BigTV English
Advertisement

Gambhir- Bumrah: ఓటమి బాధలో ఉన్న టీమిండియా కు మరో షాక్.. టెస్ట్ సిరీస్ నుంచి బుమ్రాను తొలగించిన గంభీర్!

Gambhir- Bumrah: ఓటమి బాధలో ఉన్న టీమిండియా కు మరో షాక్.. టెస్ట్ సిరీస్ నుంచి బుమ్రాను తొలగించిన గంభీర్!

Gambhir- Bumrah: ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా మధ్య జరిగిన తొలి టెస్ట్ లో భారత్ ఓటమిని చవిచూసింది. ముఖ్యంగా తొలి ఇన్నింగ్స్ లో మూడు సెంచరీలు సాధించారు టీమిండియా బ్యాటర్లు. ఒక దశలో 430/3 పరుగులు చేయడంతో ఈ టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా విజయం సాధిస్తుందని అంతా భావించారు. కానీ 471 పరుగులకే ఆలౌట్ కావడం అందర్ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక ఇంగ్లాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో తొలి ఓవర్ లోనే వికెట్ కోల్పోవడంతో ఇక ఇంగ్లాండ్ ని ఆలౌట్ చేయడం పెద్ద కష్టమేమి కాదని టీమిండియా భావించింది. అభిమానులు అలాగే అనుకున్నారు. కానీ చివరికీ 465 పరుగులు చేసింది. ఇక భారత్ రెండో ఇన్నింగ్స్ లో 364 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే ఇంగ్లాండ్ జట్టు 371 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది. 5 వికెట్లు మాత్రమే కోల్పోయి 373 పరుగులు చేసింది. దీంతో ఇంగ్లాండ్ జట్టు విజేతగా నిలిచింది.


Also Read : KL Rahul : కేఎల్ రాహుల్ కు ఇన్ని భాషలు వచ్చా… తమిళ్, కన్నడ, హిందీ… కూడానా

ఆ ప్లాన్ లో ఎలాంటి మార్పులేదు : గంభీర్ 


ఇలా టీమిండియా ఓటమిలో ఉండగానే మరో షాక్ తగిలింది. టీమిండియా కీలక బౌలర్ బుమ్రా కేవలం మూడు మ్యాచ్ లు మాత్రమే ఆడుతాడని టీమిండియా కోచ్ గంభీర్ వెల్లడించారు. ఇందుకు ఇంగ్లాండ్ తో తొలి టెస్ట్ లో భారత ఓటమికి బౌలర్ల వైఫల్యమే ప్రధాన కారణం అని స్పష్టంగా తెలుస్తోంది. వాస్తవానికి తొలి ఇన్నింగ్స్ లో బుమ్రా 5 వికెట్లు తీస్తే.. రెండో ఇన్నింగ్స్ లో మాత్రం ఒక్క వికెట్ కూడా తీయలేదు. ఈ నేపథ్యంలో అనుభవం ఉన్న బుమ్రాను సిరీస్ మొత్తం ఆడించాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ మ్యాచ్ అనంతరం దీనిపై కోచ్ గంభీర్ మాట్లాడుతూ ప్లాన్ లో ఎలాంటి మార్పు లేదని చెప్పారు. బుమ్రా మూడు మ్యాచ్ లే ఆడతాడని.. అతని వర్క్ లోడ్ మేనేజ్ చేయడం చాలా ముఖ్యం అని తెలిపాడు.ఇంగ్లాండ్ తో జరిగే 5 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఇప్పటికే ఒక టెస్ట్ మ్యాచ్ లో ఆడాడు. మిగతా రెండు మ్యాచ్ లు ఎప్పుడూ ఆడతాడనే నిర్ణయం మాత్రం ఇంకా తీసుకోలేదని వెల్లడించాడు గౌతమ్ గంభీర్.

టీమిండియా అనూహ్యంగా ఓటమి..

మరోవైపు ఇటీవల బుమ్రా స్థానాన్ని భర్తీ చేయడంతో పాటు ఏ పరిస్థితుల్లోనైనా మ్యాచ్ ని గెలిపించే నాణ్యమైన బౌలర్లు తమ వద్ద ఉన్నారని ఇటీవలే టెస్ట్ కెప్టెన్ శుబ్ మన్ గిల్ పేర్కొన్నాడు. ఇక తొలి టెస్ట్ మ్యాచ్ ల్లో కనీసం డ్రా గా నైనా ముగిస్తుందనుకుంటే.. అనూహ్యంగా ఓటమిని చవిచూసింది టీమిండియా. భారత్ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ చేయకపోవడంతో టీమిండియా కి మైనస్ అయింది. భారత బౌలర్ల పై విరుచుకుపడిన ఇంగ్లాండ్ బ్యాటర్లు 371 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేసింది. ఇంగ్లాండ్ బ్యాటర్ బెన్ డకెట్ 170 బంతుల్లో 149 పరుగులు చేశాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. జాక్ క్రాలీ 65, జో రూట్ 53 నాటౌట్, జేమీ స్మిత్ 44 నాటౌట్ గా నిలిచాడు. భారత బౌలర్లలో ప్రసిద్ కృష్ణ 2/92, శార్దూల్ ఠాకూర్ 2/51 వికెట్లు తీయగా.. కీలక బౌలర్ బుమ్రా మాత్రం ఒక్క వికెట్ కూడా తీయకపోవడం గమనార్హం.  

 

Related News

RCB For Sale: RCB పేరు మార్పు, ఇక‌పై ZCB…బెంగ‌ళూరు జ‌ట్టుకు కొత్త ఓన‌ర్ ఎవ‌రంటే ?

IND VS SA: ద‌క్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్, షెడ్యూల్‌, బ‌లాబ‌లాలు ఇవే..ఉచితంగా ఎలా చూడాలంటే

Hong Kong Sixes 2025 : హార్దిక్ పాండ్యాను కాపీ కొట్టిన పాకిస్తాన్..ఛీ.. ఛీ ఎంతకు తెగించార్రా

IPL 2026: SRH జ‌ట్టులో ఫిక్సింగ్..అంబానీతో చేతులు క‌లిపి ద‌గా, కావ్యపాప స్కెచ్ చూడండి !

T20 World Cup 2026: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 షెడ్యూల్‌, వేదిక‌లు ఇవే…హైద‌రాబాద్, విశాఖ‌కు అన్యాయం ?

Cricket players : ఇప్ప‌టి క్రికెట‌ర్లు ఆ వైట్ క్రీమ్ ను ఎందుకు వాడ‌టం లేదో తెలుసా..?

IPL 2026-SSMB 29 : ఐపీఎల్ ఫ్యాన్స్ కు చిచ్చులు పెడుతున్న మహేష్-జక్కన్న, వేలం ఎప్పుడంటే?

Hong Kong Sixes 2025 Final: హాంకాంగ్‌ సిక్సెస్ 2025 విజేత‌గా పాకిస్తాన్..6వ సారి ట్రోఫీ, ప్రైజ్ మ‌నీ ఎంతంటే

Big Stories

×