Illu Illalu Pillalu Today Episode March 12th : నిన్నటి ఎపిసోడ్ లో.. భాగ్యం తన భర్తకి అన్నం పెట్టి నువ్వు సంపాదించి పెట్టడానికి ఇదే ఎక్కువ అనేసి అంటుంది దానికి శ్రీవల్లి వాళ్ళ నాన్నమ్మ మీ అమ్మ గడుసుదే కాదు మొగుణ్ణి ఎలా తిప్పాలో అలా తిప్పుతుంది అనేసి అంటుంది. ఇక శ్రీవల్లి మాత్రం చందు ఇంకా ఫోన్ చేయలేదని ఫోన్ ని పట్టుకొని అటు ఇటు చూస్తూ ఉంటుంది. అమ్ము మీ అల్లుడు ఇంకా ఫోన్ చేయలేదే అనేసి అడుగుతుంది. ఫోన్ చెయ్యకపోతే నువ్వే ఫోన్ చెయ్ అమ్మ చేసి చేయకుండా ఒక మిస్డ్ కాల్ అట్ట ఇవ్వు అనేసి అంటుంది ఇక శ్రీవల్లి అలానేని మిస్డ్ కాల్ ఇస్తుంది. ఇలా మిస్డ్ కాల్ ఇచ్చి అలా చెప్పి చెప్పకుండా మెసేజ్ లు చేస్తే అల్లుడుగారు లైన్ లోకి వస్తారని అంటుంది. వాట్సాప్ లో మెసేజ్ చేస్తుంది. చందు మొత్తానికి తన దారిలోకి వచ్చేసాడని భాగ్యం అనుకుంటుంది.. బుజ్జమ్మ ధీరజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ధీరజ్ ఇంకా రాలేదని బాధపడుతూ ఉంటుంది. నాన్నన్న మాటలకి ధీరజ్ ఎంత నొచ్చుకున్నాడో ప్రేమ ధీరజ్ ఇంకా రాలేదనేసి ఎదురుచూస్తుంది. నర్మదా వచ్చి ఏంట అత్తయ్య ఇంకా ఎదురు చూస్తున్నారు ఎవరి కోసం అంటే ధీరజ్ ఇంకా రాలేదమ్మా.. వాడు బాధ పడ్డాడు అనేసి బుజ్జమ్మ అంటుంది.. ధీరజ్, ప్రేమ అన్నం తినకుండా వెళ్లడం పై తల్లి తల్లడిల్లి పోతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. బుజ్జమ్మ తన చిన్న కొడుకు తినలేదని బాధపడుతూ ఉంటుంది. కనీసం వీళ్ళకి పాలైన ఇవ్వాలని అనుకుంటుంది. బుజ్జమ్మ పాలు తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు పాలు తాగడానికి ఇష్టపడరు. మీరు తినలేదని నేను కూడా తినలేదు అది మీకు ఇష్టమా మీరు తినకుండా ఈ అమ్మాయి ఎలా తింటుందని అంటూ బాధపడతారు. బుజ్జమ్మ ఎంత చెప్పినా నాకు ఈ పాలు వద్దు ఏమీ వద్దు అమ్మ నేను సంపాదించిన రోజే నేను ఇంట్లో తింటాను అనేసి ధీరజ్ అంటాడు.. బుజ్జమ్మ ఒకవైపు తన కొడుకుని ఎంతగా అడుగుతున్నా కూడా సమాధానం చెప్పడు కనీసం పాలైన కాకపోతే ఈ తల్లి మనసు తల్లిడిల్లి పోతుందని కన్నీళ్లు పెట్టుకుంటుంది.. కానీ ధీరజ్ ప్రేమ మాత్రం ఇద్దరూ బుజ్జమ్మతో మాట్లాడటానికి ఇష్టపడరు మౌనంగా ఉండి కన్నీళ్లు పెట్టుకుంటారు.
తన చిన్న కొడుకు ఇంట్లో ఏం తినలేదని బుజ్జమ్మ బాధపడుతూ ఉంటుంది. అప్పుడే సాగర్ వాళ్ళ రూమ్ లో చూస్తుంది వీళ్ళిద్దరికీ ఏమైంది వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి ఏంటి దూరంగా పడుకున్నారు అని ఆలోచిస్తూ ఉంటుంది. ఉదయం లేవగానే నర్మదా అత్తయ్య నాకు ఒక మంచి టీ పెట్టిస్తారని అడుగుతుంది. బుజ్జమ్మ నర్మదకు టీ ఇచ్చిన తర్వాత నీకు నడిపోడికి ఏదైనా గొడవలు జరిగాయా ఎందుకు మీరు ఇద్దరు దూరంగా పడుకున్నారు ఇద్దరు మధ్య ఏదైనా సమస్య ఉందా ఉంటే చెప్పు నేను మీ ఇద్దరిని కూర్చోబెట్టి సరి చేస్తానని బుజ్జమ్మ అడుగుతుంది. కానీ నర్మద మాత్రం మా ఇద్దరి మధ్య ఎటువంటి గొడవలు లేవు మేము చాలా అన్యోన్యంగా ఉన్నాము అనేసి అంటుంది.
మరి మీరిద్దరూ ఎందుకు దూరంగా పడుకున్నారు అంటే అదేం లేదు అత్తయ్య నేను ఆఫీస్ కి వెళ్తానని వెళ్ళిపోతుంది. ఇక సాగరు వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి నాకు బాక్స్ రెడీ చేసావమ్మా నేను రైస్ మిల్ కి వెళ్ళొస్తానని అడుగుతాడు. దానికి బుజ్జమ్మ సాగర్ ని పిలిచి మిద్దరేమైనా గొడవ పడుతున్నారా? మీరిద్దరూ ఎందుకు దూరంగా పడుకోవాల్సి వచ్చింది? ఒకే గదిలో ఉంటూ కూడా మీరిద్దరూ దూరంగా ఎందుకు పడుకున్నారు అని బుజ్జమ్మ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది. దానికి సాగర్ మా ఇద్దరి మధ్య దూరం ఏం లేదమ్మా మేము బాగానే ఉన్నామే అని అంటాడు.
కానీ బుజ్జమ్మ మాత్రం నా మీద ఒట్టేసి నిజం చెప్పు అని అడుగుతుంది. ఇక మొత్తానికి సాగరు అసలు విషయాన్ని చెప్తాడు. ఇంట్లో పెద్దవాళ్ళకి పెళ్లి కాకుండా మనిద్దరం పెళ్లి చేసుకున్నాము మామయ్యకి ఆ బాధ ఉంటుంది ఇప్పుడు మనిద్దరం కలిసింది పిల్లలు కానీ ఏం సంతోష పడతామని నర్మదా అందని సాగర్ చెప్తాడు. మావయ్య ఇప్పటికే చాలా కోపంగా ఉన్నారు ఇప్పుడు మనిద్దరం సంతోషంగా ఉంటే వాళ్ళు ఇంకా బాధపడతారు అని నర్మదా అన్నట్లు సాగర్ చెప్తాడు ఆ విషయము రామరాజు కూడా వింటాడు..
దానికి బుజ్జమ్మ కన్నీళ్లు పెట్టుకుంటుంది. వయసులో చిన్నదైనా కూడా తాను చాలా పెద్దగా ఆలోచించిందని బుజ్జమ్మంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో రామరాజు నర్మదా సాగర్ లోని కలిపే ప్రయత్నం చేస్తాడేమో చూడాలి..