Rinku Singh Engagement: టీమిండియా స్టార్ క్రికెటర్ రింకూ సింగ్… తన అభిమానులకు అదిరిపోయే శుభవార్త చెప్పాడు. అతి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు టీమిండియా డేంజర్ ఆటగాడు రింకూ సింగ్. టీమిండియా క్రికెటర్ రింకూ సింగ్.. ఓ ఎంపీని పెళ్లి చేసుకోబోతున్నట్లు మొన్నటి నుంచి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే… ఇవాళ ఎంగేజ్మెంట్ కూడా జరగబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. టీమిండియా స్టార్ ఆటగాడు రింకూ సింగ్, సమాజ్వాది పార్టీ పార్లమెంట్ సభ్యురాలు ప్రియా సరోజ్… ఇవాళ ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.
Also Read: Sharayu Kulkarni- Pant: మీ దుంపలు తెగ…ఈ జంపింగ్స్ ఏంట్రా… పంత్ తరహాలో మరో లేడీ సెలెబ్రేషన్స్
పెద్దల సమక్షంలోనే ఎంగేజ్మెంట్ కార్యక్రమం
టీమిండియా స్టార్ ఆటగాడు రింకు సింగ్ అలాగే సమాజ వాది పార్టీ పార్లమెంటు సభ్యురాలు ప్రియా సరోజ్ నిశ్చితార్థం ఇవ్వాలా లక్నోలో జరగనుంది. పెద్దల సమక్షంలోనే లక్నోలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాదాపు 300 మంది అతిధుల సమక్షంలో రింకు సింగ్ అలాగే ప్రియా సరోజ్ నిశ్చితార్థం జరగబోతున్నట్లు కథనాలు వస్తున్నాయి. ఇవాళ మధ్యాహ్నం సరిగ్గా 1:00 ప్రాంతంలో… రింకు సింగ్ అలాగే ప్రియా సరోజ్ ఎంగేజ్మెంట్ కార్యక్రమం నిర్వహించబోతున్నట్లు సమాచారం అందుతుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.
నవంబర్ 18 వ తేదీన పెళ్ళి
ఇవాళ ఎంగేజ్మెంట్ జరగనుండగా… నవంబర్ 18వ తేదీన వారణాసిలో రింకూ సింగ్ అలాగే ప్రియా సరోజ్ పెళ్లి వేడుక జరగబోతున్నట్లు కూడా చెబుతున్నారు. ఇప్పుడు ముహూర్తాలు సరిగ్గా లేకపోవడంతో నవంబర్లో.. పెళ్లి పెట్టుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే వీళ్ళిద్దరి పెళ్లిపైన ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినా సోషల్ మీడియాలో మాత్రం వార్తలు అయితే వస్తున్నాయి.
అసలు ఎవరు ఈ ప్రియా సరోజ్ ?
పేదరికంలో ఉన్న రింకు సింగ్… ఓ పార్లమెంటు సభ్యురాలు అయిన ప్రియా సరోజ్ ను పెళ్లి చేసుకోవడం చాలా గ్రేట్. రింకు సింగ్ ను పెళ్లి చేసుకోవడానికి కారణం అతని సక్సెస్. తన తండ్రి గ్యాస్ సిలిండర్లు వేసే వ్యక్తి అయినప్పటికీ…. క్రికెట్ లో తన దూకుడు చూపించి టీం ఇండియా దాకా వెళ్ళాడు రింకూ సింగ్. ఈ నేపథ్యంలోనే రింకు సింగ్ అలాగే సమాజ్వాది పార్టీ ఎంపీ ప్రియా సరోజ్ ఇద్దరు ప్రేమలో పడ్డట్లు సమాచారం. ఆ ప్రేమ కాస్త ఇప్పుడు పెళ్లి వరకు వచ్చినట్లు చెబుతున్నారు. ఇది ఇలా ఉండగా ప్రియా స రోజు ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మచిలీషహర్ నియోజకవర్గానికి పార్లమెంటు సభ్యులుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అదే సమయంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో లాయర్ గా కూడా కొనసాగుతున్నారు ప్రియా సరోజ్. ముఖ్యంగా ప్రియా రోజు తండ్రి తుఫాని సరోజ్ కూడా ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో… ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అంటే మనోడు ఎమ్మెల్యేకు అల్లుడు కాబోతున్నాడు… అదే సమయంలో ఎంపీపీ భర్త కాబోతున్నాడు.