Illu Illalu Pillalu Today Episode june 8th: నిన్నటి ఎపిసోడ్ లో.. శ్రీవల్లి వేదవతి ఒంటరిగా ఉండడం చూసి బుట్టలో వేసుకోవాలని ప్రయత్నాలు చేస్తుంది. నీ వేదవతి మాత్రం నర్మద ఉంటే నాకు చాలా టైం పాస్ అయ్యేది గలగల మాట్లాడుతుంది. దానికోసం నేను ఇప్పుడు వెయిట్ చేస్తున్నాను అని అనుకుంటుంది. శ్రీవల్లి అక్కడికి వచ్చి అత్తయ్యని ఎలాగైనా బుట్టలో వేసుకోవాలని అనుకుంటుంది. కానీ వేదవతి మాత్రం నీతో మాట్లాడితే ఏదో ఒకటి ఫిట్టింగ్ పెట్టేస్తావ్ అనుకొని లోపల ఏదైనా పని ఉంటే చూసుకో వెళ్ళవమ్మా అనేసి అంటుంది. నర్మదా రావడం చూసి ఇదేంటబ్బా ఆరు గంటలకు రావాల్సింది మూడు గంటలకే వచ్చేసిందని అనుకుంటుంది. నర్మద దగ్గరకెళ్ళి ఏంటి నువ్వు ఇంత తొందరగా వచ్చేసావని అడుగుతుంది. నర్మదా వాంతులు అవుతున్నాయి అనడంతో ఎగిరి గంతేస్తుంది. శ్రీవల్లి షాక్ అవుతుంది. ప్రేమ ధీరజ్ కోసం పరుగులు పెడుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ప్రోమో విషయానికొస్తే.. నర్మదా వేదవతితో మాకు ఆల్రెడీ శోభనం జరిగిపోయింది అని బాంబు పేలుస్తుంది.. వీళ్లిద్దరు మాట్లాడుకోవడం శ్రీవల్లి చాటుగా వింటుంది. శోభనం జరిగిందా అదేంటే ఎక్కడ జరిగింది ఒక ముహూర్తం పాడు పద్ధతి ఏమీ లేకుండా మీరు ఎలా శోభనం చేసుకున్నారు అని వేదవతి టెన్షన్ పడుతుంది. నా హైదరాబాద్ డ్రిప్ కి వెళ్ళాం కదా అక్కడే జరిగిపోయింది అని నర్మదా సిగ్గు పడిపోతుంది.. వేదవతి సీరియస్ గా ఉంటుంది.. శ్రీవల్లి నర్మదకు నిజంగానే కడుపు వచ్చిందా.. మా అమ్మ చెప్పినట్లే అత్తయ్య కోడల్ని నెత్తిన పెట్టుకొని చూసుకుంటుంది అలా జరగకుండా చూసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది..
ప్రేమ ధీరజ్ తో వెళ్లాలని సమయం గడపాలని పరుగులు పెడుతుంది.. వీరజ్ బస్ స్టాప్ కి రావడం చూసి ప్రేమ అతనితో సైకిల్ మీద ఇంటికి వెళ్లాలని అనుకోని పరుగులు పెడుతుంది. మొత్తానికి ధీరజ్ తో సైకిల్ పై వస్తుంది. రాత్రి అందరు సరదాగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటారు. ఇప్పుడే ఇక్కడికి వచ్చిన కామాక్షి ఏంటి అందరూ సరదాగా కూర్చుని మాటలు కబుర్లు చెప్పుకుంటున్నారు అని అంటుంది. నాన్నగారు లేరా అని వెటకారంగా మాట్లాడుతుంది. నాన్నగారు లేరు కాబట్టే మేము ఇలా కూర్చొని మాట్లాడుకుంటున్నాం అని సాగర్ సమాధానం చెప్తాడు.
కామాక్షి వేదవతి దగ్గరికి వచ్చి ఇంట్లో సరుకులు అయిపోయాయి అమ్మ సరుకులు కావాలి అని సంచి తెచ్చేస్తుంది. ఏదైనా కావాలంటే నే వస్తావా మొన్ననే కదా తీసుకెళ్లింది అప్పుడే అయిపోయాయి అని అంటుంది.. అప్పుడే అక్కడికి రామరాజు వస్తాడు. ఏంటమ్మా ఇలా వచ్చావని కామాక్షిని అడుగుతాడు. నీ మీద బెంగతో వచ్చాను అన్న అని కామాక్షి అంటుంది. మీ మీద బెంగతో కాదు ఇంట్లో సరుకులు అయిపోయాయంట తీసుకెళ్లడానికి వచ్చింది అని వేదవతి అంటుంది. తీసుకెళ్లనివే నా కూతురే కదా అని రామరాజు అంటాడు.
ఇక కామాక్షి వెళ్ళగానే రామరాజు పంతులు గారిని కలిసి వచ్చాను అని వేదవతితో అంటాడు. బడిపంతులు ఎందుకు ఏ బడికి వెళ్ళాలి అని వేదవతి అడుగుతుంది. దానికి రామరాజు మొన్న ఒకేచూరులో రెండు శోభనాలు జరగకూడదని అన్నారు కదా.. పంతులు గారిని అడిగి వచ్చాను శోభనానికి ముహూర్తం పెట్టారు అని చెప్పగానే వేదవతి షాక్ అవుతుంది. నర్మదా ఈ విషయం ఎవరికీ తెలియదు కదా అత్తయ్య గారు మేనేజ్ చేసుకుంటారులే అనేసి అనుకుంటుంది.
ఆ మాట వినగానే శ్రీవల్లి పగలబడి నవ్వుతుంది. అందరూ శ్రీవల్లి దగ్గరికి వస్తారు. ఇద్దరికి ఆల్రడీ శోభనం అయిపోయింది మామయ్య గారు అని నర్మదా గుట్టు రట్టు చేస్తుంది.. ఆ మాట వినగానే నర్మదా షాక్ అయిపోతుంది. అటు ప్రేమ అద్భుతంగా భరతనాట్యం చేస్తుంది. అది చూసిన ధీరజు నువ్వు 10 మందికి పిల్లలకి డాన్స్ క్లాస్ చెప్పొచ్చు.. అలా బతికేయొచ్చు అని సలహా ఇస్తాడు. ఆ మాట వినగానే ఇదేదో బాగుందని ప్రేమ ఆలోచిస్తుంది. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. శ్రీవల్లి చెప్పింది రామరాజు నమ్ముతాడా లేదా అన్నది సోమవారం ఎపిసోడ్ లో చూడాలి..