడుగుతుంది. అటు చూడు పల్లవి అని వాళ్ళిద్దర్నీ చూపిస్తుంది. అదేంటి అత్తయ్య పెళ్లి కావలసిన అమ్మాయి ఇలా పార్కుల్లో వాడి వెంట తిరుగుతుంది. ఇది ఎవరైనా చూస్తే పలానా అమ్మాయి ఒక అబ్బాయి తో పార్కులో తిరుగుతుందని అందరూ నానా రకాల మాటలు అనుకుంటారు.
మన ఇంటి పరువు ఏమవుతుంది మీరు ఏదో ఒకటి చేయాలి అత్తయ్య అని పార్వతి తో పల్లవి అంటుంది. ఇక పల్లవి పార్వతి భరత్ ప్రణతి దగ్గరికి వెళ్తారు.. అక్కడ వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటే పల్లవి మీ ప్రేమ గురించి మాట్లాడుకుంటున్నారని అంటుంది. ప్రణతిని అరుస్తుంది పల్లవి. ప్రణతి మాత్రం మీరేం మాట్లాడుతున్నారు ఇద్దరం కలిసి వస్తే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటారా అని అంటుంది. నా కూతురుతో తిరగద్దని నీకు ఇదివరకే చెప్పాను కదా చెంప పగలగొట్టాను కదా.. మళ్లీ నువ్వు ఎందుకు ఇలా పార్కు తీసుకొచ్చావు అని పార్వతి అడుగుతుంది.
పార్వతి మళ్లీ భరత్ నీ కొడుతుంది. ఆంటీ మీరు తప్పుగా మాట్లాడుతున్నారు తనకి తలనొప్పిగా ఉందంటే టాబ్లెట్లు తీసుకొచ్చి ఇచ్చాను. కాసేపు కూర్చుందాం అంటే ఇక్కడికి తీసుకు వచ్చాను.. అంతే మీరు వేరేలా అనుకోకండి అని భరత్ ఎంత చెప్తున్నా పార్వతీ వినకుండా రెచ్చిపోయి మాట్లాడుతుంది. ఆ మాటలు విన్న ప్రణతి పార్వతికి దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇస్తుంది. ఇద్దరు కలిసి తిరిగితే మీరు ప్రేమని ఇంకొకటి అని అనుకుంటారేంటి..? భరత్ గురించి నాకు తెలుసు భరత్ మీద నాకు నమ్మకం ఉంది మీరు ఇంకొకలా అనుకోవాల్సిన అవసరం లేదు. భరత్ అనే తిరుగుతాను భరత్ అనే బయటికి వెళ్తాను. అని పార్వతితో అంటుంది.
పల్లవి పదా అత్తయ్య తాను భరత్ ఎలాంటివాడో తెలుసుకుంటుంది మనం వెళ్ళిపోదాం పద అని అంటుంది.. అక్షయ్ కి అవని జ్యూస్ ఇచ్చి పెద్ద క్లాసే పీకుతుంది.. భరత్ ప్రణతి ఇంటికి రాదని భరత్ ని చూసిన అవని ఆ కట్టేంటి ఆ దెబ్బలు ఏంటి అని అడుగుతుంది. ఏమైందో చెప్పరా ఎవరికైనా గొడవపడ్డావా అని ఎంత అడిగినా భరత్ మాత్రం చిన్న యాక్సిడెంట్ అక్క అని లోపలికి వెళ్ళిపోతాడు. ప్రణతిని అవని అడుగుతుంది.. మేము పార్కులో కూర్చొని ఉంటే మా అమ్మ వచ్చి గొడవ చేసింది వదిన అని నిజం చెప్పేస్తుంది.
అవనికి ప్రణతి మొత్తం విషయాన్ని చెప్పేస్తుంది. నా కూతురుతో తిరుగుతావా అని అమ్మ భరత్ ని కొట్టింది. కింద పడిపోయాడు అప్పుడు తగిలిన దెబ్బ అని చెప్తుంది. నేను భరత్ కి దెబ్బ తగలడంతో సహించలేకపోయాను అమ్మని రెచ్చగొట్టేలా మాట్లాడాను అని అంటుంది. అవని మాత్రం మీరిద్దరూ ఎందుకు వెళ్లారు అమ్మతో అలా నేను మాట్లాడేది అంటూ ప్రణతిని తిడుతుంది. ప్రణతి నేను చేసిన దాంట్లో తప్పేమీ లేదు అని అవనితో అంటుంది. ఇంత దాకా వచ్చిన తర్వాత అసలు నిజం నేను బయట పెట్టకపోతే బాగోదు అని ప్రణతి భరత్ ని ఇష్టపడుతున్న విషయాన్ని చెప్పేస్తుంది.
Also Read:శృతిని కాపాడిన బాలు..రవి, శృతి మళ్లీ ప్రభావతి ఇంటికి వెళ్తారా..?
నీకేమైనా పిచ్చి పట్టిందా ఏం మాట్లాడుతున్నావ్ ప్రణతి అని అడుగుతుంది. మొదట నాకు భరత్ అంటే ఇష్టం ఉండేది కాదు ఆ తర్వాత తన మాటలకి తన కేరింకి నేను ఇష్టపడ్డాను. అప్పటినుంచి నా మనసు నా మనసులో లేదు అతనిపై ఇష్టాన్ని పెంచుకున్నాను. భరత్ నా మీద చూపించే ప్రేమ అభిమానం నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. నాకు బ్రతకాలి అన్న కోరిక కలిగింది భరత్ వల్లే అని ప్రణతి అవనితో అంటుంది. భరత్ మీద ఇష్టం ఏర్పడింది అది కాస్త ప్రేమగా మారింది అని ప్రణతి అంటుంది. ఆ మాటలు విన్న ప్రణతి షాక్ లో ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. సోమవారం ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..