Illu Illalu Pillalu Today Episode March 29th: నిన్నటి ఎపిసోడ్ లో.. చందు తన తమ్ముడి లేడని బాధపడుతూ ఉంటాడు. దానికి టైం అవుతుందని పంతులుగారు పిలుస్తున్నారు. త్వరగా రెడీ అయ్యి రావాలి అల్లుడు అని వాళ్ళ మామ పిలుస్తాడు. కానీ చిన్నోడు లేకపోవడం బాధగా ఉంది మామ అని అందరూ బాధపడతారు. అటు శ్రీవల్లిని నర్మద వాళ్ళు రెడీ చేస్తుంటారు. మీ అబ్బాయికి నగలు వేస్తారా మా అక్కకి నగలు వేయరా అనేసి అంటుంది. శ్రీవల్లి వాళ్ళ చెల్లెలు. నగలు ఇస్తే ఎందుకు వెయ్యము అనేసి చందు వాళ్ళ చెల్లెలు అంటుంది. మా అక్కకి నగలు లేకపోవడమేంటి 50 కేజీల బంగారం ఉంది ఇదిగో ఇక్కడే అనేసి గొప్పగా చెప్తుంది. ఆ నగలను చూసి అందరూ షాక్ అవుతారు. ఇన్ని నగలు ఉన్నాయా అనేసి ఆశ్చర్యపోతారు. వీటికి ఇలా షాక్ అయితే మా ఇంట్లో చాలా ఉన్నాయి. బ్యాగులు బరువు అవుతున్నాయని తీసుకురాలేదు. మరి అవి చూస్తే మీరు ఏమైపోతారు అని గొప్పగా చెప్తుంది. ఇంక చాలా నగలు ఉన్నాయని వీళ్ళు ఆశ్చర్యపోతారు. అయితే నర్మద మాత్రం ఈ నగలను ఎక్కడ కొన్నారు చాలా బాగున్నాయి అనేసి అంటుంది. చందు ఎంగేజ్మెంట్ కి ధీరజ్ నీళ్ల క్యాన్లు వేయడానికి వస్తాడు. భాగ్యం చూస్తుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. భాగ్యం నువ్వు రామరాజు గారి చిన్నబ్బాయి కదా మరి నువ్వేంటి ఇలా వాటర్ కెళ్ళు మూసుకున్నావ్ ఏంటి అని రాంరాజు వాళ్ళ ఫ్యామిలీని పిలుస్తుంది భాగ్యం. మీ చిన్నబ్బాయి ఎందుకు రాలేదంటే చాలా ముఖ్యమైన పని ఉండి రాలేకపోయాడు అన్నారు ఇదేనా ఆ ముఖ్యమైన పని వాటర్ కాయలు వేస్తున్నాడు అనేసి భాగ్యం ఎగతాళిగా మాట్లాడుతుంది. భాగ్యం మాటలకి అందరూ ఫీలవుతారు. కానీ ప్రేమ మాత్రం తప్పేంటి గౌరవంగా బతుకుతున్నాడు తప్ప దోపిడీ చేయలేదు దొంగతనం చేయలేదు కదా అనేసి వెనకేసుకొస్తుంది. అది చూసిన ధీరజ్ షాక్ అవుతాడు. తన చిన్న చిన్న ఖర్చులకోసం తాను సొంతంగా జాబ్ చేయాలని అనుకున్నాడు అలా ఇలా చేస్తున్నాడేమో అంతేకానీ వేరే ఉద్దేశం అయితే లేదు కదా అని ప్రేమ ధీరజ్ని వెనకేసుకొని వస్తుంది.
ప్రేమ మాట్లాడటం చూసి ప్రతి ఒక్కరూ సంతోషంగా ఫీల్ అవుతారు. అదేం లేదమ్మా అంత పెద్ద ఇంట్లో ఉండి కూడా ఇలా నీళ్ళకి వేయడంతో ఇంట్లో ఏమైనా సమస్యలేమో? లేకపోతే ఏదైనా గొడవలు జరిగాయేమో? తెలుసుకుందామని అడిగాను అంతే తప్ప మరి ఏ ఉద్దేశం లేదమ్మా అనేసి భాగ్యం అంటుంది. మా ఇంట్లో ఎటువంటి గొడవలు జరగలేదు ఎవరికీ ఎవరు కాకుండా పోరు ఇప్పుడు అందరూ సంతోషంగా ఉన్నారు కదా వెళ్లి ఈ నిశ్చితార్థం వేడుకల్ని ఇంకా సంతోషంగా చేద్దామని అందరూ అంటారు. ఇక ధీరజ్ మీ అందరూ నిశ్చితార్థం వేడుకలు అయిపోయేంత వరకు ఉండమని కోరుతారు. అందరి మాట కాదనలేక ధీరజ్ అక్కడ ఉంటాడు..
చందు నిశ్చితార్థం అనుకున్నట్లుగానే చాలా గ్రాండ్ గా జరుగుతుంది. అందరూ కలిసి డాన్సులు వేస్తూ సరదాగా గడుపుతారు. రామరాజు కన్నీళ్లు పెట్టుకుంటారు. ఇప్పటివరకు నువ్వు లేని లోటు తెలిసింది నువ్వు వచ్చిన తర్వాత సందడితో ఇప్పుడు తెలుస్తుంది. నీ మీద నాకు ఎటువంటి కోపం లేదు రా నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకొని పరువు తీసేవానే బాధ తప్ప మరి ఉద్దేశం లేదురా అని రామరాజు మనసులో అనుకుంటాడు. ఆ తర్వాత అందరూ కలిసి ఫోటోలు దిగుతారు.
భాగ్యం వాళ్లు కూడా డాన్సులు వేసి సరదాగా గడుపుతారు. మొత్తానికైతే ఎంగేజ్మెంట్ అనుకున్న దానికంటే గ్రాండ్ గానే పూర్తవుతుంది. ఇక భాగ్యం అనుకున్నట్లుగానే అందరికీ డబ్బులను ఇస్తుంది. భాగ్యం తెలివిని చూసి తన భర్త పొగడ్తల వర్షం కురిపిస్తారు. నువ్వు అనుకున్నట్లుగానే 14333 రూపాయలతో ఎంగేజ్మెంట్ జరిపించాలవని ప్రశాంసిస్తాడు.. ఇంత సంతోషంలో కూడా నువ్వెందుకు ఏదో ఆలోచిస్తున్నావు అనేసి అందరూ అడుగుతారు. ఎంగేజ్మెంట్ అయితే పూర్తయింది కానీ ఇక ఆలోచించేది పెళ్లి నేనెప్పుడూ చిన్న విషయాలు గురించి కాదు దాని తర్వాత గురించి ఆలోచిస్తాను అని భాగ్యం అంటుంది.
ఈ పెళ్లి సవ్యంగా జరగాలంటే అల్లుడు గారే ముందుకు రావాలి అని భాగ్యం ప్లాన్ వేస్తుంది. ఆయనే దగ్గరుండి పెళ్లి జరిపించాలని అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. మరి భాగ్యం ప్లాను వర్కౌట్ అవుతుందో లేదో సోమవారం ఎపిసోడ్లో చూడాల్సిందే..