BigTV English

Restaurant Service charges: కస్టమర్ల వద్ద సర్వీస్‌ ఛార్జీలు వసూలు చేసే రెస్టారంట్లపై చర్యలు.. ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం

Restaurant Service charges: కస్టమర్ల వద్ద సర్వీస్‌ ఛార్జీలు వసూలు చేసే రెస్టారంట్లపై చర్యలు.. ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం

Restaurant Service charges| హోటళ్లు, రెస్టారెంట్లు ఆహార బిల్లులలో సర్వీస్ ఛార్జీలను (Service charge) కలిపి వసూలు చేస్తుండడంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సర్వీస్‌ ఛార్జీలను వినియోగదారులు కచ్చితంగా చెల్లించేలా బిల్లులో వాటిని కలిపి ఇవ్వడం వారి హక్కులను ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొంది. రకరకాల పేర్లతో ఛార్జీలు వసూలు చేయడం అన్యాయమైన వ్యాపార విధానాలతో సమానమని కోర్టుమండిపడింది. సర్వీస్‌ ఛార్జీలు చెల్లించాలా.. వద్దా..? అనే విషయాన్ని కస్టమర్ల విచక్షణకే వదిలేయాలని సూచించింది.


ఈ విధంగా వినియోగదారులపై అదనపు ఛార్జీలను విధించే రెస్టారంట్లపై తగిన చర్యలు తీసుకోవాలని వినియోగదారుల రక్షణ ప్రాధికార సంస్థకు సూచించింది. హోటళ్లు బిల్లులలో సర్వీస్‌ ఛార్జీలు వసూలు చేయడాన్ని నిషేధిస్తూ వినియోగదారుల రక్షణ ప్రాధికార సంస్థ (CCPA) గతంలో చేసిన మార్గదర్శకాలను సవాలు చేస్తూ పలు రెస్టారంట్ సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు కొట్టివేసింది.

Also Read: భార్య‌కు ప్రియుడితో పెళ్లి చేసిన భ‌ర్త‌, అసలేం జరిగిందంటే..


పిటిషన్ దాఖలు చేసిన రెస్టారెంట్ల సంఘం

జీఎస్టీ తరహాలో ఆహార బిల్లులో సర్వీస్ ఛార్జీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో ఫెడరేషన్ ఆఫ్ హోటల్స్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (FHRAI) పిటిషన్ దాఖలు చేసింది. అయితే వినియోగదారుల రక్షణ చట్టాన్ని ఉల్లంఘించిన కారణంగా రెస్టారెంట్లు ఆహార బిల్లులో సర్వీస్ ఛార్జీని తప్పనిసరి చేయరాదని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. ఫుడ్ బిల్లుపై సర్వీస్ ఛార్జీ విధించవద్దని రెస్టారెంట్లకు సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) జారీ చేసిన మార్గదర్శకాల చెల్లుబాటును ఢిల్లీ హైకోర్టు తన నిర్ణయంలో సమర్థించింది.

రెస్టారెంట్ అసోసియేషన్‌కు హైకోర్టు జరిమానా:

కోర్టు మార్గదర్శకాలను సవాలు చేసినందుకు ఢిల్లీ హైకోర్టు రెస్టారెంట్ అసోసియేషన్‌కు లక్ష రూపాయల జరిమానా విధించింది. జూలై 4, 2022న సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) జారీ చేసిన మార్గదర్శకాలను అదే నెల చివరిలో హైకోర్టు నిలిపివేసింది.

కేంద్ర ప్రభుత్వం వాదన ఏంటి?

కొన్ని రకాల హోటళ్లు, రెస్టారెంట్లలో వసూలు చేస్తున్న సర్వీస్‌ ఛార్జీలు.. పన్నుల కిందికి రావని కేంద్ర ప్రభుత్వం 2017లో ప్రకటించింది. వీటిని సేవా పన్నుగా పరిగణించడం పొరపాటేనని తెలిపింది. వాటి చెల్లింపులను వినియోగదారుడి అంగీకారానికే వదిలేస్తున్నట్లు అన్ని హోటళ్లలో బోర్డు ప్రదర్శించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. మార్గదర్శకాల ప్రకారం బిల్లులో సేవా రుసుము కాలమ్‌ను ఖాళీగా వదిలేయాలి. అయినప్పటికీ హోటళ్లు కస్టమర్లపై ఇష్టారాజ్యంగా సర్వీస్‌ ఛార్జీలు విధిస్తున్నాయి.

సర్వీస్ ఛార్జ్ డిమాండ్ చేస్తే ఫిర్యాదు చేయండి:

మీ నుంచి లేదా మీ పరిచయస్తుల నుంచి ఒక రెస్టారెంట్ యజమాని బలవంతంగా సర్వీస్ ఛార్జీని వసూలు చేస్తే.. మీరు దాని గురించి వినియోగదారుల కోర్టు, ఆహార వినియోగదారుల అథారిటీలో ఫిర్యాదు చేయవచ్చు. ఇక్కడ ఫిర్యాదు నమోదైతే ఆ రెస్టారెంట్ యజమానిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.

Related News

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

MP News: పట్టించుకోని వాహనదారులు.. పెట్రోల్ కష్టాలు రెట్టింపు, ఏం జరిగింది?

Big Stories

×