Illu Illalu Pillalu Today Episode may 14th: నిన్నటి ఎపిసోడ్ లో.. వేదవతి బాధపడుతూ కూర్చోండడం చూసి నర్మదా ఎలాగైనా సరే అత్తయ్యని కాస్త నవ్వించాలి లేదంటే ఇలాగే బాధపడుతుందని అక్కడికి వస్తుంది. ఎందుకు మీరు ఇంత బాధ పడుతున్నారు అని నర్మదా అడుగుతుంది. ఇంట్లో ఇలాంటి జరుగుతుంటే నేను ఎంత ఎలా సంతోషంగా ఉంటానని అనుకుంటున్నాను అని నర్మదను అంటుంది. మీరు ఎందుకింత బాధగా ఉన్నారో నాకు అర్థం కావట్లేదు. ధీరజ్ మాత్రం ఒక క్లారిటీతో ఉన్నాడు.. నా భార్యను ఎలా పోషించుకోవాలి తను జీవితంలో ఎలా పైకి రావాలని ఆలోచనతో ఉండడం మంచిదే కదా అని నర్మదా అంటుంది. అయితే అప్పుడే ప్రేమ అక్కడికి వస్తుంది. నీ గురించి మీ ఆయన గారు ఎంత గొప్పగా చెప్పారు ఇప్పుడే నాకు అత్తయ్య చెప్పింది మంచిదే కదా.. ఎప్పుడు లేనిది ఇంత సిగ్గు పడుతున్నావ్ అంటే ఏదో ఉంది అని నర్మదా అనగానే ప్రేమ మురిసిపోతుంది.. ఇక నర్మదా ట్రైనింగ్ కి వెళ్లాలని ఆ విషయాన్ని మావయ్యకి చెప్పి ఒప్పించాలని వేదవతితో అంటారు. వేదవతి రామరాజు తో చెప్పడానికి ఒప్పుకుంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. నర్మదా వేదవతి దగ్గరికి వచ్చి నేను ఆఫీస్ పని మీద హైదరాబాద్ కు వెళ్లాలి మీరు పర్మిషన్ ఇప్పియ్యాల అత్తయ్య మామయ్యకి మీరు ఎలాగైనా ఒప్పించి చెప్పాలని అంటుంది. శ్రీవల్లికి తెలిస్తే ఖచ్చితంగా చెడగొడుతుందని అందరూ నాటక మాడుతారు. నర్మదా వేదవతిని తన మాటలతో బురిడీ కొట్టించి హైదరాబాద్ కు వెళ్లేందుకు రామరాజు తో చెప్పించాలని అనుకుంటుంది.. రాత్రి అందరూ కూర్చొని ఉండగా వేదవతి మనము అన్నవరం వెళ్లాలని అనుకుంటున్నాం కదండి అని అంటుంది.. నర్మదా నాకు కుదరదు ఆ టైంలో వెళ్లాలంటే నేను హైదరాబాద్ కి వెళ్ళాలి అని ఇండైరెక్టుగా హింట్ ఇస్తుంది..
నా కుదరదా అత్తయ్య గారు నేను రాలేను అని నర్మదా అంటుంది.. అదేంటే పక్కన పిడుగు పడినట్లు అరుస్తున్నావు. నాకు జాబ్ కు సంబంధించి ట్రైనింగ్ ఉంది అత్తయ్య రెండు రోజులు నేను హైదరాబాద్ కి వెళ్లి ట్రైనింగ్ తీసుకొని రావాలి అని అంటుంది. శ్రీవల్లి మాత్రం ఎలా వెళ్తావు అత్తయ్య గారు మొగ్గ అని చెప్పారు కదా అని మధ్యలో కలగజేసుకుంటుంది. వేదవతి మాత్రం ట్రైనింగ్ అన్నారు కదా దాని గురించి కచ్చితంగా తెలుసుకోవాలి కదా అప్పుడే జాబ్ ఉంటుంది కదా అనేసి ఇన్ డైరెక్ట్ గాని ముగ్గురు కలిసి రామరాజుకు అర్థమయ్యేలా చెప్పేస్తారు.
ఏంటండీ మీరు మాట్లాడరు నర్మదా ట్రైనింగ్ కి వెళ్లాలని అనుకుంటుంది. తను కష్టపడి తెచ్చుకున్న జాబ్ ని మనవల్ల పోగొట్టుకుంటే బాధగా ఉంటుంది.. కదా తనని పంపిద్దాం అండి అనేసి అంటుంది.. అవును వెళ్లేసి వస్తే మంచిదే కదా అనేసి రామరాజు కూడా ఒప్పుకుంటాడు. శ్రీవల్లి మాత్రం ఏంది మంచిది అత్తయ్య గారు మొక్కు అని చెప్తున్నారు కదా.. వినవేంటి నర్మదా ఈ జాబు ఇప్పుడు కాకపోతే మరో వారం వెళ్లొచ్చు నీదంతా మానుకో అనేసి అంటుంది.
అక్కడ ఉండడానికి ఏర్పాట్లు ఎవరు చేస్తారు అని నర్మదా అంటుంది.. హోటల్లో రూమ్ బుక్ చేస్తారు అక్కడ ఉండి ట్రైనింగ్ తీసుకుని రావచ్చు అని నర్మదా అంటుంది. ఒక్కదానివే వెళ్లి హోటల్లో ఉంటావా అని అంటుంది. ఎందుకు నువ్వు ఒక్కదానివే హోటల్ లో ఉంటావు అని శ్రీవల్లి ఫిట్టింగ్ పెట్టేస్తుంది.. రామరాజు కూడా శ్రీవల్లికి సపోర్ట్ చేస్తూ ఒక్కటే వెళ్తే ప్రాబ్లం కదా అని అంటాడు. నర్మదా సాగర్ ని తీసుకొని వెళ్తానని అంటుంది.. నడిపి మరిది లేకపోతే రైస్ మిల్లులో ఎవరు చూసుకుంటారని మళ్ళీ శ్రీవల్లి అంటుంది. ఇక వేదవతి మాత్రం తన టాలెంట్ ఉపయోగించి రామరాజుని ఒప్పి చేస్తుంది.
వేదవతి తన ఇద్దరు కోడలు కలిసి శ్రీవల్లిని దూరం పెడుతున్నారని ఫీల్ అయ్యి తన తల్లికి ఈ విషయాన్ని ఫోన్ చేసి చెప్తుంది. ఇంక భాగ్యం కోడలని అందరినీ సమానంగా చూసుకునే మీ అత్తని నీ వైపు తిప్పుకోవాలంటే నువ్వు ఆ నమ్మకాన్ని మీ అత్తలో కలిగించాలి అని ధైర్యాన్ని నూరిపోస్తుంది. తర్వాత ధీరజ్ నాన్నకి ఇవ్వాల్సిన డబ్బులు గురించి ఆలోచిస్తూ ప్రేమకి చెప్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…