Nindu Noorella Saavasam Serial Today Episode : అనామిక అరుంధతిలా మారిపోయిందని స్వామిజీ చెప్పగానే.. మనోహరి ఇరిటేటింగ్ గా ఫీలవుతుంది. నా సైడు నుంచి ఎలాంటి తప్పు జరగలేదని.. అనామిక అరుంధతిలా మారాలంటే తాళి ముట్టుకోవాలని మీరే చెప్పారు. ఇప్పుడెలా మారుతుంది. అయినా నేను ఇంటికి వెళ్లి నా కళ్లతో చూస్తే కానీ నమ్మను అంటూ స్వామిజీకి చెప్పి మనోహరి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరోవైపు ఇంట్లో అరుంధతిలా మారిపోయిన అనామికకు జరిగింది మొత్తం చెప్తాడు గుప్త. దీంతో ఇక మనోహరి ఆట కట్టిస్తాను అంటూ కోపంగా బయటకు వెళ్తుంది ఆరు. బాలిక నా మాట విను అంటూ గుప్త ఆపే ప్రయత్నం చేస్తుంటాడు. ఇంతలో గేటు ఓపెన్ చేసుకుని మిస్సమ్మ వస్తుంది. మిస్సమ్మను చూసిన ఆరు పరుగెత్తుకెళ్లి హగ్ చేసుకుంటుంది. ఎమోషనల్‌గా ఫీలవుతుంది. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని అసలు అనుకోలేదు. నా సంతోషాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నాను అంటుంది ఆరు.
దీంతో మిస్సమ్మ ఏమైంది మీకు అంత ఎమోషనల్ అయిపోతున్నారు.. అనామిక గారు ఏమైంది అని అడుగుతుంది. దీంతో గుప్త దగ్గరకు వచ్చి బాలిక చెప్పితిని కదా..? నువ్వు ఉన్న ఈ దేహం యొక్క నామధేయం అనామిక. నీ సోదరియే ఈ అనామికకు ఉద్యోగం ఇచ్చినది. కావున నువ్వు ఏమి మాట్లాడినను అనామిక వలే మాట్లాడవలెను. ముందు ఆ ఉపనేత్రము ధరింపుము అని గుప్త చెప్పగానే.. ఆరు.. అది నాకు జాబ్ రావడం వల్లే మా ఇంట్లో పెద్ద ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది. నాకు ఈ జాబ్ రావడానికి కారణం మీరే కదా. అందుకే మిమ్మల్ని చూడగానే కొంచెం ఎమోషనల్ అయ్యాను అంటుంది. దీంతో మిస్సమ్మ.. మేము మీకు జాబ్ ఇవ్వలేదు అనామిక గారు ఇంతకీ అత్తయ్యా, మామయ్య ఎక్కడున్నారు. అని అడగ్గానే.. టెంపుల్ వెళ్లారు అని చెప్తుంది. అయితే సరే మనం పిల్లల దగ్గరకు వెళ్దాం ఐదు నిమిషాల్లో రెడీ అయి వస్తాను అని మిస్సమ్మ లోపలికి వెళ్తుంది.
వెనక నుంచి మనోహరి వచ్చి గట్టిగా ఆరు అని పిలుస్తుంది. షాకింగ్‌గా ఆరు నిలబడిపోతుంది. వెంటనే షాక్ లోంచి తేరుకుని చెప్పండి మనోహరి గారు అంటుంది. దీంతో మను గారా..? అదేంటి కొత్తగా అని అడుగుతుంది. కొత్తగా ఏంటండి.. ఎప్పుడూ అలాగే కదా పిలుస్తాను అంటుంది. దీంతో మనోహరి ఆరు అంటే పలికి అనామకలా మాట్లాడుతుందేంటి..? అని మనసులో అనుకుని నువ్వు.. అంటూ అడుగుతుంటే.. తెలియనట్టు కొత్తగా అడుగుతున్నారేంటండి.. రోజూ చూస్తున్నారు మాట్లాడుతున్నారు కదా..? ఇందాకా కూడా అను అని పిలిచారు కదా..? ఏంటి అలా చూస్తున్నారు. మీరు అను అనే కదా అన్నారు అని అడగ్గానే.. మనోహరి అవును అంటుంది. దీంతో మళ్లీ ఆరు.. అయినా గేమ్ అడుతూ అలా ఎలా పడుకున్నానండి. మీరు కూడా బలే వారండి లేపకుండా వెళ్లిపోయారు అనగానే.. చెప్పాను కదా పనుండి వెళ్లిపోయాను అని చెప్పగానే.. సరే మీరు రెడీ అయి రండి స్కూల్‌కు వెళ్దాం అంటుంది ఆరు.
దీంతో మనోహరి సరే అంటూ లోపలికి వెళ్తుంది. వెంటనే గుప్త ఏం చేయుచున్నావు బాలిక నువ్వు అనామికలా మాట్లాడటమేంటి..? నువ్వు నువ్వులా మాట్లాడి ఆ బాలికను భయపెట్టి నీ కుటుంబానికి తనను దూరంగా పంపుము.. అని చెప్పగానే.. మాటతో చెబితే వినే స్టేజీలోనో.. నిజం చెప్తానంటే భయపడే స్టేజీలోనో మనోహరి లేదు గుప్త గారు. ప్రస్తుతం నేను అనామిక అని చెబితేనే తనను ఇంట్లోంచి పంపించేయగలను.. మోసాన్ని మోసం చేసే భయపెట్టాలి అని చెప్తుంది ఆరు. కొంచెం దూరం వెళ్లిన మనోహరి స్వామిజీ చెప్పింది నిజమైతే ఆరు నన్ను చూడగానే గొడవ చేసేది. అలా చేయకుండా ఉందంటే అనామికనే అయ్యుండాలి. మరి స్వామిజీ ఎందుకలా చెప్పారు. అసలు నేను మాట్లాడింది అనామికతోనా..? ఆరుతోనా..? అని మనసులో అనుకుని లోపలికి వెళ్లిపోతుంది.
స్కూల్‌లో గేమ్స్ ప్రారంభం కావడానికి సమయం ఉంటుంది. పిల్లలను వారి పేరెంట్స్ తీసుకొస్తుంటారు. అదంతా గమనించిన అంజు, అమ్ము, ఆకాష్, ఆనంద్ నలుగురు ఆరును గుర్తు చేసుకుని బాధపడతారు. అమ్ముంటే మన పక్కనే ఉండేది కదా..? అని ఎమోషనల్ అవుతుంటారు. అమ్మ ఉంటే డాడీ కూడా వచ్చే వారు అనుకుంటారు. ఇంతలో మిస్సమ్మ, ఆరు స్కూల్‌కు వస్తారు. పిల్లలను చూసిన ఆరు ఎమోషనల్ ఆపుకోలేక పరుగెత్తుకెళ్లి వారిని హగ్ చేసుకుంటుంది. మిస్సమ్మ విచిత్రంగా చూస్తుంది. పిల్లలను హగ్ చేసుకున్న ఆరు అంజు తల్లి అనగానే.. అంజు కూడా అంతే ఎమోషనల్‌గా అమ్మా అని పిలుస్తుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ఫస్ట్ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?