Intinti Ramayanam Today Episode july 7th: నిన్నటి ఎపిసోడ్ లో.. పార్వతిని వీధిలో వాళ్ళ అన్న మాటల్ని విని బాధపడుతూ ఉంటుంది. చూశారా అత్తయ్య నేను ముగ్గురు కోడల్ని ఒకేలాగా చూశాను. కానీ వాళ్ళందరి నన్ను ఎలా మాట్లాడాలో చూసారా? ఈ మాటలు గనక అక్షయ వింటే తప్పుగా అనుకోడు అదే నిజమని నమ్ముతాడు కదా అని పార్వతి కన్నీళ్లు పెట్టుకుంటుంది. అప్పుడే అక్షయ్. అమ్మ వాళ్ళని తీసుకెళ్తారు. మొత్తానికి ప్లాన్ గ్రాండ్ సక్సెస్ అయింది.. వదిన వాళ్ళు అన్నయ్య వాళ్ళ దగ్గరికి మాట్లాడడానికి ఏ క్షణమైనా రావచ్చు.
మేము ఇక్కడ నీతో మాట్లాడటం చూస్తే ఖచ్చితంగా డౌట్ వస్తుంది అని అక్కడి నుంచి శ్రీకర్ కమల్ వెళ్ళిపోతారు. శ్రియ పల్లవిలు పార్వతి ఇంటికి రావడం చూసి ఏంటి వీళ్లిద్దరు కలిసి వచ్చారు ఏమైనా జరిగిందేమో అని ప్రణతి అంటుంది.. ఇంట్లోకి రాగానే అత్తయ్య గారు మీ అబ్బాయిలు తాగచ్చి మమ్మల్ని కొడుతున్నారు అని చెబుతారు.. ఎలాగైనా మీరు ఆ ఇంటికి రావాలని కొరతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. పార్వతి ఆ ఇంటికి నాకు అసలు వెల్లబుద్దే కావట్లేదు అని ఆలోచిస్తూ ఉంటుంది.. అయితే భానుమతి మాత్రం నువ్వు ఆ ఇంట్లో ఉన్న కొడుకుల కోసమే వెళ్తున్నావ్ వేరే వాళ్ల కోసం వెళ్లట్లేదు కదా అనేసి అంటుంది. అక్షయ్ కి ఏమి రాదు అత్తయ్య నువ్వే చూసుకోవాలి అని భానుమతి తో పార్వతి అంటుంది. నువ్వేమన్నా చిన్నపిల్లని హాస్టల్లో వదిలి వెళ్తున్నావా ఏంటి? నేను అన్ని చూసుకుంటాను వంట దగ్గర నుంచి వాడికి ఏం కావాలో అన్ని దగ్గరుండి నేను చేస్తాను అని భానుమతి అంటుంది. పద రాహుకాలం వచ్చేలోగా ఇకనుంచి వెళ్లాలి అని పార్వతిని రెడీ చేస్తుంది.
రాజేంద్రప్రసాద్ అవనీని పిలుస్తాడు. నీకు ఒక సర్ప్రైజ్ అని చెప్తాడు. ఇంటికి రాగానే అక్కడ ఉన్న స్కూటీని చూసి ఇది చాలా పెద్ద సర్ప్రైజ్ మావయ్య గారు.. ఇప్పుడు ఎందుకండీ స్కూటీ అని అవని అడుగుతుంది. అయితే ఇది నీ కోసం కొనలేదమ్మా. నేనైతే ఏది కొనలేదు నేను ఒకరోజు నడుచుకుంటూ వెళ్లడం నా ఫ్రెండ్ చూశాడు. వాడు గతంలో నా ఆఫీసులోనే పని చేశాడు. అయితే నాకు కారు కొనివ్వాలని అనుకున్నాడు నేను ససేమిరా అనడంతో.. కనీసం ఈ స్కూటీ నైనా తీసుకుని వెళ్ళండి అని బ్రతిమలాడితే నేను తీసుకొచ్చాను. నువ్వు ఇంటర్వ్యూలు కానీ బయటకు అని వెళుతూ ఉంటావు కదా నీకు పనికొస్తుందని నీకు ఇస్తున్నాను అని రాజేంద్రప్రసాద్ అంటాడు..
ఇక పల్లవి శ్రియ ఇద్దరు మందు తాగినట్లు నటిస్తారు. కమల్ , శ్రీకర్ ఇద్దరినీ చావ కొడతారు. వీళ్లు నిజంగానే తాగారా లేదో తెలుసుకోవాల అన్నయ్య అని కమల్ టెస్ట్ చేస్తాడు.. అయితే వాళ్ళిద్దరూ తాగలేదని తెలియడంతో వాళ్ళిద్దర్నీ కచ్చితంగా బెల్టుతో కొట్టాలని అనుకుంటారు. కానీ మా అమ్మ వస్తుంది కదా.. ఫోన్ చేసింది. మా అమ్మకి నీట్ గా ఉండకపోతే అస్సలు ఉండదు అని ఇంటిని మొత్తాన్ని పల్లవి, శ్రియాలతో శుభ్రం చేయిస్తారు.
Also Read:మీనాను ఇరికించిన సురేంద్ర..బాలుపై శృతి సీరియస్..బాలుకు ఊహించని షాక్..
ఇక తర్వాత పార్వతి వెళ్లడానికి ఆటోని బుక్ చేయబోతుంటాడు అక్షయ్. అత్తయ్య గారు మీరు నా బండి మీద రండి నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను అని అవని అంటుంది. కానీ పార్వతి మాత్రం అస్సలు వినదు. వెళ్లకుండా అయినా ఉంటాను కానీ నీతో పాటు నేను ఎక్కడికి రాను అని అంటుంది. అక్షయ్ కూడా అమ్మ కోసం నేను ఆటో బుక్ చేస్తున్నాను నీ అవసరం మాకు ఏం అవసరం లేదు అని మొహం మీదే చెప్పేస్తాడు.. అయితే ఈరోజు ఆటోలు క్యాబ్లు అన్ని బంద్ మీరు మీ అబ్బాయి బుక్ చేసినట్లుగానే నా బండి మీద రండి అని అవని అంటుంది. పార్వతిని తీసుకొని అవని వాళ్ళ ఇంటికి వెళ్తుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో పల్లవి, శ్రియాలకు అవని పెద్ద షాక్ ఇవ్వబోతుంది.. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..