Illu Illalu Pillalu Today Episode may 16th: నిన్నటి ఎపిసోడ్ లో.. వేదవతి తన ఇద్దరు కోడలు కలిసి శ్రీవల్లిని దూరం పెడుతున్నారని ఫీల్ అయ్యి తన తల్లికి ఈ విషయాన్ని ఫోన్ చేసి చెప్తుంది. ఇంక భాగ్యం కోడలని అందరినీ సమానంగా చూసుకునే మీ అత్తని నీ వైపు తిప్పుకోవాలంటే నువ్వు ఆ నమ్మకాన్ని మీ అత్తలో కలిగించాలి అని ధైర్యాన్ని నూరిపోస్తుంది. ఇక శ్రీవల్లి తర్వాత రోజు వేదవతి దగ్గరికి వెళ్లి ఎలాగైనా అతని బుట్టలో వేసుకోవాలని ప్లాన్ చేస్తుంది. వేదవతి వంటగదిలో టీ పెట్టుకుంటూ ఉంటుంది శ్రీవల్లి ఎలాగైనా అతని బుట్టలో వేసుకోవాలని అనుకొని లోపలికి వెళ్తుంది. అత్తయ్య గారండీ ఏం చేస్తున్నారండి అని అడుగుతుంది. టీ పెడుతున్నానమ్మా అని వేదవతి అనగానే అయ్య బాబోయ్ నేనుండగా మీరు టీ పెట్టడమేంటండీ అత్తగారు అని శ్రీవల్లి షాక్ ఇస్తుంది. అది విన్న వేదవతి నేను తేనే కదమ్మా పెట్టేది అని అంటుంది. కోడల్ని నేనుండగా మీరు కనీసం స్పూన్ ని కూడా పక్కన పెట్టడానికి వీల్లేదు అని అంటుంది. అత్తయ్య గారండీ నన్ను మీరు వేరేగా చూస్తున్నారు మీ ఇద్దరి కోడల్ని మీకు ఎక్కువ మీ ముగ్గురు కలిసి నన్ను దూరం పెట్టేస్తున్నారని కన్నీళ్లు పెట్టుకున్నట్లు నటిస్తుంది. అది చూసిన వేదవతి కరిగిపోతుంది. దానికి శ్రీవల్లి వేదవతిని తన బుట్టలో వేసుకుంటుంది. తన ప్లాన్ గురించి బయట పెట్టేస్తుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. ప్రేమ పార్ట్ టైం జాబ్ ఇంట్లో నుంచి ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది. నర్మదగూడా ప్రేమ ఏం జాబ్ చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తుంది. ఇద్దరు మధ్యలో వాళ్ళ అత్త వేదవ తెచ్చి కూర్చుని తల పండిన నన్ను అడిగితే నేను ఐడియాలు చెప్తాను కదా అని అంటుంది.. ముగ్గురు కలిసి దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే వీళ్ళ ముగ్గురిని చూసిన శ్రీవల్లి అక్కడికి వచ్చి అత్తగారండి నాకు డబ్బులు ఇవ్వండి నేను వెళ్ళిపోతాను మా ఇంటికి అని అడుగుతుంది. అయ్యో ఏమైందమ్మా ఎందుకలా అడుగుతున్నామని వేదవతి అంటుంది. ముగ్గురు కలిసి నన్ను వేరు చేస్తున్న అత్తగారండి నాకు ఒక 20 రూపాయలు ఇస్తే నేను ఆటో ఎక్కి మా ఇంటికి వెళ్ళిపోతాను అని అంటుంది.
అదేం లేదమ్మా ప్రేమ ఇంట్లో కూర్చొని ఏ జాబ్ చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది. ఎలాంటి జాబ్ చేస్తే బాగుంటుందో అని ఆలోచిస్తున్నామని అంటుంది అయితే నేను మీ దగ్గరికి రానా అని మెరుపుతీగ లాగా వాళ్ళు మధ్యలో కూర్చుంటుంది.. శ్రీవల్లి తనకు తోచిన ఐడియా లని చెప్తుంది చివరికి పిల్లలకి ట్యూషన్ చెప్పడం ఐడియా బాగుంటుంది అందరూ దానికి ఓకే చెప్తారు.. నా పెద్ద కోడలు ఎంతైనా బంగారం మంచి ఐడియా ఇచ్చిందని వేదవతి పొగిడేస్తుంది.. నర్మదా మీకు పెద్ద కోడలంటే మీకు ఇష్టం కదా వెళ్లి ఊర్లో కూర్చోబెట్టుకొని ముద్దు పెట్టుకుని అని అంటుంది..
ఇక తిరుపతి రామరాజు దగ్గరికి వచ్చి ఎప్పుడు ఇండ్లు మిల్లు అంతేనా బావ కాసింత కళా పోషణ ఉండాలని ఓ సినిమాలోని పెద్దమనిషి అన్నాడు. మనం ఎక్కడికైనా బయటికి వెళ్లి తిరిగి వద్దామని అంటాడు.. నీ బాధ ఏంటి రా ఇప్పుడు అని రామరాజు అడుగుతాడు.. నర్మదా సాగర్లు బయటికి వెళ్తున్నారు కదా మనం కూడా ఎక్కడికైనా లాంగ్ ట్రిప్ కి వెళ్దామని తిరుపతి అంటాడు.. ఇలాంటి వాడిని మంచి ప్లేస్ కి పంపించాలని నేను ఫిక్స్ అయిపోయాను రా అని అనగానే తిరుపతి సంతోషంతో ఏంటి బావ ప్లేస్ అని అడుగుతాడు. నువ్వు వెళ్లడానికి సరైన ప్లేస్ అంటే కాశినే వెళ్తావా బుక్ చేస్తానని అంటాడు. ఊరుకో బావ నువ్వు నీ సరసాలు అని తిరుపతి అంటాడు.
ఆ తర్వాత సాగర్ నర్మదలు హైదరాబాద్ కి వెళ్లడానికి లగేజ్ ను ప్యాక్ చేసుకుని వచ్చేస్తారు. చందు శ్రీవల్లి కొత్తగా పెళ్లయ్యారు కాబట్టి ఎక్కడికైనా సరదాగా వెళ్ళండి అంటారు. ఏ సినిమాకి టికెట్ల రేట్లు విని రామరాజు షాక్ అవుతాడు. మావయ్య గారిని ఎలాగైనా బుట్టలు వేసుకోవాలని శ్రీవల్లి ఇంత డబ్బులు పెట్టి సినిమా చూడడం వల్ల ప్రయోజనం ఏంటి అని రివర్స్ అవుతుంది. అది విన్న రామరాజు నా కోడలు బంగారం అని పొగిడేస్తాడు. హైదరాబాదుకు వెళుతున్న సాగర్ కి వెయ్యి రూపాయలు చేతిలో పెట్టి ఇవి జాగ్రత్తగా వాడుకో పొదుపుగా వాడుకో డబ్బులు గురించి విలువ లేదా అని అరుస్తాడు. సరిపోవని సాగర్ చెప్పలేక బాధపడతాడు.. ధీరజ్ ఖర్చులకోసం డబ్బులు ఉంటాయి కదా అని కొంత డబ్బులు ఇస్తాడు. డబ్బులు ఇస్తుంటే తన భర్తని శ్రీవల్లి లోపలికి తీసుకెళ్లి పోతుంది. వేదవతి మాత్రం సాగరకి డబ్బులు ఇచ్చి ఏదైనా ఖర్చులుంటాయి కొత్తగా పెళ్లయిన వాళ్లు కదా సంతోషంగా ఉండండి అని పంపిస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో నర్మదను విడిచి పెట్టినందుకు వేదవతి ఫీలవుతూ ఉంటుంది. ఏమో తన ఫోన్ ఇచ్చి నర్మదకు ఫోన్ చేసి మాట్లాడమని అంటుంది.. ఇదంతా చూసిన శ్రీవల్లి కుళ్ళుకుంటుంది. ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్లో చూడాల్సిందే..