Illu Illalu Pillalu Today Episode june 25th: నిన్నటి ఎపిసోడ్ లో.. నర్మదను సాగర్ తీసుకుని వెళ్లి వాళ్ళ పుట్టింటి దగ్గర డ్రాప్ చేస్తాడు. మీ నాన్న పుట్టినరోజు అన్నావు కదా నువ్వు వెళ్లి మీ నాన్నకు వాచి గిఫ్ట్ గా ఇవ్వు నీ మీద నాకు కోపం మొత్తం పోతుంది అంతా మంచే జరుగుతుందని సాగర్ అంటాడు. కానీ నర్మద మాత్రం భయపడుతూ ఉంటుంది. భయపడవద్దు ఏమి కాదు నువ్వు వెళ్లి మీ నాన్నతో మాట్లాడి వచ్చేసేయ్ అని అంటాడు.. సాగర్ ఎంత ధైర్యం చెప్తున్నా సరే నర్మద మాత్రం లో లోపల టెన్షన్ పడుతూనే ఉంటుంది. నువ్వు రావా అని అడిగితే.. ఈరోజు మీ నాన్న పుట్టినరోజు కాబట్టి నువ్వు వెళ్లి కనిపిస్తే ఆయన కోపం మొత్తం పోతుంది అని అంటాడు.. నర్మద లోపలికి వెళ్ళగానే వాళ్ళ నాన్న తనపై కోపంతో వాచ్ ని విసిరి కొట్టేస్తాడు. నీ భర్త గురించి నువ్వు ఏం చెప్తావు అని దారుణంగా సాగర్ ని అవమానిస్తారు. నర్మదా సాగర్ లో కన్నీళ్లతో బయటకు వచ్చేస్తారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. లేచిపోయి పెళ్లి చేసుకుందని కూతురి పై కోపంతో అరుస్తాడు. నర్మదా తండ్రి అన్నమాట తలుచుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. సాగరు బండి ఆపి పెళ్లికి ముందే నేను రైస్ మిల్ లో పనిచేస్తున్న సంగతి నీకు తెలుసు కదా నర్మదా అని అంటాడు. మా నాన్న ప్రతి మాటకి నా దగ్గర సమాధానం లేదు. లేచిపోయి పెళ్లి చేసుకున్నాను అన్న కోపం ఆయనకు తగ్గిపోయింది. కానీ ఆయన బాధంతా అల్లుడు ఏం చేస్తున్నాడో చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉందని అంటున్నాడు అని నర్మదా అంటుంది..
నువ్వు గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్నానని నాతో అన్నావు కానీ దాని గురించి నువ్వు మాట్లాడట్లేదు అని నర్మదా సాగర్ నిలదీస్తుంది. అటు ప్రేమ ఎగ్జామ్ కోసం కాలేజ్ కు వెళ్తుంది. ధీరజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ధీరజ్ రాగానే ఫుడ్ డెలివరీ ఇచ్చి లేట్ అయింది అని చెప్పగానే ఫీల్ అవుతుంది. తనకి ఇద్దరు కలిసి ఎగ్జామ్ హాల్ లోకి ఎంటర్ అవుతారు.. ఇద్దరూ మాట్లాడుకుంటూ రూమ్ లో వెళ్లి కూర్చుంటారు.
నర్మదా తన తండ్రి అన్న మాటలకు పుట్టింటికి దూరమైనా నన్ను బాధతో కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే సాగరు బైక్ ఆపి నర్మదను దిగమని చెప్తాడు. దిగిన నర్మదా ఒకచోట కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. మా నాన్నకు నేను లేచిపోయి పెళ్లి చేసుకున్నాను. నాకు కోపం తగ్గింది. కానీ నా అల్లుడు ఏమి ఉద్యోగం చేస్తున్నాడో చెప్పాలి అంటూ అనుకుంటున్నాడు. మీకు మీ నాన్న రైస్ మిల్లు తప్ప ఉద్యోగం చేయాలని ఆలోచన లేదు. పెళ్లికి ముందు నేను గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటానని అన్నావు. కానీ ఇప్పుడు మాత్రం రైస్ మిల్లు తప్ప ఏది చేయట్లేదు అని నర్మదా అడుగుతుంది.
నాకు పెళ్లి సంబంధం చూశారని నిన్ను వదులుకోలేక.. నీ ప్రేమను చంపుకోలేక.. నీ జాబ్ గురించి ఆలోచించకుండానే పెళ్లి చేసుకున్నాను. నువ్వు ఇది ఎప్పుడు ఆలోచిస్తావో సాగర్. వేరే జాబ్ చేయమని నేను చెప్పే స్థాయిలో లేను. నీకు నువ్వు ఆలోచించుకుంటే మంచిది అని అక్కడి నుంచి నర్మదా వెళ్ళిపోతుంది. ఎగ్జామ్ హాల్లో క్వశ్చన్ పేపర్ చూడగానే ధీరజ్ మొహంలో రంగులు కనిపిస్తాయి. ఈ క్వశ్చన్ పేపరు నాదేనా ఎవరిదైనా ఇచ్చారా? అంటూ ధీరజ్ ఆలోచిస్తూ ఉంటాడు. ప్రేమ మాత్రం క్వశ్చన్ పేపర్లో ఉన్న ప్రశ్నలకు జవాబులు రాస్తూ ఉంటుంది.
ధీరజ్ చూసి ఏమైందిరా చదివి అన్ని వచ్చేసాయా రాస్తున్నావా అని అడుగుతుంది.. అయితే ధీరజ్ హాల్ టికెట్ పేరు రాశాను ఇది చూస్తుంటే నాకు ఏమీ గుర్తుకు రావట్లేదు అని అంటాడు.. ధీరజ్ ని చూసి ప్రేమ జాలిపడి ఆన్సర్లు చూపిస్తుంది. అది చూసిన ఇన్విజిలేటరు వాళ్ళిద్దర్నీ లేపుతాడు. క్వశ్చన్ పేపర్ లోనే చెక్ చేస్తాడు. ఆన్సర్ పేపర్లో ప్రేమ ఐలవ్యూ రాసి ఉండడం చూసి షాక్ అవుతాడు. ఇద్దరం భార్యాభర్తలం మాకు మాటల్లేవు అందుకే ఇలా రాశాను అని ఏమంటుంది ప్రేమ.. మొత్తానికైతే ప్రేమ ధీర ఇద్దరు సక్సెస్ ఫుల్ గా ఎగ్జామ్ ని కంప్లీట్ చేస్తారు..
Also Read: అవనికి అడ్డంగా దొరికిన చక్రధర్.. పల్లవి బండారం బయటపడుతుందా..?
ఇక ప్రేమ బయటకు వెళుతూ తన ఫ్రెండ్స్ తో ఏదైనా చిన్న కాలేజీలో జాయిన్ అవ్వాలని అనుకుంటున్నాను. పెద్ద కాలేజీలో చదవాలంటే చాలా డబ్బులు కట్టాల్సి వస్తుంది. ధీరజ్ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది అని అంటుంది. నిన్న ఫీల్ అవుతాడు. ఇక ఇంటి దగ్గర వేదవతి తన ఇంట్లో వాళ్ళు కనిపించడం లేదని ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడు అక్కడికి వచ్చిన రామరాజు ఏంటి మీ ఇంట్లో వాళ్ళ కోసం చూస్తున్నావా? ఈమధ్య వాళ్లు కనిపించట్లేదు ఎక్కడికి వెళ్లారు? అని అడుగుతుంది.. నాకు అదే అర్థం కావట్లేదు ఎక్కడికి వెళ్లారు అని వేదవతి అంటుంది. ఇక రామరాజు తన చిన్న కొడుకు గురించి బాధపడుతుంటే శ్రీవల్లి ఏదో జరుగుతుంది అని ఆలోచిస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..